విశాఖపట్నం
విశాఖ కేజీహెచ్ కు వచ్చిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి
మంత్రి నారా లోకేష్ వెంట కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి సంధ్యారాణి, ఎంపీ శ్రీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్
ప్రమాదం జరిగిన తీరును కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్న మంత్రి లోకేష్
ధైర్యంగా ఉండాలని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ
ప్రభుత్వ పరంగా అన్ని విధాల అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు మంత్రి లోకేష్ హామీ
బాధిత కుటుంబాలకు అండగా నిలబడేందుకు వచ్చా
బాధిత కుటుంబాలకు అండగా ఉండేందుకే కేంద్రంలోని ఎన్డీయే, రాష్ట్రంలోని ఎన్డీయే, ఉప ముఖ్యమంత్రి తరలివచ్చారన్న మంత్రి లోకేష్
బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటాం
అందరం కలిసి పోరాడటం వల్లే స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోగలిగామన్న మంత్రి లోకేష్
ప్రమాదంపై కమిటీ నివేదిక తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన మంత్రి లోకేష్



















































