అమరావతి
జనం చెంతకే సంక్షేమం.. అర్హతే ప్రామాణికం..
అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇస్తూ..
ఇలా ప్రతియేడూ.. ఏటా రెండు పర్యాయాలు.. జనవరి- జూన్ లో అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన వారికి జూన్ / జూలైలో.. జూలై నుంచి డిసెంబర్ వరకు అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి మిగిలిపోయిన వారికి డిసెంబర్ / జనవరిలో అందిస్తూ..
ఆగస్టు, 2023 నుండి డిసెంబర్, 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని 68,990 అర్హులకు రూ. . 97.76 కోట్లను నేడు (05.01.2024) సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల లబ్ది అందించాలన్న తపనతో.. పథకం లబ్ది అందించిన తర్వాత కూడా పొరపాటున ఏ కారణం చేతనైనా మిస్ అయిన వారికి మరో అవకాశం ఇస్తున్న జగనన్న ప్రభుత్వం.. ఇలా డిసెంబర్, 2021 (బైయాన్యువల్ పథకం ప్రారంభించిన తేదీ) నుండి ఇప్పటి వరకూ 5 పర్యాయాల్లో అందించిన మొత్తం లబ్ధి రూ. 1,744.76 కోట్లు..
వీటితోపాటు క్రొత్తగా (ఆగస్టు 2023 – డిసెంబర్ 2023 వరకు) అర్హులైన మరో 1,17,161 మందికి పెన్షన్లు, 6,314 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 1,11,321 మందికి రైస్ కార్డులు, 34,623 మందికి ఇళ్ల పట్టాలను కూడా నేడు అందిస్తున్న జగనన్న ప్రభుత్వం..
జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 55 నెలల్లోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా లంచాలకు, వివక్షకు తావు లేకుండా ఇప్పటికే లబ్దిదారులకు నేరుగా (DBTరూపంలో) అందించిన ఆర్థిక సాయం రూ.2,46,551 కోట్లు..
దరఖాస్తు చేసుకోవడం ఎలా ?
ఆ 6 నెలల కాలానికి సంబంధించి అందించిన సంక్షేమ పథకాలకు అర్హత ఉండి ఆయా పథకాల లబ్ధి మిన్ అయిన వారికి మరో అవకాశం..
పథకాల లబ్ది అందించిన నెలలోపు గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.. అవసరమైతే వాలంటీర్ సేవలు వాడుకోవచ్చు లేదా 1902 కి ఫోన్ చేస్తే వారు తగు సూచనలు ఇస్తారు.. అవసరమైన పత్రాలతో సచివాలయాల్లో అప్లై చేసిన తర్వాత వెరిఫికేషన్ చేసి ఆరు నెలలకోసారి ఆ ఆరు నెలల్లో అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ధి అర్హులకు అందజేత.. ఇలా ఏటా రెండు పర్యాయాలు..!
లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత
సోషల్ ఆడిట్ కోసం గ్రామ/వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాల ప్రదర్శన.. లంచాలకు, కుల, మత, వర్గ, పార్టీల వివక్షకు తావులేకుండా పారదర్శకంగా పథకాల అమలు..
నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో అర్హులందరికీ పథకాల లబ్ధి..
ఆగష్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా పొరపాటున ఆయా సంక్షేమ పథకాల లబ్ధి అందుకోలేకపోయిన అర్హులకు జగనన్న ప్రభుత్వం నేడు అందిస్తున్న నగదు లబ్ధి వివరాలు..
ఈబీసీ నేస్తం – ఇప్పటికే లబ్దిపొందిన వారు – 4,39,068, పొరపాటున ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన లబ్ధిదారుల సంఖ్య – 4,180, అలా మిగిలిపోయినవారికి నేడు అందిస్తున్న లబ్ధి (రూ.లలో) 6,27,00,000
జగనన్న అమ్మ ఒడి – ఇప్పటికే లబ్దిపొందిన వారు – 42,61,965, పొరపాటున ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన లబ్ధిదారుల సంఖ్య – 40,616, అలా మిగిలిపోయినవారికి నేడు అందిస్తున్న లబ్ధి (రూ.లలో) 53,06,68,670
వైఎస్సార్ నేతన్న నేస్తం – ఇప్పటికే లబ్దిపొందిన వారు – 80,686, పొరపాటున ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన లబ్ధిదారుల సంఖ్య – 352, అలా మిగిలిపోయినవారికి నేడు అందిస్తున్న లబ్ధి (రూ.లలో) 84,48,000
వైఎస్సార్ కాపు నేస్తం – ఇప్పటికే లబ్దిపొందిన వారు – 3,57,844, పొరపాటున ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన లబ్ధిదారుల సంఖ్య – 1,884, అలా మిగిలిపోయినవారికి నేడు అందిస్తున్న లబ్ధి (రూ.లలో) 2,82,60,000
వైఎస్సార్ వాహన మిత్ర – ఇప్పటికే లబ్దిపొందిన వారు – 2,75,931, పొరపాటున ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన లబ్ధిదారుల సంఖ్య – 3,030, అలా మిగిలిపోయినవారికి నేడు అందిస్తున్న లబ్ధి (రూ.లలో) 3,03,00,000
జగనన్న చేదోడు – ఇప్పటికే లబ్దిపొందిన వారు – 3,25,020, పొరపాటున ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన లబ్ధిదారుల సంఖ్య – 15,016, అలా మిగిలిపోయినవారికి నేడు అందిస్తున్న లబ్ధి (రూ.లలో) 15,01,60,000
వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా – ఇప్పటికే లబ్దిపొందిన వారు – 29,934, పొరపాటున ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన లబ్ధిదారుల సంఖ్య – 1,912, అలా మిగిలిపోయినవారికి నేడు అందిస్తున్న లబ్ధి (రూ.లలో) 14,70,95,000
వైఎస్సార్ మత్స్యకార భరోసా – ఇప్పటికే లబ్దిపొందిన వారు – 1,23,519, పొరపాటున ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన లబ్ధిదారుల సంఖ్య – 2,000, అలా మిగిలిపోయినవారికి నేడు అందిస్తున్న లబ్ధి (రూ.లలో) 2,00,000