Promising young hero Sandeep Kishan and talented director VI Anand teamed up for the second time for another interesting project ‘Uru Parama Bhairavakona’. This film, which is being made as a fantasy adventure, will be produced by Rajesh Danda under the banner of Comedy Movies. Proudly presented by Anil Sunkara under the banner of AK Entertainments.
Balaji Gutta is the co-producer of this film.
The film’s first look poster, which the makers have already released on the occasion of Sandeep Kishan’s birthday, suggests that a fantasy world has been created for the film. Shekhar Chandra has given the soundtracks for this film. The makers started their musical journey by releasing their first single ‘Nijame Ne Saysana’.
Shekhar Chandra has composed the breezy romantic number picturized on Sandeep Kishan and Varsha Bollamma. Sid Sriram, with his magical voice, enchanted the audience even more. Sandeep Kishan was seen expressing his feelings for Varsha Bollamma in this fun song which became an instant hit. Shrimani provided the lyrics. The song topped the music charts with its amazing composition, beautiful singing and catchy lyrics. Sandeep Kishan’s dances are graceful. Varsha Bollamma looked very beautiful.
Kavya Thapar is playing another female lead and Raj Thota is providing the cinematography for this film. Chhota K Prasad is the editor and A Ramanjaneyulu is the art director. Bhanu Bhogavarapu and Nandu Savirigana are providing dialogues for this film.
Cast: Sandeep Kishan, Kavya Thapar, Varsha Bollamma and others
Technical Department: Story, Screenplay & Direction: VI Anand, Presentation: Anil Sunkara, Producer: Rajesh Danda, Co-Producer: Balaji Gutta, Banners: AK Entertainments, Comedy Movies, Music: Shekhar Chandra, DVP: Raj Thota, Editor: Chhota K Prasad, Art Director: A Ramanjaneyulu, Conversations: Bhanu Bhogavarapu, Nandu Savrigana, PRO: Vamsi-Sekhar
‘ఊరు పేరు భైరవకోన’ ఫస్ట్ సింగిల్ నిజమే నే చెబుతున్నా…
ప్రామిసింగ్ యంగ్ హీరో సందీప్ కిషన్, టాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ రెండవసారి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘ఊరు పేరు భైరవకోన’ కోసం జతకట్టారు. ఫాంటసీ అడ్వంచర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తునారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు.
బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత.
సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు ఇదివరకే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్.. ఈ సినిమా కోసం ఒక ఫాంటసీ వరల్డ్ ని క్రియేట్ చేశారని సూచించింది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సౌండ్‌ట్రాక్‌లను అందించారు. మేకర్స్ మొదటి సింగిల్ ‘నిజమే నే చెబుతున్నా’ విడుదల చేయడం ద్వారా మ్యూజికల్ జర్నీని ప్రారంభించారు.
సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మపై చిత్రీకరించిన బ్రీజీ రొమాంటిక్ నంబర్‌ను కంపోజ్ చేశారు శేఖర్ చంద్ర. సిద్ శ్రీరామ్ తన మ్యాజికల్ వాయిస్ తో మరింత ప్రత్యేకంగా ,మంత్రముగ్ధులను చేసాడు. ఇన్స్టెంట్ హిట్‌గా మారిన ఈ ఆహ్లాదకరమైన పాటలో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మపై తన భావాలను వివరిస్తూ కనిపించారు. శ్రీమణి సాహిత్యం అందించారు. అద్భుతమైన కంపోజిషన్, బ్యూటిఫుల్ సింగింగ్, ఆకట్టుకునే సాహిత్యంతో ఈ పాట మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలుస్తుంది. సందీప్ కిషన్ డ్యాన్స్‌లు గ్రేస్ ఫుల్ గా ఉన్నాయి. వర్ష బొల్లమ్మ చాలా అందంగా కనిపించింది.
కావ్య థాపర్ మరో కథానాయిక గా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు.
తారాగణం: సందీప్ కిషన్, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ తదితరులు
సాంకేతిక విభాగం: కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: విఐ ఆనంద్, సమర్పణ: అనిల్ సుంకర, నిర్మాత: రాజేష్ దండా, సహ నిర్మాత: బాలాజీ గుత్తా, బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, సంగీతం: శేఖర్ చంద్ర, డీవోపీ : రాజ్ తోట, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: ఎ రామాంజనేయులు, సంభాషణలు: భాను భోగవరపు, నందు సవిరిగాన, పీఆర్వో: వంశీ-శేఖర్