Date :31-03-2023
Amaravati: Sub-post office opening at VIT – AP University
The VIT – AP University. Sub Post Office started on 31. 03. 2023. This Sub Post Office was inaugurated by Chief Guest Aditya Kumar Naik, IPOS, Director – Postal Services, Andhra Pradesh Circle, a new sub-post office with postal code 522241.
On this occasion, Chief Guest Aditya Kumar Naik said that the Department of Posts (DOP) has been the backbone of the country’s communication and has been playing a vital role in the socio-economic development of the country for 150 years. With more than 1,55,000 post offices, the Department of Posts (DOP) has the widest postal network in the world, he said. VIT – AP University Sub Post Office provides postal services like Ordinary, Registered and Speed Post, Savings Bank Account, Postal ATM Card, Recurring Deposit, Sukanya Samriddhi Yojana, Time Deposits, Postal Life Insurance, Postal Provident Fund, Apart from Senior Citizens Scheme, Monthly He said that services such as Income Scheme, National Savings Certificate, Kisan Vikas Patra, Aadhaar Enrollment and Updation etc. can also be availed.
VIT – AP University Vice Chancellor Dr S.V. Kota Reddy said that the establishment of a sub post office in the premises of VIT – AP University is a joy and requested everyone to use the post office services. He thanked the Postal Department for considering the request of VIT-AP University and taking steps to start it in the campus.
VIT – AP University Registrar Dr Jagadish Chandra Mudiganti, Sivanageswara Rao (APMG-Staff and Vigilance, AP Circle) T. Veera Raghavu (Superintendent of Post Offices, Guntur Division), Srinivas (Assistant Superintendent of Posts – Mangalagiri, Post Office), Post Office staff, teachers, students and university staff participated.
విఐటీ – ఏపి విశ్వవిద్యాలయంలో సబ్ పోస్ట్ ఆఫీస్ ప్రారంభం
Date :31-03-2023
అమరావతి: విఐటీ – ఏపి విశ్వవిద్యాలయంలో సబ్ పోస్ట్ ఆఫీస్ ప్రారంభం
విఐటీ – ఏపి విశ్వవిద్యాలయంలో ది. 31. 03. 2023 నాడు సబ్ పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించారు. ఈ సబ్ పోస్ట్ ఆఫీస్ ను ముఖ్య అతిధి ఆదిత్య కుమార్ నాయక్, ఐపిఓఎస్, డైరెక్టర్ – పోస్టల్ సర్వీసెస్, ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్, 522241 పోస్టల్ కోడ్‌తో కొత్త సబ్-పోస్టాఫీసును ప్రారంభించారు.
ఈ సందర్బంగా ముఖ్య అతిధి ఆదిత్య కుమార్ నాయక్ మాట్లాడుతూ తపాలా శాఖ (డీఓపీ) దేశ కమ్యూనికేషన్‌కు వెన్నెముకగా నిలిచి 150 ఏళ్లుగా దేశ సామాజిక ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. 1,55,000 కంటే ఎక్కువ పోస్టాఫీసులతో, తపాలా శాఖ (డిఓపి) ప్రపంచంలోనే అత్యంత విస్తృత పోస్టల్ నెట్‌వర్క్‌ని కలిగి ఉందని ఆయన చెప్పారు. విఐటీ – ఏపి విశ్వవిద్యాలయంలోని సబ్ పోస్టాఫీసులో సాధారణ, రిజిస్టర్డ్ మరియు స్పీడ్ పోస్ట్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా, పోస్టల్ ATM కార్డ్, రికరింగ్ డిపాజిట్, సుకన్య సమృద్ధి యోజన, టైమ్ డిపాజిట్లు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, పోస్టల్ ప్రావిడెంట్ ఫండ్ వంటి పోస్టల్ సేవలను అందిస్తున్నామని, అంతే కాకుండా సీనియర్ సిటిజన్స్ స్కీమ్, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ మరియు అప్‌డేషన్ మొదలైన సేవలను కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు.
విఐటీ – ఏపి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| ఎస్.వి. కోటా రెడ్డి మాట్లాడుతూ విఐటీ – ఏపి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సబ్ పోస్టాఫీసు ఏర్పాటు చేయడం హర్షణీయమని, అందరూ పోస్టాఫీసు సేవలను వినియోగించుకోవాలని కోరారు. విఐటీ – ఏపి విశ్వవిద్యాలయ అభ్యర్థనను పరిశీలించి క్యాంపస్‌లో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినందుకు పోస్టల్ శాఖకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విఐటీ – ఏపి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా|| జగదీశ్ చంద్ర ముదిగంటి, శివనాగేశ్వరరావు (APMG-స్టాఫ్ అండ్ విజిలెన్స్, ఏ .పి సర్కిల్) టి. వీర రాఘవులు (పోస్టాఫీసుల సూపరింటెండెంట్, గుంటూరు డివిజన్), శ్రీనివాస్ (అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్స్ – మంగళగిరి, పోస్టాఫీసు), పోస్ట్ ఆఫీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విశ్వవిద్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.