స్బేర్ బ్యాంక్ గిగావాట్ ఎల్ఎల్ఎం సేవలను భారత్ లో విస్తరించండి
- యాంటీ-ఫ్రాడ్ నెట్‌వర్క్ కోసం సాంకేతిక సహకారం అందించండి
- ఎపిలో ఫార్మా, అగ్రి ఎక్స్ పోర్టర్లకు వ్యవస్థీకృత రుణాలు అందించండి
- స్బేర్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ అల్బర్ట్ యెఫిమోవ్ తో మంత్రి లోకేష్ భేటీ
మాస్కో:
రష్యా ప్రభుత్వ నియంత్రిత ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్‌బ్యాంక్ (Sber bank) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్ (Mr Albert Yefimov)తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… “వెస్ట్రన్ ప్లాట్ ఫాంలకు సురక్షితమైన లోకలైజ్డ్ జనరేటివ్ ఎఐ ప్రత్యామ్నాయ వ్యవస్థను అందించిన తరహాలోనే భారతదేశంలో బ్యాంకింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రిటైల్ రంగాలకు స్బేర్ బ్యాంక్ గిగాచాట్ ఎల్ఎల్ఎం ను విస్తరించండి. జాతీయ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) నెట్‌వర్క్ భద్రతను పటిష్టం చేస్తూ, స్బేర్‌బ్యాంక్ యొక్క అడ్వాన్స్డ్ వాయిస్ రికగ్నిషన్ & బయోమెట్రిక్ యాంటీ-ఫ్రాడ్ నెట్‌వర్క్‌ను భారతదేశ బ్యాంకింగ్ మౌలిక సదుపాయాల్లో ఇంటిగ్రేట్ చేసేలా సాంకేతిక సహకారం అందించండి. భారత్ లో పెద్దఎత్తున మున్సిపల్ కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడానికి కొనసాగుతున్న స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా స్బేర్‌బ్యాంక్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్, స్మార్ట్ ట్రాన్సిట్ సర్వైలెన్స్, డిజిటల్ సేఫ్టీ సిస్టమ్‌లను విస్తరించండి. ప్రపంచస్థాయి సాఫ్ట్ వేర్, ఎఐ ఇంజనీర్లకు వేగంగా శిక్షణ ఇవ్వడానికి, స్బేర్ బ్యాంక్ యొక్క గేమిఫైడ్, పీర్-టు-పీర్ “స్కూల్ 21″ కోడింగ్ అకాడమీలను భారతదేశంలోని ప్రధాన విద్యా కేంద్రాలలో ఏర్పాటుచేయండి. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారుల సౌలభ్యం కోసం దూరప్రాంతాలకు రూపాయి- రూబుల్ వాణిజ్య అనుమతులు, వ్యవస్థీకృత రుణాలు అందించాలి” అని లోకేష్ విజ్ఞప్తిచేశారు.
స్బేర్‌బ్యాంక్ (Sber bank) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్ స్పందిస్తూ… తమ బ్యాంక్ భారత్ లోని న్యూఢిల్లీ కార్యాలయం ద్వారా ద్వైపాక్షిక కమర్షియల్ ఫైనాన్స్, కార్పొరేట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు, భారత్-రష్యా క్లయింట్ డెలివరీ సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. బెంగళూరు లోని తమ ఐటీ హబ్ సరిహద్దు వాణిజ్య పరిష్కారాలు, రూపాయి-రూబుల్ యంత్రాంగాలకు సమన్వయ కేంద్రంగా పనిచేస్తుంది. న్యూఢిల్లీ, ముంబైలోని శాఖలు వ్యూహాత్మక వాణిజ్య కారిడార్లలో మౌలిక సదుపాయాల పెట్టుబడికి గేట్ వేలుగా పనిచేస్తున్నాయని తెలిపారు. కీలక వాణిజ్య డెస్క్‌ల ట్రెజరీ కార్యకలాపాలు, కార్పొరేట్ రుణాల మంజూరు, ఎంటర్‌ప్రైజ్ క్లయింట్ల కోసం ఏఐ-ఆధారిత డేటా విశ్లేషణలను నిర్వహిస్తున్నామని అన్నారు. స్బేర్ బ్యాంక్ గ్లోబల్ బ్యాంకింగ్ నెట్ వర్క్ ద్వారా మాసివ్ లిక్విడిటీ, అడ్వాన్స్డ్ డిజిటల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ కన్సల్టెన్సీ సేవలను అందిస్తున్నామని చెప్పారు. మంత్రి నారా లోకేష్ చేసిన ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
Sber bank గురించి…
స్బేర్ బ్యాంక్ రిటైల్ బ్యాంకింగ్, క్లౌడ్ సేవలు, ఏఐ (AI) రంగాలకు విస్తరించిన, ప్రభుత్వ నియంత్రణలోని ఒక ప్రధాన బ్యాంకు. మాస్కో కేంద్ర కార్యాలయంగా పనిచేస్తున్న ఈ బ్యాంకు 110 మిలియన్లకు పైగా రిటైల్, 3.5 మిలియన్ల కార్పొరేట్ ఖాతాదారులను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2.87లక్షలమంది ఉద్యోగులు కలిగిన ఈ బ్యాంకు 2025 ఆర్థిక సంవత్సరంలో 15.6 ట్రిలియన్ రూబుల్స్ (రూ.2.07లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. 12వేల శాఖలు కలిగిన స్బేర్ బ్యాంక్ ప్రతిరోజూ 8కోట్లకు పైగా డిజిటల్ వినియోగదారులకు సేవలు అందిస్తోంది.
Russia showcases sovereign AI capabilities; Andhra Pradesh explores opportunities for collaboration in AI, Quantum Computing and Digital Innovation
Minister Nara Lokesh holds discussions with Sberbank on emerging technologies, skilling and digital infrastructure
MOSCOW | JUNE 3, 2026
As part of Andhra Pradesh’s efforts to build global technology partnerships, Minister for Education, IT and Electronics, Nara Lokesh, held discussions with Mr. Albert Yefimov, Senior Vice President of Sberbank, one of Russia’s leading financial and technology institutions.
The meeting provided an opportunity to understand Russia’s progress in sovereign artificial intelligence, digital platforms, advanced computing and technology-led innovation. Discussions covered emerging areas including generative AI, digital public infrastructure, cybersecurity, fintech, quantum computing, workforce skilling and technology applications in public services.
Sberbank representatives presented an overview of the bank’s technology ecosystem, including its GigaChat large language model, AI research initiatives and digital solutions deployed across banking and public-facing services.
Minister Lokesh highlighted Andhra Pradesh’s ambition to emerge as a leading AI and technology hub and expressed interest in exploring areas where global best practices and technological innovations could support the state’s digital transformation agenda.
Exploring AI Applications in Healthcare
The discussions also touched upon the growing role of artificial intelligence in healthcare, including early disease detection, diagnostics, medical research, hospital operations and citizen-facing health services. Both sides exchanged views on how AI-driven solutions could improve healthcare accessibility and outcomes at scale.
Interest in Quantum Computing Collaboration
The meeting also explored developments in quantum computing and advanced research ecosystems. Minister Lokesh noted Andhra Pradesh’s interest in emerging technologies and discussed possibilities for future engagement between research institutions, technology companies and innovation ecosystems in areas related to quantum technologies.
Technology Skilling and Future Workforce Development
The two sides exchanged views on technology education and workforce development models. Discussions included global approaches to coding education, AI skills development and industry-oriented training programs aimed at preparing young professionals for the digital economy.
Supporting Trade and Economic Cooperation
The meeting also covered broader opportunities to strengthen economic engagement between India and Russia, including facilitating business linkages, supporting exporters and leveraging technology to improve cross-border trade ecosystems.
Mr. Albert Yefimov shared insights into Sberbank’s operations in India and its ongoing engagement with Indian businesses and institutions. Both sides agreed to remain in touch and explore areas of mutual interest as opportunities emerge.
The meeting forms part of Andhra Pradesh’s broader outreach during the Russia visit to engage with global technology leaders, research institutions and industry stakeholders across emerging sectors.
భారత తూర్పు తీరంలో కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుచేయండి
- పోర్టు ఆధారిత కెమికల్ లాజిస్టిక్స్ హబ్ ల నిర్మాణంలో భాగస్వామ్యం వహించండి
- రస్ కెమ్ గ్రూప్ డిప్యూటీ సిఇఓ ఇల్యా కోసిహ్ తో మంత్రి లోకేష్ భేటీ
మాస్కో: రష్యాలో గ్యాస్ ఫీల్డ్స్, డౌన్ స్ట్రీమ్ మిథనాల్ కెమికల్ ఇన్ ఫ్రా ప్రాజెక్టులను నిర్వహిస్తున్న ప్రముఖ కన్సార్షియమ్ రస్ కెమ్ గ్రూప్ (Ruschem Group) డిప్యూటీ సిఇఓ ఇల్యా కోసిహ్ (Mr. Ilya Kosyh), ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ దర్యా అషానియా (Ms. Darya Ashanina)లతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ…భారత్ దిగుమతి చేసుకునే పెట్రో కెమికల్, స్పెషాలిటీ కెమికల్స్ ఫీడ్ స్టాక్ లను అత్యాధునిక సాంకేతిక పరిజ్జానంతో ప్రాసెస్ చేసేందుకు వీలుగా భారత తూర్పుతీరంలోని విశాఖ-కాకినాడ పిసిపిఐఆర్ (పెట్రోలియం, కెమికల్ అండ్ పెట్రో కెమికల్ ఇన్వెస్టిమెంట్ రీజియన్ – PCPIR) పరిధిలో రస్ కెమ్ ఆధ్వర్యాన ఒక అధునాతన ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణం చేపట్టండి. భారత పోర్టుల్లో బల్క్ కెమికల్ స్టోరేజి, పంపిణీ మౌలిక సదుపాయాలను అభివృద్ధి, ప్రత్యేకమైన వాటర్ ఫ్రంట్ బెర్త్ ల నిర్మాణం, పోర్టు ఆధారిత కెమికల్ లాజిస్టిక్స్ హబ్ ల నిర్మాణంలో భాగస్వామ్యం వహించండి. రెడీ టు యూజ్ ప్లగ్ అండ్ ప్లే స్పేస్ లు, సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించుకుంటూ భారత్ లో ఒక ప్రధాన కొలాబరేటివ్ పాలిమర్ అప్లికేషన్ & మెటీరియల్ సైన్స్ పరిశోధనా కేంద్రం (ఆర్ & డి సెంటర్) ఏర్పాటుచేయండి. రస్ కెమ్ ప్రొడక్షన్ టెక్నాలజీ ఉపయోగించి…భారత్ లోని రెన్యువబుల్ ఎనర్జీ కారిడార్లను అనుసంధానిస్తూ… లో-కార్బన్ రసాయనాల మానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుచేయాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.
రస్ కెమ్ గ్రూప్ డిప్యూటీ సిఇఓ ఇల్యా కోసిహ్ స్పందిస్తూ… రస్ కెమ్ కార్పొరేట్ ఫ్రేమ్ వర్క్ ద్వారా భారత్ లో ప్రత్యేకమైన ఎస్ పివిలు, హోల్ సేల్ కెమికల్ డిస్ట్రిబ్యూషన్ మార్కెట్ లోకి ప్రవేశిస్తున్నట్లు చెప్పారు. ఇండస్ట్రియల్ పోర్టు ఫోలియో, మౌలిక సదుపాయాల కోసం ప్రీమియం రా మెటీరియల్స్, సాల్వెంట్స్, అడ్వాన్స్ డ్ పాలిమర్ మాడిఫైర్లను అందిస్తుందని తెలిపారు. లోకలైజ్డ్ ట్రేడ్ స్ట్రాటజీలో భాగంగా హై వ్యాల్యూ కెమికల్ సప్లయ్ పెంచడానికి రస్ కెమ్ నియంత్రణలో పనిచేయడానికి ఆసక్తిచూపే సంస్థలతో కలసి పనిచేస్తుందని అన్నారు. ముంబై, కాన్పూరులోని కీలక పంపిణీ కేంద్రాలు అత్యధిక స్వచ్చత కలిగిన హెక్సామైన్, టైటానియం డయాక్సైడ్ ను కర్మాగారాలకు చేరవేస్తాయని చెప్పారు. గ్లోబల్ ఎకోసిస్టమ్, ఖాతాదారులకు స్థిరమైన లార్జ్ స్కేల్ సప్లయ్ చైన్ లకు హామీ ఇచ్చేందుకు భారత్ లోని భారీ పెట్రో కెమికల్ ప్లాంట్లను రస్ కెమ్ ఉపయోగించుకుంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని రీజనల్ సప్లయ్ నోడ్ కీలకమైన కెమికల్ కాంపొనెంట్లను విశాఖపట్నం, కాకినాడలోని ఫార్మా, మ్యానుఫాక్చరింగ్ జోన్లకు చేరవేస్తుందని అన్నారు. మంత్రి నారా లోకేష్ చేసిన ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సిఇఓ తెలిపారు.
మాస్కో అడ్వాన్స్ డ్ ట్రాన్స్ పోర్ట్ సెంటర్ ను సందర్శించిన మంత్రి లోకేష్
- మంత్రి లోకేష్ బృందానికి మాస్కో రవాణా శాఖ ఉన్నతాధికారుల ఘనస్వాగతం
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
మాస్కో: రష్యా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్… రెండోరోజు మాస్కో అడ్వాన్స్ డ్ ట్రాన్స్ పోర్టు డెవలప్ మెంట్ సెంటర్ ను సందర్శించారు. మంత్రి లోకేష్ బృందానికి మాస్కో ట్రాన్స్ పోర్టు కాంప్లెక్స్ లోని సమాచార సాంకేతిక వ్యవస్థ, కమ్యూనికేషన్ డైరక్టరేట్, అటానమస్ ట్రాన్స్ పోర్టు రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ విభాగాధిపతి పావెల్ బోక్షా (Pavel Boksha), సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ హెడ్ ఓల్గా పిచికోవా (Olga Pishchikova), డిపార్ట్ మెంట్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ (మాస్కో) సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ అలెగ్జాండర్ సువోరోవ్ (Alexander Suvorov), మాస్కో ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ డైరక్టర్ జనరల్ సలహాదారు మస్తిస్లావ్ ఇసాకోవ్ (Mstislav Isakov) ఘనస్వాగతం పలికారు.
టికెటింగ్ సిస్టమ్స్ ను పరిశీలించిన లోకేష్ బృందం
అనంతరం యాంపి థియేటర్ లో మాస్కో అటానమస్ ట్రాన్స్ పోర్టు సెంటర్ అభివృద్ధి గురించి పావెల్ బోక్షా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించగా, మాస్కో ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సెంటర్ కార్యకలాపాలు, పనితీరు గురించి మస్తిస్లావ్ ఇసాకోవ్ తెలియజేశారు. తర్వాత పక్కనే ఉన్న అధునాతన టికెటింగ్ సిస్టమ్స్, డెవలప్ మెంట్ లేబరేటరీని లోకేష్ పరిశీలించారు.
మాస్కో అడ్వాన్స్ డ్ ట్రాన్స్ పోర్టు సెంటర్ పనితీరు అద్భుతం: లోకేష్
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రజా రవాణా వ్యవస్థల్లో మాస్కో అడ్వాన్స్ డ్ ట్రాన్స్ పోర్ట్ సెంటర్ ఒకటిగా ఉంది. ఇది రవాణా నెట్‌వర్క్ నిర్వహణ, డిజిటలైజేషన్, ప్రయాణీకుల సౌకర్యార్థం ప్రత్యేక సాంకేతిక వ్యవస్థ కలిగి ఉంది. ఇక్కడ మెట్రో, బస్సులు, ట్రాలీలు, ఎలక్ట్రిక్ రైళ్లు, బైక్-షేరింగ్, స్కూటర్లు అన్నీ ఒకే పర్యావరణ వ్యవస్థ కిందకు తీసుకు వచ్చారు. వీటిని ప్రయాణికులు ఒకే మొబైల్ అప్లికేషన్ ద్వారా సులభంగా ఉపయోగించుకోవచ్చు. సబర్బన్ ప్రాంతాలను ప్రధాన కేంద్రంతో అనుసంధానించే అత్యాధునిక రైలు ప్రాజెక్టు మాస్కో సెంట్రల్ డయామీటర్స్ (MCD) ఇందులో అంతర్భాగంగా ఉంది. ఇది నగరంలో మెట్రో రద్దీని తగ్గించడానికి ఎంతో దోహదపడుతోంది. మాస్కో అడ్వాన్స్ డ్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్, ట్రాన్స్ పోర్ట్ సెక్యూరిటీ మేనేజ్ మెంట్ సెంటర్లు కృత్రిమ మేధస్సు (AI) , సీసీ కెమెరాల ద్వారా నగరంలోని ట్రాఫిక్, భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడానికి ఇది సహాయపడుతోంది. మాస్కో అడ్వాన్స్ డ్ ట్రాన్స్ పోర్టు డెవలప్ మెంట్ సెంటర్ పనితీరు అద్భుతం. భారత్ లో కూడా ఇటువంటి వ్యవస్థలు రావాల్సి ఉందని లోకేష్ అన్నారు.
**
విశాఖలో ఎలక్ట్రానిక్ కాంపొనెంట్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటు చేయండి
- నెల్లూరులో సెమీకండక్టర్ పరికరాల తయారీ యూనిట్ స్థాపించండి
- శ్రీసిటీలో రోబోటిక్స్ & ఆటోమేషన్ సేవలను విస్తరించండి
- ఎలిమెంట్ గ్రూప్ ప్రెసిడెంట్ ఖజోవ్ ఒలెగ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
మాస్కో: రష్యాకు చెందిన ప్రీమియర్ సెమీకండక్టర్స్ తయారీ సంస్థ ఎలిమెంట్ గ్రూప్ (Element Group) ప్రెసిడెంట్ ఖజోవ్ ఒలెగ్ (Mr. Khazov Oleg), డైరక్టర్ (ఎక్సటర్నల్ రిలేషన్స్) కాన్ స్టాంటిన్ గోర్కోవ్ (Mr. Konstantin Gorshkov), ఇంటర్నేషనల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ హెడ్ జఖరోవ్ ఆంటోన్ (Mr. Zakharov Anton), చీఫ్ ఎక్సటర్నల్ రిలేషన్స్ స్పెషలిస్ట్ శ్రీమతి సిడోరుక్ ఎలిజవెటా (Ms. Sidoruk Elizaveta)లతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ…భారతదేశంలో విస్తరిస్తున్న డిజిటల్ రవాణా, బ్యాంకింగ్ కార్డ్ వ్యవస్థలకు అవసరమైన సురక్షితమైన RFID ట్యాగ్‌లు, స్మార్ట్ కార్డ్ మైక్రోచిప్‌లను స్థానికంగా తయారు చేసేందుకు ఎలిమెంట్ గ్రూప్ విశాఖపట్నం (వైజాగ్)లో ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అసెంబ్లీ యూనిట్‌ను ఏర్పాటు చేయండి. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈవీ పవర్‌ట్రెయిన్, సోలార్ కన్వర్టర్ మార్కెట్లకు సరఫరా చేయడానికి, ఎలిమెంట్ టెక్నాలజీని ఉపయోగించి భాగస్వామ్య సంస్థలతో కలసి నెల్లూరులో సిలికాన్ కార్బైడ్, పవర్ సెమీకండక్టర్ పరికరాల తయారీ విభాగాన్ని ఏర్పాటు చేయండి.
స్థానిక ఆటోమోటివ్, అసెంబ్లింగ్ లైన్లను ఆటోమేట్ చేయడానికి, ఇప్పటికే శ్రీ సిటీ (తిరుపతి జిల్లా)లో ఉన్న తయారీ దిగ్గజాలకు సమీపంలో జాయింట్ ఇండస్ట్రియల్ మోటార్ – సర్వో మోటార్ ప్రొడక్షన్ ఫెసిలిటీ ఏర్పాటు కాబోతోంది. అక్కడ రోబోటిక్స్ సేవల కోసం ఎలిమెంట్ గ్రూప్ రోబోటిక్స్ & ఆటోమేషన్ డివిజన్ ఏర్పాటు చేయండి. కమ్యూనికేషన్, నావిగేషన్, ఏరోస్పేస్ ఆన్-బోర్డ్ టెలిమెట్రీ సిస్టమ్‌ల కోసం మాడ్యులర్ కాంపోనెంట్‌లపై దృష్టి సారిస్తూ, వైజాగ్ హై-టెక్ కారిడార్‌లో ఒక సహకార మైక్రోఎలక్ట్రానిక్స్ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి. అమరావతి స్మార్ట్ సిటీ ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా స్మార్ట్ సిటీ హార్డ్‌వేర్ & ఐఓటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంటిగ్రేషన్ చేపట్టాల్సి ఉంది. ఇందులో భాగంగా అమరావతి రాజధాని నిర్మాణానికి ఎలిమెంట్ గ్రూప్ ఆధ్వర్యాన లోకలైజ్డ్ మైక్రోకంట్రోలర్‌లు, డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హార్డ్‌వేర్ సరఫరా చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్జప్తి చేశారు.
ఎలిమెంట్ గ్రూప్ ప్రెసిడెంట్ ఖజోవ్ ఒలెగ్ స్పందిస్తూ… ఎలిమెంట్ గ్రూప్ కార్పొరేట్ విస్తరణలో భాగంగా భారత్ లో రష్యన్ మైక్రోఎలక్ట్రానిక్స్ డిజైన్ హౌస్‌లు, భారతీయ టెక్ సంస్థల సాంకేతిక భాగస్వామ్యంతో సెమీకండక్టర్ పంపిణీ నెట్‌వర్క్‌లను నడిపిస్తున్నట్లు చెప్పారు. ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ పోర్ట్‌ఫోలియో, సురక్షితమైన RFID మైక్రోచిప్‌లు, స్మార్ట్ కార్డ్ మాడ్యూల్స్, ట్రాన్స్‌పోర్ట్ కార్డ్ టెక్నాలజీలను దక్షిణాసియా ఆర్థిక రంగానికి ఎగుమతి చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ద్వైపాక్షిక టెక్ వ్యూహంలో భాగంగా తమ గ్రూప్ అధునాతన పవర్ ఎలక్ట్రానిక్స్, మైక్రోకంట్రోలర్లు IoT హార్డ్‌వేర్‌లను పంపిణీ చేయడానికి భారతీయ హార్డ్‌వేర్ డెవలపర్లతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. కీలకమైన వాణిజ్య విభాగాలు, దేశీయ టెలికాం, పారిశ్రామిక ఆటోమేషన్ తయారీదారుల కోసం కాంపోనెంట్ సోర్సింగ్, కాంపోనెంట్ లైసెన్సింగ్, సప్లయ్ చైన్ లాజిస్టిక్స్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఎలిమెంట్ ప్రతినిధులు పేర్కొన్నారు.
మాస్కో ప్రధాన కేంద్రంగా 2019లో ఏర్పాటైన ప్రీమియర్ సెమీ కండక్టర్స్ సంస్థ ఎలిమెంట్ గ్రూప్ 30కి పైగా డిజైనింగ్, మానుఫ్యాక్చరింగ్ సెంటర్లను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ సంస్థలో 9వేలమందికి పైగా నిపుణులు పనిచేస్తున్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో ఎలిమెంట్ గ్రూప్ 38.5 బిలియన్ రూబుల్స్ (రూ.5,090 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది.)
Hon’ble HRD, IT, Electronics Minister Mr. Nara Lokesh participates in the Russia – India business dialogue at the St. Petersburg International Economic Forum 2026.
***
















































