LIQUOR SCAM inr 5000 crores !?
మద్యం స్కాం రూ.5వేల కోట్లు
వైసీపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల్లో భారీ కుంభకోణానికి పాల్పడింది. ప్రజల కోసం ప్రభుత్వ మద్యం షాపులు అని చెప్పి.. వాటి ద్వారా రూ.5వేల కోట్లు దోచేసింది.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ దోపిడీ..
కమీషన్ల కోసం కంపెనీలకు రేట్లు పెంపు
పెంచింది తిరిగి వైసీపీ నేతల చేతుల్లోకే
మద్యం స్కాం రూ.5వేల కోట్లు
మద్యం స్కాం రూ.5వేల కోట్లు
అమరావతి-
వైసీపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల్లో భారీ కుంభకోణానికి పాల్పడింది. ప్రజల కోసం ప్రభుత్వ మద్యం షాపులు అని చెప్పి.. వాటి ద్వారా రూ.5వేల కోట్లు దోచేసింది. అది కూడా లిక్కర్ కంపెనీల నుంచి కాదు. కమీషన్లు ఇవ్వడం కోసం అంటూ అటు కంపెనీలకు రేట్లు పెంచి, ఆ పెంచిన మొత్తాన్ని ఇటు వైసీపీ నేతలు తమ ఖాతాల్లో వేసుకున్నారు. అంటే ప్రజాధనాన్ని ఆ చేత్తో కంపెనీలకు ఇచ్చి… ఈ చేత్తో జగన్ తన జేబులో వేసుకున్నారని అంచనా. అలా పోగేసిన రూ.5వేల కోట్లు హైదరాబాద్‌లో దాచిపెట్టి, తాజా ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు వాడుకున్నట్లు ఆరోపణలున్నాయి. మిగిలిన మొత్తం బెంగళూరుకు తరలించారని తెలుస్తోంది. బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇంట్లో శుక్రవారం జరిగిన సోదాల్లో దీనిపై మరింత కీలక సమాచారం బయటపడినట్టు సమాచారం. తెలుగుదేశం ప్రభుత్వంలో మద్యం షాపులు ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో ఉండేవి. ఏ బ్రాండ్లు అమ్మాలనేది అప్పట్లో వారిష్టం. జగన్ దీనిని మార్చేశారు. ప్రభుత్వ మద్యం షాపుల విధానం ప్రారంభించారు. షాపుల్లో ఏ బ్రాండ్లు అమ్మాలో సర్కారు పెద్దలే నిర్ణయించారు. లిక్కర్ కేసుపై రూ.250, బీరు కేసుపై రూ.150 కమీషన్‌గా ఇవ్వాలని కంపెనీలకు ప్రతిపాదించారు. అలా ఇచ్చిన కంపెనీల మద్యమే కొన్నారు. రాష్ట్రంలోని డిస్టిలరీలను అనధికారికంగా ‘స్వాధీనం’ చేసుకుని.. రకరకాల పేర్లతో సొంత బ్రాండ్లను ప్రవేశ పెట్టారు. వాటినే మద్యం దుకాణాల్లో విక్రయించారు.
అంటే… ఒకవైపు కమీషన్లు, మరోవైపు సొంతంగా మద్యం తయారు చేసి, బేవరేజెస్ కార్పొరేషన్‌తో కొనుగోలు చేయించి, ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించడం! ఇలా అన్ని రకాలుగా ఆదాయమే! ఈ ఐదేళ్లలో 14.38కోట్ల కేసుల లిక్కర్, 5.83కోట్ల కేసుల బీరు రాష్ట్రంలో అమ్ముడైంది. ఇందులో లిక్కర్‌పై రూ.3600 కోట్లు, బీరుపై రూ.900 కోట్లు ప్రభుత్వం నుంచి కంపెనీలకు వెళ్లి, మళ్లీ తిరిగి వైసీపీ నేతలకు చేరాయి. మొదట ఈ నగదు వసూలును హైదరాబాద్ కేంద్రంగా నడిపారు. కంపెనీలకు బిల్లులు చెల్లించిన వెంటనే వెళ్లి హైదరాబాద్‌లో కేసుల చొప్పున కమీషన్లు ఇచ్చేవారు. ఈ క్రమంలోనే జగన్‌కు సన్నిహితంగా ఉండే ఓ ఫార్మా కంపెనీకి రూ.300 కోట్లు ఇచ్చారు. ఆ కంపెనీపై ఐటీ దాడులు జరిగి సీజ్ కావడంతో బెంగళూరుకు మార్చారని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఐటీ కంపెనీ నడిపే వైసీపీ సన్నిహితుడు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి ఈ వసూళ్లకు కేంద్ర బిందువు. తర్వాత అనేక మంది అందులోకి వచ్చారు.
ఎవరి పాత్ర ఏంటి?
ఈ తతంగం నడిపించేందుకు ఎక్సైజ్, బేవరేజెస్ కార్పొరేషన్‌లో అనేక మంది పనిచేశారు. కమీషన్లు ఇచ్చే కంపెనీలకే ఆర్డర్లు ఇచ్చే బాధ్యతను చివరివరకూ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డికి అప్పగించారు. ఆయన చెప్పిన కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు వెళ్తాయి. మాకెందుకు ఇవ్వరని ప్రశ్నించిన కంపెనీలకూ కొన్నిసార్లు ఆర్డర్లు ఇచ్చారు. కానీ ఆ బ్రాండ్లను షాపుల్లో పెట్టి అమ్మకుండా, ఎవరూ కొనట్లేదని తిప్పి పంపారు. ఇక ఏ రోజు ఏ బ్రాండ్లు ఎక్కువ అమ్మాలి అనేది ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ చూసుకున్నారు. దీనికి సంబంధించిన చార్టు ‘తాడేపల్లి’ పెద్దల నుంచి అందేది. కంపెనీలకు బకాయిల విడుదల అంశాన్ని రిటైర్డ్ కార్పొరేషన్ అధికారి వేణుగోపాల్ చూశారు. ప్రతి బిల్లులో 20శాతం కమీషన్ విడుదల చేశారు. 90 రోజులుగా స్టాకు అమ్ముడుపోలేదనే కారణాన్ని చూపి ఎడాపెడా గ్రౌండింగ్ చార్జీలను రిటైర్డ్ కార్పొరేషన్ అధికారి శ్రీనివాసరెడ్డి తీసుకున్నారు. తొలుత ఎడాపెడా గ్రౌండింగ్ చార్జీలు విధించేవారు. తర్వాత వాటి అసలు లెక్కలు అంచనావేసి అందులో అసలు చార్జి పోను మిగిలింది తిరిగి కంపెనీలకు ఇచ్చేందుకు 20శాతం కమీషన్ వసూలుచేశారు. అటు కేసులపై కమీషన్లు, ఇటు కార్పొరేషన్‌లో వసూళ్లు కలిపి మొత్తంగా రూ.5వేల కోట్లకు పైగానే ప్రజాధనాన్ని దోపిడీ చేశారు. మార్కెట్ ఆధారంగా మద్యం కంపెనీలు కొత్త కొత్త పేర్లతో బ్రాండ్లు విడుదల చేస్తుంటాయి. తయారీ, సరఫరా ఇతరత్రా కారణాల దృష్ట్యా ప్రతి కంపెనీ ఎక్కువ పేర్లతో బ్రాండ్లు అమ్ముతుంది. అంటే ఒకే బ్రాండ్‌కు చివర్లో డీలక్స్, ప్రీమియం, స్ర్టాంగ్, లైట్ ఇలా వేర్వేరు పేర్లతో బ్రాండ్లను రిజిస్ర్టేషన్ చేసుకుంటుంది. ఇలా ఏదైనా కొత్త రిజిస్ర్టేషన్ చేసుకుంటే దానికి ఎక్సైజ్ శాఖ లేబుల్ ఇవ్వాలి. దానికి కార్పొరేషన్‌లో రూ.50లక్షలు చొప్పున వసూలు చేశారు. ప్రతి ఏటా రెన్యువల్‌కు ఒక్కో లేబుల్‌కు రూ.5లక్షలు తీసుకున్నారు.