STATUE POLITICS IN UNIVERSITY
వర్సిటీల్లో ‘విగ్రహ’ రాజకీయాలు!
జగన్ ఏలుబడిలో విద్యాలయాలు సైతం రాజకీయాలతో అల్లాడిపోయాయి. ఆయన మెప్పు పొం దేందుకు కొన్ని విశ్వవిద్యాలయాల వీసీలు, ఉన్నతాధికారులు స్వామిభక్తి ప్రదర్శించారు.
జగన్ భక్తుల అత్యుత్సాహం
తాజాగా ఎస్కేయూలో వైఎస్ విగ్రహం తొలగింపు
వీఎ్‌సయూలో శిలాఫలకాలు కూడా..
జగన్ ఏలుబడిలో విద్యాలయాలు సైతం రాజకీయాలతో అల్లాడిపోయాయి. ఆయన మెప్పు పొం దేందుకు కొన్ని విశ్వవిద్యాలయాల వీసీలు, ఉన్నతాధికారులు స్వామిభక్తి ప్రదర్శించారు. నిబంధనలు తుంగలో తొక్కి.. జగన్ తండ్రి, మాజీ సీఎం వైఎస్ విగ్రహాలను వర్సిటీ ప్రాంగణాల్లో ఎడాపెడా ఏర్పాటు చేశారు. విద్యార్థి సంఘాలు నిరసనలు తెలిపినా పట్టించుకోలేదు. జగన్ ఏకంగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరుమార్చేసి తన తండ్రి పేరు పెట్టుకున్నారు. తర్వాత ఆ వర్సిటీ వీసీ కోరుకొండ బాబ్జీ నిరుడు జూన్ 22న వర్సిటీ ప్రాంగణంలో వైఎస్ విగ్రహాన్ని గుట్టుచప్పుడు కా కుండా ప్రారంభించారు. తాజాగా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే హెల్త్ వర్సిటీ భవనాని కి వైఎ్‌సఆర్ పేరును టీడీపీ అభిమానులు తొలగించారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో రూ.5.80 లక్షల విశ్వవిద్యాలయ నిధులతో వైఎస్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. కానీ ఆవిష్కరించలేదు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందనగా విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేసినా వాయిదా వే శారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 2009లోనే ప్లాస్టర్ ఆఫ్ పారి్‌సతో తయారుచేసిన వైఎస్ విగ్రహాన్ని ప్రధాన గేటు వద్ద ఏర్పాటుచేశారు. అయితే నిరుడు చివర్లో వీసీ ప్రసాదరెడ్డి దాని స్థానంలో కాంస్య విగ్రహాన్ని పెట్టించారు. ఇందుకోసం రెండు వర్సిటీ అనుబంధ కాలేజీల నుంచి నిధులు సేకరించినట్లు సమాచారం. కడపలో యోగివేమన వర్సిటీ పాలనా భవనం ముందు వేమన విగ్రహా న్ని 2014లో ఏర్పాటు చేశారు. జగన్ సీఎం అయ్యాక ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసివేసి వైఎస్ విగ్రహాన్ని పెట్టారు. 2019 డిసెంబర్లో వీసీ రాజశేఖర్ నాగార్జున వర్సిటీలో వైఎస్ భారీ విగ్రహా న్ని ఏర్పాటు చేశారు. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ(ఎస్కే) వర్సిటీలో అప్పటి ఎంపీ గోరంట్ల మాధవ్, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విద్యార్థి సంఘాలు అభ్యంతరం తెలిపినా వీసీ రామకృష్ణారెడ్డి పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో.. ఆ విగ్రహాన్ని వర్సిటీ అధికారులు శుక్రవా రం తొలగించారు. నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి వర్సిటీ ప్రాంగణంలో నిర్మించిన పరిపాలనా భవనానికి వైఎస్ పేరు పెట్టారు. వర్సిటీ వీసీ సుందరవల్లి(జగన్ బంధువు), రిజిస్ర్టార్ రామచంద్రారెడ్డి సమక్షంలో అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. ఆ సమయంలోనే భవనంలో వైఎస్ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఇప్పుడు టీడీపీ నాయకులు తొలగించారు.