Andhra Pradesh Government is taking steps towards making every woman a millionaire with the aim of women’s welfare, self-reliance and empowerment. Chief Minister Y.S. The government under the leadership of Jagan Mohan Reddy is setting an example for the country by putting women’s empowerment into practice. From the child in the mother’s womb to the lovingly blessed grandmothers, it stands by them at all stages and works for the self-reliance of women by providing equal opportunities in any field such as social, economic and political. To raise their status and improve their livelihoods, the government is taking policy decisions to ensure that women play a vital role in every welfare program. Recently, YSR Kalyanamastu and YSR Shaditofa schemes have been introduced with emphasis on girl child education. Giving importance to women’s safety and protection. To say that this government is a women-biased government, the idea is to provide about 2 lakh 39 thousand crore rupees through various schemes in these three and a half years with the intention that if money is put in the hands of women, it will be good for their family and their financial condition will improve.
If we look at the benefits provided by the government to women through various welfare schemes and programs, the amount of bank loans of savings societies by 2019 elections will be Rs. 25,517 crores in 4 installments directly deposited in the accounts of women’s savings societies to improve their self-reliance, empowerment and livelihood, YSR has brought the Asara scheme and has already given the benefit in two successive installments. About 78.74 lakh people of about 7.97 lakh self help societies across the state have benefited financially through this scheme. Besides, it is supporting business giants like P&G, ITC, RELIANCE, HUL, multinational companies and banks to excel as women entrepreneurs. Millions of people earn between Rs.7 thousand and Rs.7 thousand per month through grocery stores, textile business, rearing of cows, buffaloes, sheep, goats and other livelihoods with the support provided by the government in connection with corporate organizations and banks. 10 thousand additional income is getting.
18,750 per annum for SC, ST, BC, Minority women in the state between the ages of 45 to 60 years regularly through “YSR Chayutha” and a total of Rs. 75,000 financial assistance scheme ‘YSR Chehoota..’ Already in these three years the amount of financial assistance provided to each woman is Rs. 56,250.. to 26,39,703 poor sisters across the state thereby benefiting crores of people under “YSR Cheyuta” so far a total of Rs. 14,110 crore provided. For livelihood, women’s fund has already been linked to get loans from banks and societies and Rs. 4,370 crores in loans. Also, through ‘YSR Zero Interest’, Dwakra has deposited Rs 3,615 crore in the accounts of more than one crore women in 9.76 lakh self-help groups in three years. Making up.
In order to improve the economic development and living standards of poor women of Kapu, Balija, Telaga and Ontar castes between 45 to 60 years of age, ‘YSR Kapu Nestham’ is providing a total of Rs. 75 thousand financial assistance in 5 years at the rate of Rs. 15 thousand per year. In these three years, 3,27,349 Kapu women each received Rs. 45 thousand and Rs. 981.88 crores in profit. Also, although it is not mentioned in the manifesto, it is implementing ‘YSR EBC Nestam’ for the poor women of EBC (economically backward OC groups) by giving importance to women empowerment. 3,92,674 eligible people belonging to Reddy, Kamma, Arya Vaishya, Brahmin, Kshatriya, Velama and other OC communities in the age group of 45 to 60 years through “YSR EBC Nestam” will get Rs. 15,000 in three years for a total of Rs. 45,000 as financial assistance.
The state government supports women at all stages from the child in the mother’s womb to the lovingly blessed grandmothers. YSR Sampurna Poshaman distributes nutritional food with complete nutritional values for the health protection of pregnant women, infants and children. By Mana Badi Nadu, the construction of special toilets in schools to maintain the self-esteem of adolescent girls, free distribution of sanitary napkins to Kishora girls through the freedom scheme, and the design of Abhayam and Disha apps for women’s safety has stood tall. Appointed women constables in village/ward secretariats. To give more impetus to women empowerment, it has granted house titles and houses in the name of women. It has already completed the distribution of free house letters to 30.76 lakh women. Registration is done in the name of elder sisters on the same day as house title and house is given. YSR is giving pension as a gift to grandmothers, widows and single women above 60 years of age. The Act has brought 50 percent reservation for women in nominated posts and nomination works. A woman has been given the opportunity to become the Deputy Chief Minister as key departments such as Home Department, Medical and Health were assigned to women in the Cabinet. Also, giving priority to women in the positions of local organizations, 61 percent of the positions for women in the corporation and municipalities across the state, Y.S. The government under Jagan Mohan Reddy handed over. There is no doubt that Jagananna Ammaodi, YSR Pension Kanuka, YSR Asara, YSR Sunna Tudhi, YSR Cheyuta, YSR Kapu Nestham, free house title deeds, houses etc. have written a new history by providing welfare fruits in the name of women by keeping them on their feet.
– Karre Subbarao, Journalist
మహిళా సాధికారత సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు..
మహిళల సంక్షేమం, స్వావలంబన, సాధికారతే లక్ష్యంగా ప్రతి మహిళను లక్షాధికారిని చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం మహిళా సాధికారతను ఆచరణలో చేసి చూపి దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. అమ్మ కడుపులోని బిడ్డ నుండి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వల వరకు వారికి అన్ని దశల్లోనూ అండగా నిలిచి సామాజిక, ఆర్థిక, రాజకీయం ఇలా ఏ రంగంలోనైనా సమాన అవకాశాలను కల్పిస్తూ మహిళల స్వావలంభనకు కృషి చేస్తోంది. వారి స్థితిగతులను పెంచేందుకు, జీవనోపాధులను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమం, ప్రతి కార్యక్రమంలో స్త్రీ కీలక పాత్ర పోషించేలా విధానపర నిర్ణయాలకు శ్రీకారం చుడుతోంది. బాలికా విద్యకు పెద్దపీట వేస్తూ ఇటీవల వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా పథకాలను ప్రవేశపెట్టింది. మహిళా భద్రత, రక్షణకు పెద్దపీట వేస్తోంది. ఈ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని చెప్పడానికి మహిళల చేతిలో డబ్బులు పెడితే వారి కుటుంబానికి మంచి జరుగుతుందని, వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయన్న ఉద్దేశ్యంతో ఈ మూడున్నరేళ్లలో వివిధ పథకాల ద్వారా దాదాపు 2 లక్షల 39 వేల కోట్ల రూపాయలను అందించడమే తార్కాణం.
వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం మహిళలకు అందించిన లబ్ధిని పరిశీలిస్తే.. 2019 ఎన్నికల నాటికి పొదుపు సంఘాల బ్యాంకు రుణాల మొత్తం రూ. 25,517 కోట్ల సొమ్మును 4 విడతల్లో మహిళా పొదుపు సంఘాల ఖాతాల్లో నేరుగా జమ చేసి వారి స్వావలంబన, సాధికారత మరియు జీవనోపాధి మార్గాలు మెరుగుపరిచేందుకు వీలుగా వైఎస్సార్ ఆసరా పథకాన్ని తీసుకుని వచ్చి ఇప్పటికే వరుసగా రెండు విడతలుగా లబ్ధిని అందజేసింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 78.74 లక్షల మందికి ఆర్థిక లబ్ధి చేకూరింది. అంతేకాకుండా మహిళలు వ్యాపారవేత్తలుగా రాణించేందుకు P&G, ITC, RELIANCE, HUL వంటి వ్యాపార దిగ్గజాలు, బహుళ జాతి సంస్థలు, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకొని తోడ్పాటునందిస్తోంది. కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులతో అనుసంధానం చేసి ప్రభుత్వం అందించిన సహకారంతో కిరాణా దుకాణాలు, వస్త్ర వ్యాపారం, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకంతో పాటు ఇతర జీవనోపాధులు ద్వారా లక్షలాది మంది నెలకు రూ.7 వేల నుండి రూ. 10 వేల వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు.
45 నుండి 60 ఏళ్ల లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద మహిళల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంచేందుకు వీలుగా ‘వైఎస్సార్ కాపు నేస్తం’ ద్వారా ఏటా రూ.15 వేలు చొప్పున 5 ఏళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మూడేళ్లలో 3,27,349 మంది కాపు మహిళలకు ఒక్కోక్కరికి రూ. 45 వేల చొప్పన రూ. 981.88 కోట్ల లబ్ధిని అందించింది. అలాగే మేనిఫెస్టోలో చెప్పకపోయినా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఈబీసీ (ఆర్థికంగా వెనుకబడిన ఓసీ వర్గాలు) లోని పేద మహిళల కోసం ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ అమలు చేస్తోంది. ‘‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’’ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన అర్హులైన 3,92,674 మందికి ఏటా రూ. 15,000 చొప్పున మూడేళ్లలో మొత్తం రూ. 45,000ల ఆర్ధిక సాయం చేకూర్చింది.
అమ్మ కడుపులోని బిడ్డ నుండి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వల వరకు మహిళలకు అన్ని దశల్లోనూ అండగా నిలచి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా గర్భవతులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కొరకు సంపూర్ణ పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం పంపిణీ చేస్తుంది. మన బడి నాడు నేడు ద్వారా కౌమార బాలికల ఆత్మగౌరవం నిలబెట్టేలా పాఠశాలల్లో ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణం, స్వేచ్ఛ పథకం ద్వారా కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్ కిన్స్ పంపిణీతో పాటు మహిళల భద్రత కోసం అభయం, దిశ యాప్ ల రూపకల్పనతో కొండంత అండగా నిలిచింది. గ్రామ/వార్డు సచివాలయాలలో మహిళా కానిస్టేబుళ్ల నియామించింది. మహిళా సాధికారతకు మరింత ఊతమిచ్చేలా మహిళల పేరు మీదే ఇళ్ల పట్టాలు, ఇళ్లు మంజూరు చేసింది. ఇప్పటికే 30.76 లక్షల మంది మహిళలకు ఉచిత ఇళ్ళ పట్టాల పంపిణీ పూర్తి చేసింది. ఇళ్ల పట్టా, ఇల్లు ఇచ్చిన రోజునే అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తోంది. 60 ఏళ్లు పైబడిన అవ్వలకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు వైఎస్సార్ పెన్షన్ కానుక అందిస్తోంది. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు చేస్తూ చట్టం తీసుకొచ్చింది. కేబినెట్ లో మహిళలకు హోం శాఖ, వైద్య, ఆరోగ్యం వంటి కీలక శాఖలు అప్పగించడంతో ఒక మహిళకు ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించింది. అలాగే స్థానిక సంస్థల పదవుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేషన్, మున్సిపాల్టీలలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు 61 శాతం పదవులను వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం అప్పగించింది. మహిళలను వారి కాళ్ళ మీద వారిని నిలబెడుతూ జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, మహిళల పేరిట ఉచిత ఇళ్ళ పట్టాలు, ఇళ్ళు మొదలైన పథకాల ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తూ నూతన చరిత్రను లిఖించిందనడంలో సందేహం లేదు.
– కర్రే సుబ్బారావు, జర్నలిస్ట్