ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కీలక భేటీ
అమరావతి – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం చంద్రబాబుతో ఆయన నివాసంలో భేటీ కానున్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు, పలు ఇతర కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
యాంకరేజ్ పోర్టులో బియ్యం పరిశీలన
కాకినాడ పోర్టులో పవన్‌కల్యాణ్ శుక్రవారం మధ్యాహ్నం పర్యటించారు. తొలుత 12.45గంటలకు యాంకరేజ్ పోర్టులో బార్జిలో తనిఖీలు చేశారు. ఇం దులో రేషన్ బియ్యం ఎగుమతి అవుతుండడంతో ఇటీవల అధికారులు పట్టుకున్నారు. నేరుగా పవన్ బార్జి ఎక్కి బియ్యం ప్లేటులో వేసి పరిశీలించారు. రేషన్ బియ్యం ఆనవాళ్లను గుర్తించారు. అక్కడే ఉన్న డీఎస్వో, కలెక్టర్, పోర్టు అధికారి, ఇతర అధి కారులపై తీవ్రంగా మండిపడ్డారు. రేషన్ మాఫి యాకు మీరంతా సహకరించకపోతే ఇలా ఎలా దేశాలు దాటిపోతోందని శివాలెత్తారు. ఉద్యోగాలు చేస్తున్నారా.. మాఫియాకు వంత పాడుతున్నారా? అంటూ మండిపడ్డారు. పక్కనే ఉన్న టీడీపీ ఎమ్మె ల్యే కొండబాబును ఉద్దేశించి దీనిపై మరింత గట్టి పోరాటం చేయాలని, నెమ్మదిగా ఉండకూడదని పేర్కొన్నారు. అనంతరం అక్కడినుంచి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత డీప్‌వాటర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి టగ్ ఎక్కి సముద్రంలోకి వెళ్లారు.
సముద్రం అల్లకల్లోలంగా ఉన్నా..తుఫాను నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో పవన్ సముద్రంలోకి వెళ్తారని అధికారులు అనుకోలేదు. కానీ అనూహ్యంగా ఆయన టగ్ ఎక్కి తొమ్మిది నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న పశ్చి మ ఆఫ్రికా నౌక స్టెల్లా ఎల్ పనామా వద్దకు బయ లుదేరారు. సముద్రం భయానకంగా ఉండడంతో అధికారులు వద్దని వారించారు. అయినా పవన్ వినలేదు. నౌకవద్దకు వెళ్లిన తర్వాత పైకి ఎక్కి ఎగుమతికి సిద్ధంగా ఉన్న 640 టన్నుల బియ్యాన్ని పరిశీలించాలి. కానీ వాతావరణం బాగోలేదని, నౌకపైకి ఎక్కొద్దని అధికారులు పవన్‌కు తెలిపారు. సముద్ర ప్రయాణం మధ్యలో పవన్ ఎమ్మెల్యే కొండబాబు సమక్షంలో అధికారులపై మండిపడ్డారు. రేషన్ మాఫియాపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అసహనం వ్యక్తంచేశారు. ఈ విషయంలో మొత్తం సివిల్ సప్లయిస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయ్యిందన్నారు. డీఎస్ఓ ప్రసాద్, జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్, జిల్లా కలెక్టర్ షాన్మోహన్, పోర్టు అధికారి ధర్మ శాస్త్ర, డీఎస్పీ రఘువీర్‌పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీడీఎస్ బియ్యం ఉన్న స్టెల్లా ఎల్ పనా మా భారీ నౌకను సీజ్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆదేశించారు. కాకినాడ యాం కరేజ్ పోర్టులో అధికారులు దృష్టిపెట్టాల న్నారు. పోర్టులోని రెండు చెక్‌పోస్టుల వద్ద 24 గంటలు నిఘా ఉండాలన్నారు.
కాకినాడలో రేషన్ మాఫియా
మధ్యాహ్నం 3 గంటల తర్వాత తిరిగి డీప్‌వాటర్ పోర్టుకు చేరుకున్న పవన్ విలేక రుల సమావేశంలో ప్రసంగించారు. రేషన్ మాఫియా కాకినాడలో దారుణంగా ఉందని, తనను నౌక ఎక్కనీయకుండా అధికారులు అడ్డు కున్నారని పేర్కొని సంచలన వ్యాఖ్యలు చేశా రు. రెండు నెలలుగా కాకినాడ పోర్టులో తనిఖీలకు తనను రాకుండా అధికారులు ఏవో సాకులు చెప్పి అడ్డుకుంటున్నారని గుర్తుచేసి బాంబుపేల్చారు. తాను ఢిల్లీ నుంచి అమరావతి వెళ్లాలని, కానీ రేష న్ మాఫియా తీవ్రత నేపథ్యంలో కాకి నాడ పర్యటనకు వచ్చానని తెలిపారు. విలేకరుల సమావేశం అనంతరం పవన్ అమరావతికి బయలుదేరి వెళ్లారు.
గ్రీన్‌ఛానల్ ద్వారా తరలింపు
అంతకుముందు మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత జూన్‌లో కాకినాడలో తనిఖీ చేసి నప్పుడు 26వేల మెట్రిక్ టన్నులు పీడీఎస్ బియ్యం పట్టుకున్నామన్నారు. బియ్యం మాఫియా గుంటూ రు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లా నుంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటుచేసుకుని కాకినాడ పోర్టు నుంచి విదేశాల కు అక్రమంగా తరలిస్తున్నారన్నారు. పీడీఎస్ బి య్యాన్ని అక్రమంగా త రలిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు ద్వారంపూడే వ్యాపారం చేశారనీ, ఇప్పుడు బినా మీలు ఈ దందా చేస్తున్నారని ఆరోపించారు.