పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), జూలై 03 :
శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కి ఘన స్వాగతం లభించింది. సోమవారం రాత్రి 08:53 గంటలకు రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ గారు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఉన్న శాంతి భవన్ కు చేరుకోగా, రాష్ట్ర గవర్నర్ కు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ రెడ్డి, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్, తదితరులు పుష్పగుచ్చాలు అందించి ఘనస్వాగతం పలికారు. ఈనెల 4వ తేదీన మంగళవారం సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభించే కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ పాల్గొననున్నారు. రాష్ట్ర గవర్నర్ కు ఘన స్వాగతం పలికిన వారిలో ఆర్డీఓ భాగ్యరేఖ, తహసీల్దార్ నవీన్ కుమార్, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు, తదితరులు ఉన్నారు.