శ్రీ రామావత్ దశరథ బాబు ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ ప్రస్థానం
- * టీడీపీ అధిష్టానం అవకాశం ఇస్తే మంగళగిరి మేయర్ బరిలో నిలవాలని ఆకాంక్ష !
ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, మంగళగిరి:
ప్రజాసేవయే పరమావధిగా, సమాజంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నాయకులు శ్రీ రామావత్ దశరథ బాబు తన రాజకీయ , సామాజిక ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధిష్టానం అవకాశం కల్పిస్తే, ఎస్టీ రిజర్వేషన్ కోటాలో మంగళగిరి మేయర్ పదవికి పోటీ చేయాలని ఆయన గట్టిగా ఆకాంక్షిస్తున్నారు.
వ్యక్తిగత నేపథ్యం & విద్యార్హతలు:
గుంటూరు జిల్లా పరిధిలోని తెనాలి టౌన్, చిన్న రావూరు, బాలాజీ నగర్‌కు చెందిన శ్రీ రామావత్ దశరథ బాబు 1973 జూలై 15న తెనాలి పట్టణంలో జన్మించారు. అత్యుత్తమ విద్యార్హతలు కలిగిన ఆయన B.A., DEEE, B.Ed., PGDCA, Office Automation వంటి కోర్సులు పూర్తిచేశారు. తొలుత తెనాలి ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా సేవలందించిన ఆయన, అనంతరం గ్రూప్-1 ద్వారా ట్రెజరీ శాఖలో జూనియర్ అకౌంట్స్ అధికారిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. పలు కీలక కార్యాలయాలతో పాటు ప్రసిద్ధ డీజీపీ కార్యాలయం, విజయవాడలోని సమాచార శాఖ కమిషనర్ కార్యాలయంలోనూ ఆయన సేవలు అందించారు. విద్య ,ఉద్యోగ రంగాల ద్వారా తాను సంపాదించిన అనుభవాన్ని, జ్ఞానాన్ని ప్రజల సంక్షేమం కోసం పూర్తిగా వినియోగించాలనే బలమైన సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.
తెలుగుదేశం పార్టీతో మూడు దశాబ్దాల అనుబంధం:
1989 సంవత్సరం నుంచే తెలుగుదేశం పార్టీతో నిరంతరం అనుబంధం కలిగి ఉన్న శ్రీ రామావత్ దశరథ బాబు, పార్టీ సిద్ధాంతాల పట్ల పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేయడాన్ని ఆయన తన ప్రధాన బాధ్యతగా భావిస్తున్నారు.
ప్రజాసేవా దృక్పథం & లక్ష్యాలు:
గిరిజన ప్రాంతాల అభివృద్ధి ,వెనుకబడిన వర్గాల అభ్యున్నతి.
మహిళా సాధికారత, గ్రామీణ ప్రజల సంక్షేమం ,యువతకు మెరుగైన ఉపాధి అవకాశాల కల్పన.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేద ప్రజలందరికీ పారదర్శకంగా అందేలా కృషి చేయడం.
ప్రజలతో నిరంతర మమేకమై వారి అవసరాలను గుర్తించడం ,ప్రాంతీయ అభివృద్ధిలో భాగస్వాములు కావడం.
రాజకీయాలు కేవలం పదవుల కోసం మాత్రమే కాకుండా, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడానికి ఒక వేదిక కావాలని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు లభించాలనే ఆకాంక్షతో ముందుకు సాగుతున్న శ్రీ రామావత్ దశరథ బాబు ప్రజాసేవ మరింత విజయవంతం కావాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు
Sri Ramavath Dasharath Babu: A Political Journey Dedicated to Public Service
* Aspires to contest for the position of Mangalagiri Mayor, should the TDP leadership provide the opportunity!
Mangalagiri, Guntur District, Andhra Pradesh:
With public service as his primary objective and the welfare of all sections of society as his goal, senior Telugu Desam Party (TDP) leader Sri Ramavath Dasharath Babu continues his political and social journey. He strongly aspires to contest for the position of Mangalagiri Mayor—under the ST reservation quota—should the TDP leadership offer him the opportunity.
Personal Background & Educational Qualifications:
Born on July 15, 1973, in Tenali, Guntur district, Sri Ramavath Dasharath Babu hails from Balaji Nagar, Chinna Ravuru, in Tenali town. He possesses strong educational credentials, having completed a B.A., DEEE, B.Ed., PGDCA, and a course in Office Automation. He began his career as a government school teacher in the Tenali area, later joining the Treasury Department as a Junior Accounts Officer through the Group-1 service examination. He has served in various key government offices, including the office of the Director General of Police (DGP) and the office of the Commissioner of the Information Department in Vijayawada. He is now moving forward with a firm resolve to dedicate the experience and knowledge he gained throughout his professional and educational career to the welfare of the public. A Three-Decade Association with the Telugu Desam Party:
Having been continuously associated with the Telugu Desam Party since 1989, Sri Ramavath Dasharath Babu works with unwavering commitment to the party’s ideology. He considers it his primary responsibility to remain constantly accessible to the public, understand their problems firsthand, and contribute his best toward finding solutions.
Vision for Public Service & Objectives:
Development of tribal areas and the upliftment of marginalized sections.
Women’s empowerment, the welfare of rural communities, and the creation of better employment opportunities for the youth.
Ensuring that government welfare schemes reach all eligible, underprivileged individuals in a transparent manner.
Staying deeply connected with the people to identify their needs and actively participating in regional development.
He firmly believes that politics should not merely be a pursuit of positions, but a platform to bring about positive change in people’s lives. Driven by the aspiration that everyone should have equal opportunities within the democratic system, Sri Ramavath Dasharath Babu continues his journey of public service—a mission that the local people hope will see even greater success.
























































