ఉండవల్లి గుహల దగ్గర జరిగే యోగా కార్యక్రమంలో బాబా రాందేవ్‌తో కలిసి పాల్గొననున్న సీఎం
ఈ నెల 21న యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
• రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర నిర్వహణకు తీసుకున్న చర్యలు, ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
• ఈ నెల 20న ఉండవల్లి గుహల దగ్గర జరిగే యోగా కార్యక్రమంలో బాబా రాందేవ్‌తో కలిసి పాల్గొననున్న సీఎం
• 21వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో స్టేట్ ఈవెంట్ నిర్వహణ
• స్టేడియంలో 5 వేలు నుంచి 6 వేల మందితో యోగా కార్యక్రమం.. బాబా రాందేవ్ సహా హాజరుకానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
• రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే యోగాంధ్రకు వచ్చే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించిన సీఎం
• ఆరోగ్యంపై అందరూ ధ్యాస పెట్టేలా…. యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న సీఎం
• సంజీవని కార్యక్రమంతో అనుసంధానం ద్వారా యోగాను ఇంటింటికీ తీసుకువెళ్లాలని సీఎం సూచన
-
ఇంటింటికి యోగా థీమ్ తో యోగాడే కార్యక్రమం
-
ప్రజారోగ్యం కోసం సంజీవనితో యోగా అనుసంధానం
-
యోగాంధ్రపై సమీక్షలో అధికారులతో సీఎం చంద్రబాబు
-
రాష్ట్రవ్యాప్తంగా 1.33 లక్షల సెంటర్లలో యోగా డేకు ఏర్పాట్లు
-
యోగాడే కోసం కోటి దాటిన రిజిస్ట్రేషన్లు
-
20, 21వ తేదీల్లో బాబా రాందేవ్‌తో కలిసి హాజరు కానున్న సీఎం
అమరావతి, జూన్ 17:
సంజీవని కార్యక్రమంతో అనుసంధానం ద్వారా యోగాను రాష్ట్రంలో ప్రతీ ఇంటికి తీసుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆరోగ్యంపై అందరూ ధ్యాస పెట్టేలా….యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన యోగా డే కార్యక్రమం నిర్వహణపై అధికారులతో ముఖ్యమంత్రి సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. యోగాంధ్ర నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని సీఎం నిర్దేశించారు. అత్యుత్త ప్రదర్శన కనపర్చిన యోగా మాస్టర్ ట్రైనర్లకు వచ్చే ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు ప్రత్యేక పురస్కారాలు అందజేయాలని సీఎం సూచించారు. “ఇంటింటికీ యోగా” ప్రధాన థీమ్‌గా ఏడాది పాటు కార్యాచరణ ప్రణాళిక చేయాలన్నారు. వివిధ వైద్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక “థెరప్యూటిక్ యోగా” కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయాలని చెప్పారు. ఈసారి యోగా డేకు రాష్ట్రానికి ప్రత్యేక అతిధిగా వస్తున్న ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌తో కలిసి ఈనెల 20న ఉండవల్లి గుహల దగ్గర జరిగే యోగా కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. 21వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించనున్నారు. స్టేడియంలో 5 వేలు నుంచి 6 వేల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి కూడా బాబా రాందేవ్ సహా ముఖ్యమంత్రి హాజరవుతారు. వర్షం కారణంగా ఏమైనా అవాంతరం తలెత్తితే.. ప్రత్యామ్నాయంగా విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో వెయ్యి మందితో స్టేట్ ఈవెంట్ నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. యోగా ప్రచారంలో భాగంగా 19వ తేదీనే రాష్ట్రానికి వస్తున్న బాబా రాందేవ్… అదే రోజు ముఖ్యమంత్రితో సమావేశం అవుతారు. యోగాంధ్రలో భాగంగా ఇప్పటివరకు 2.6 లక్షల మందిని ట్రైనర్లుగా తీర్చిదిద్దినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 21న యోగాడేలో పాల్గొనేందుకు ఇప్పటికే కోటికి మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ముఖ్యమంత్రికి తెలిపారు.
18వ తేదీ నుంచి 20 వరకు విజయవాడలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నట్టు అధికారులు వివరించారు. 21వ తేదీన 1.33 లక్షల సెంటర్లలో యోగా కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నామని సీఎంకు తెలిపారు. 21 తేదీన ‘యోగా@డెస్టినేషన్’ పేరుతో వచ్చే ఏడాది యోగా డే వరకు కేలండర్ ను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. ఈ సమీక్షకు ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ చక్రధర్ బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, ఆ శాఖ సంయుక్త కార్యదర్శి రోణంకి గోపాలకృష్ణ తదితరులు హాజరయ్యారు.











































