CM Chandrababu reviewed the incident of Saikrishna’s disappearance along with the Deputy CM
అమరావతి
సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ
సింగపూర్ పర్యటన ముగించుకుని సచివాలయానికి చేరుకున్న వెంటనే పోలీస్ ఉన్నతాధికారులను పిలిపించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
సాయికృష్ణ అదృశ్యం ఘటనపై డిప్యూటీ సీఎంతో కలిసి సమీక్షించిన సీఎం చంద్రబాబు.
ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వివరించిన పోలీస్ ఉన్నతాధికారులు.
సాయికృష్ణ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై చర్యలకు ముఖ్యమంత్రి ఆదేశం.
సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించిన సీఎం.
సాయికృష్ణ అదృశ్యం ఘటనపై సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తునకు సీఎం నిర్ణయం.
సాయికృష్ణ ఘటనపై నిష్పాక్షపాతంగా దర్యాప్తు జరపాలన్న ముఖ్యమంత్రి.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు.
సమీక్షలో పాల్గొన్న సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు.












































