అమరావతి
Chief Minister Chandrababu attended the ‘One Family – One Entrepreneur’ MSME Growth Summit 2026 event
విజయవాడలో వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ ప్రెన్యుర్ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు
• సమ్మిట్ నిర్వహిస్తున్న అంబేద్కర్ కళావేదికను ప్రారంభించిన ముఖ్యమంత్రి
• 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
• మెటా, అమెజాన్, జోహో లాంటి సంస్థలతో ఒప్పందాలు
• ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు
• రాష్ట్ర వ్యాప్తంగా 1,500 మందికి పైగా ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, విధానకర్తలు, ఆర్థిక సంస్థలు సాంకేతిక నిపుణులు హాజరు
• రాష్ట్రంలో ప్లగ్-అండ్-ప్లే పారిశ్రామిక మౌలిక వసతులను కల్పించే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ పార్కులు
• ఇప్పటికే మొదటి, రెండు దశల్లో 100 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపనతో పాటు కొన్ని ప్రారంభం.
• రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో కుప్పం, మంగళగిరి, పిఠాపురంలో గ్రామీణ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా రూట్యాగ్ స్మార్ట్ విలేజ్ సెంటర్ ఎక్స్‌టెన్షన్ కేంద్రాలను ప్రారంభించిన సీఎం
• రూ.200 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 45 పారిశ్రామిక క్లస్టర్లలో ఉమ్మడి సౌకర్యాల కేంద్రాల ఏర్పాటుకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం

















































