ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా
విద్యార్థులను జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి
• పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్
ప్రతి పాఠశాల నుండి కనీసం ప్రతిభ గల ఇద్దరి విద్యార్థులను గుర్తించి జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు అన్నారు.
శనివారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో అండర్ 14,17,19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల స్కూల్ గేమ్స్ సెక్రటరీలతో వర్క్ షాపు, కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు మాట్లాడుతూ…. పాఠశాలలకు క్రీడాసామగ్రి అందిస్తున్నామని, ప్రతి నెలా నిర్వహించే ‘స్కూల్ కాంప్లెక్సు’లో స్కూల్ కాంప్లెక్సులో క్రీడాసామగ్రి వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. స్కూల్ కాంప్లెక్సు పరిధిలో పీఈటీలు లేని పాఠశాలల్లో స్థానిక ఉపాధ్యాయున్ని గుర్తించి విద్యార్థుల్లో క్రీడలు ప్రోత్సహించేలా బాధ్యతలు అప్పగించాలి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలలు ‘ఫిట్ ఇండియా’ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసి, దానికి సంబంధించి క్విజ్, ఖేలో ఇండియా, క్విట్ ఇండియా ప్రతిజ్ఞ తదితర కార్యక్రమాల్లో పాల్గొని, వాటికి సంబంధించిన సమాచారాన్ని తప్పకుండా అప్ లోడ్ చేయాలన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ‘స్కూల్ స్పోర్ట్స్ కాంప్లెక్సు’ లు జరుగుతున్నాయి, కాబట్టి ఆ సమావేశాల్లో వ్యాయామోపాధ్యాయులు విధిగా పాల్గొని, తమ పాఠశాల ఔన్నత్యాన్ని, క్రీడాభివృద్ధిని పాలుపంచుకోవాలన్నారు.
పాఠశాలలకు క్రీడాసామగ్రి పంపిణీ
ఇప్పటివరకు 12 జిల్లాల్లో పాఠశాలలకు క్రీడాసామగ్రి అందించామని, మిగిలిన జిల్లాలకు అక్టోబరు 16 లోపు ప్రణాళిక ప్రకారం అందిస్తామని సమగ్ర శిక్ష ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులురెడ్డి గారు అన్నారు. సీనియర్ సెకండరీ పాఠశాలలకు 17 ఐటమ్స్, ప్రాథమికోన్నత పాఠశాలలకు 14 ఐటమ్స్, ప్రాథమిక పాఠశాలకు 9, ఉన్నత పాఠశాలకు 17 ఐటమ్స్ చొప్పున వాలీబాల్, నెట్, త్రో బాల్, నెట్, హ్యాండ్ బాల్, టెన్నికాయిట్, యోగా మ్యాట్లు, ఫుట్ బాల్, షార్ట్ పుట్ వంటి క్రీడాసామగ్రి వయసుకు తగినట్లు అందిస్తున్నామన్నారు.ఈ సమావేశంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు శ్రీమతి పి.పార్వతి గారు, సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులురెడ్డి గారు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి జి.భానుమూర్తిరాజు గారు తదితరులు పాల్గొన్నారు.
Government of Andhra Pradesh
Department of School Education – Samagra Shiksha
Students should be trained as national level athletes
• Commissioner of School Education Shri. S. Suresh Kumar
VIJAYAWADA:
Shri S. Suresh Kumar, Commissioner of School Education and President of School Games Federation, said that at least two talented students from each school should be identified and trained as national level athletes.
Under 14, 17, 19 School Games Federation of Andhra Pradesh organized a workshop and executive committee meeting with the School Games Secretaries of all districts at the State Office of Samagra Shiksha on Saturday.
On this occasion, Commissioner Shri. S. Suresh Kumar said…. that we are providing sports equipment to the schools, and we want to create awareness about the use of sports equipment in the school complex in the ‘School Complex’ organized every month. In schools that do not have PETs within the school complex, a local teacher should be identified and entrusted with the responsibility of promoting sports among the students. All government and private owned schools should register in the ‘Fit India’ app and participate in Quiz, Khelo India, Quit India Pledge etc. related to it and upload the related information without fail. ‘School sports complexes’ are being held like never before in the state, so the gym teachers should participate in those meetings and participate in the development of their school and sports.
Distribution of sports equipment to schools
ASPD KV Srinivasulu Reddy said that so far sports equipment has been provided to schools in 12 districts and the rest of the districts will be provided according to the plan before October 16.
17 items for senior secondary schools, 14 items for primary schools, 9 items for primary school and 17 items for high school are provided for age-appropriate sports equipment such as volleyball, net, throw ball, net, hand ball, tennis court, yoga mats, football, short put etc.
In this meeting, Vice President of School Games Federation Mrs. P. Parvathi, State Secretary of School Games Federation G. Bhanumurthy raju and others participated. As part of the programme, the book ‘Under 14, 17, 19 School Games Federation of Andhra Pradesh, Workshop and Executive Meeting with District School Games Secretaries’ was launched.