గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం తో పాటు వారి ఆరోగ్య విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న జగనన్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వం వచ్చిన నాటినుండి గర్బిణీలు, బాలింతలకు ఇచ్చే వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ కింద ఒక్కొక్కరికి రూ 850 చొప్పున ఖర్చు చేస్తుండగా , వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ టేక్ హోం రేషన్ కింద ఒక్కొక్కరికి రూ.1,150 చొప్పున ఖర్చు చేస్తూ, పౌష్టికాహారాన్ని అందిస్తూ, ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తుందని నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి ఒక ప్రకటనలో తెలియజేశారు.
గత ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.450 నుంచి రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, ఇప్పుడు ఏటా బాలింతలు గర్భిణీల కోసం సుమారు రూ.2,300 కోట్లు జగనన్న ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు.
రాష్ట్రంలో రక్తహీనత, పౌష్టికాహారలేమితో ఏ ఒక్క మహిళ బాధపడకూడదనే లక్ష్యంతో సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించాలని సీఎం భావిస్తున్నారన్నారు.
ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తూ , డ్రై రేషన్ కింద అందించే సరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పరీక్షించాలని అధికారులను ఆదేశిస్తూ,ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలన్నీ మంచి ఫలితాలనిచ్చేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి శ్రీ వై యెస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నరన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా,క్రమం తప్పకుండా తనిఖీలు చేసేలా.. టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండేలా, అంగన్‌వాడీ కేంద్రాలకు మరమ్మతుల సమయంలో ఈ అంశాలన్నింటినీ ప్రాధాన్యతగా పరిగణించాలన్నారు.ఫ్యామిలీ డాక్టర్లు గ్రామాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా అంగన్‌వాడీలను సందర్శించాలని ఆదేశించారన్నారు. పిల్లలు, తల్లులు, బాలింతల ఆరోగ్యాన్ని పరీక్షించి, ఏమైనా సమస్యలుంటే మంచి వైద్యాన్ని అందించాలని, అధికారులని ఎప్పటికప్పుడు మన సీఎం జగన్ ఆదేశిస్తున్నరన్నారు.
వైఎస్సార్ సంపూర్ణ పోషణతో నెలకు అందించే రేషన్ సరుకులు ఇలా ఉన్నాయి.
1) 2 కిలోలు రాగి పిండి
2) 1 కేజీ అటుకులు
3) 250 గ్రాముల బెల్లం
4) 250 గ్రాముల చిక్కీ
5) 250 గ్రాముల ఎండు ఖర్జూరం
6) 3 కేజీల బియ్యం
7) 1 కేజీ పప్పు
8) అర లీటర్ వంటనూనె
9) 25 గుడ్లు
10) 5 లీటర్ల పాలు
వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్‌తో నెలకు అందే రేషన్ సరుకుల వివరాలు ఇలా ఉన్నాయి..
1) 1 కేజీ రాగి పిండి
2) 2 కిలోలు మల్టీ గ్రెయిన్ ఆటా
3) 500 గ్రాముల బెల్లం
4) 500 గ్రాముల చిక్కీ
5) 500 గ్రాముల ఎండు ఖర్జూరం
6) 3 కేజీల బియ్యం
7) 1 కేజీ పప్పు
8) అర లీటరు వంటనూనె
9) 25 గుడ్లు
10) 5 లీటర్ల పాలు
ఇలా గర్భిణులు, బాలింతలు విషయంలో సీఎం జగన్ ప్రత్యేక శ్రద్దతో,బాధ్యతతో వారి సంక్షేమాన్ని,ఆరోగ్యాన్ని చూసుకోవడం వల్ల మన రాష్ట్రంలో నేడు గర్భస్రావం,శిశు మరణాలు రేటు 67 శాతం తగ్గి,
దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందని నారాయణమూర్తి తెలియజేశారు.
-అంకం రెడ్డి నారాయణమూర్తి
నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్