షర్మిల కాదు.. ఎవరు వచ్చినా ఏమీ చేయలేరు
వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి
విశాఖపట్నం: షర్మిల కాదు.. ఎవరు వచ్చినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరని వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి గురించి షర్మిలకు ఏం తెలుసు. మాతో పాటు షర్మిల వస్తే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూపిస్తామన్నారు. వైయస్ఆర్‌కు నిజమైన వారసులెవరో ప్రజలే నిర్ణయిస్తారని ఆయన చెప్పారు. విశాఖలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల తొలిసారి రాష్ట్రానికి వచ్చారు. రాష్ట్ర అభివృద్ధి గురించి ఆమెకు ఏమీ తెలియదు. పక్క రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదంటే ఎలా?. వైయస్ఆర్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరారు. వైయస్ఆర్ కుమారుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్యాయంగా జైలులో పెట్టిన కాంగ్రెస్‌లో ఆమె చేరారు.
మొన్నటివరకు తెలంగాణ బిడ్డగా అక్కడ తిరిగారు. ఆమె అక్కడ ఎందుకు పోటీ చేయలేదు అనేది తెలియదు. షర్మిల కాదు ఎవరు వచ్చినా మా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టలేరు. వైఎస్సార్ కుటుంబాన్ని సోనియా గాంధీ ఇబ్బందుల్లో పెట్టారు. ఢిల్లీ కాంగ్రెస్‌లో చేరి మమ్మల్ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది సమీక్షించుకోవాలి. అవినీతికి పాల్పడ్డ చంద్రబాబును షర్మిల ప్రశ్నించాలి. మేము ఎప్పుడు కూడా బీజేపీతో కాంప్రమైజ్ కాలేదు. ఈనెల 27వ తేదీన భీమిలిలో ఎన్నికల శంఖారావాన్ని సీఎం వైయస్ జగన్ పూరిస్తున్నారు. రెండు లక్షల మంది 34 నియోజకవర్గాల నుండి హాజరవుతున్నారని తెలిపారు.