అసలు కారణం – చిన్న హాస్య కథ
నిరుద్యోగం వెనుక అసలు కథ
ఇంటర్వ్యూ లకు వెళ్లిన విద్యార్థులలో అనేకమంది భాష నైపుణ్యం లేకపోడం వాళ్ళ నేటి కాలంలో ఉద్యోగాలను పొందలేకపోతున్నారు.
దానికి అసలు కారణం తెలియజేసే చిన్న కథ ఇది. ఏడు చేపల కథ అందరికీ తెలిసినదే. చేప ఎందుకు ఎండలేదు అంటే ఒక గొలుసు మాదిరిగా అనేక కారణాలు .
ఆ గొలుసు వెంబడి వెళితే చివరికి అసలు కారణం (చీమ) కనిపిస్తుంది . అలాగే ఉద్యోగ ఇంటర్వ్యూ కి వెళ్లిన విద్యార్థి ఇంటర్వ్యూ చేసే మేనేజర్ కి తన భాషా లేమి వెనుక గొలుసు మాదిరిగా అనేక కారణాలు చెపుతాడు చివరకు అసలు కారణం తెలిస్తే అవాక్కవుతారు.
ఇంటర్వ్యూ గదిలో :
ఇంటర్వ్యూయర్: భాషాజ్ఞానం ఎందుకు రాలేదు?
అభ్యర్థి : నేను సినిమాలు చూడగలను. పుస్తకాలు చదవలేను
ఇంటర్వ్యూయర్: : పుస్తకాలు ఎందుకు చదవలేవు ?
అభ్యర్థి : చదివేటంత భాష లేదు, ఆత్మవిశ్వాసం లేదు,
ఇంటర్వ్యూయర్: భాష ఎందుకులేదు స్కూల్ కి వెళ్ళేవుకదా ?
అభ్యర్థి : టీచర్ అంత భాష చెప్పలేదు
ఇంటర్వ్యూర్ : టీచర్, టీచర్ విద్యార్థికి భాష ఎందుకు చెప్పలేదు ?
టీచర్: మేనేజ్మెంట్ చెప్పనివ్వలేదు
ఇంటర్వ్యూయర్: మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ భాష ఎందుకు చెప్పనివ్వలేదు ?
మేనేజ్మెంట్: తల్లితండ్రులు మార్కులకోసం పీకమీద కూర్చుంటే , మాదా తప్పు?