- అమెరికా నుంచి ఫోన్ కాల్ – నిజం చెప్పే చిన్న కథ – పూలబాల
అమెరికా నుంచి ఫోన్ కాల్ కొడుకు తల్లితో : అమ్మా నువ్వు నిన్న ఫోన్ చేసావట..
అమ్మ : అవునురా కోడలితో మాట్లాడేను
కొడుకు :అవునమ్మా చెప్పింది నువ్వు విలువలు గురించి ఏదో అన్నావట కదా …
అమ్మ : అవున్రా …కొడుకు: అమ్మా నువ్వు నేర్పిన విలువలే నాకు వచ్చాయి. కార్పరేట్ స్కూల్ లో వేసి ఆది వారం సోమవారం అని చూడకుండా బండకేసి బాదిన్చావు. నీ మాటల్లో ఏంటో తియ్యదనం కురిపిస్తావు నీ చేతల్లో అది ఎక్కడా కనిపించవు. ఆట పాటలు చంకనాకి పోయాయని నేను భాద పడుతుంటే, నా కొడుకు ఇంగ్లీష్ మీడియం లో చదువుతున్నాడని ఎంతో గొప్పగా ఫీల్ అయ్యే దానివి. నాకు తెలుగుపద్యాలు , కవితలన్నా చాలా ఇష్టం అయినా నన్ను నా భవిష్యత్ కోసం అని ఇంగ్లిష్ మీడియం లోనే చదువుకోవాలనే దానివి. ఎవరైనా తెలుగు మీడియం లో చదువుతుంటే ” తెలుగు ఎందుకు వేస్ట్ ” అనే దానివి. సందర్భం వచ్చినప్పుడు మాత్రం చటుక్కున డైలాగ్ మార్చేసి తెలుగు మీద ప్రేమ కురిపించేదానివి. గొప్ప పొలి టీ షన్ వి అమ్మా నువ్వు. క్షమించు అమ్మా నిజం మాట్లాడడంఇండియా లో తప్పే కాని నేను ఇప్పుడు ఇండియా లో లేను కదా. అమెరికా లో ఉన్నాను. అది కూడా నీ చలవే కదమ్మా. కొడుకు అమెరికా లో ఉన్నాడని గొప్పగా చెప్పుకో. చిన్నపుడు మాత్రు భాషని వద్దని అన్నావు . తరువాత మాత్రు భూమి వద్దు అని అమెరికా తోలావు. అందిరి అమెరికా గొప్పలు చెప్తూ ఉండేదానివి ఇప్పుడు నీ కొడుకు అమెరిక గొప్పలు చెప్పుకో వచ్చు. సందర్భం వచ్చినప్పుడు మాత్రు దేశం , దేశభక్తి గురించి ఎంతైనా చెప్పవచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్న ఫోనులో నా పెళ్ళానికి విలువలు లేవు అన్నావు అట కదా. నాన్న చేత వేరు కుంపటి పెట్టించింది నువ్వు కాదా? అత్తా మామలకి చాకిరీ చేయబడుతుంది అని నాన్న చేత నానా అబద్దాలు ఆడించి వేరు కాపురం పెట్టించింది నువ్వు కాదా చివరి దాకా ఉండేది పెళ్ళామే అనేదానివి కదా. నేను అదే అంటున్నాను. నీ బాటలోనే నడుస్తున్నాను. నీవిలువలె నాకూ వచ్చాయి. నా పెళ్ళాన్ని ఇంకొక్క మాట అన్నావో ఖబ్దార్.
మాతృభాషని మంట గలిపింది ఎవరు ?