ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలకు స్థానచలనం
ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అధిష్ఠానం స్థానచలనం నిర్ణయంపై కొందరు విధేయత ప్రకటిస్తుంటే.. మరికొందరు తమదారి తాము చూసుకుంటున్నారు. ఇటీవల వైసీపీ అధిష్ఠానంపై ధిక్కార స్వరం వినిపించిన కాపు రామచంద్రారెడ్డి.. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డిని కలిశారు. ఈసారి ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. ఇక, నిన్నటికి నిన్న సంచలన వ్యాఖ్యలతో దుమారం రేపిన శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. సడెన్‌గా స్వరం మార్చారు. తాను జగన్‌ను ఒక్క మాటా అనలేదనీ..తాను జగన్‌ను ఒక్క మాటా అనలేదనీ.. కేవలం అధికారుల తీరుపైనే తాను మాట్లాడానని చెప్పుకొచ్చారు. అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమన్నారు
ఎంపీలు గోరంట్ల మాధవ్, నందిగం సురేష్. క్యాంప్ ఆఫీసుకు నేతలు క్యూ కట్టారు. ఈ లిస్టులో మంత్రులు బొత్స, బుగ్గన, జయరాం.. ఎంపీలు సత్యవతి, గోరంట్ల మాధవ్ ఉన్నారు. తోట త్రిమూర్తులు, ద్వారంపూడి, అయోధ్యరామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తెల్లం బాలరాజు కూడా ముఖ్యమంత్రిని కలిశారు.
అటు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపైనా వైసీపీ కసరత్తు పూర్తయినట్టు తెలుస్తోంది. ముగ్గురు సభ్యులను దాదాపు ఖరారు చేసిన వైసీపీ.. ఓసీ వర్గానికి చెందిన వైవీ సుబ్బారెడ్డి, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన గొల్ల బాబురావు, బలిజ వర్గానికి చెందిన జంగాలపల్లి శ్రీనివాస్‌ని ఎంపిక చేసింది. అయితే రాబోయే జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయి? ఎవరి పేర్లు పోతాయన్నది ఉత్కంఠ కొనసాగుతోంది.