సింగపూర్/ అమరావతి,
23.04.26.
సింగపూర్ లో 3 వ రోజు శిక్షణ కార్యక్రమంలో JTC కార్పొరేషన్ పై మంత్రులు అధ్యయనం
* సింగపూర్ వాణిజ్య & పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో దేశంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే ప్రభుత్వ సంస్థ JTC కార్పొరేషన్ (గతంలో జురాంగ్ టౌన్ కార్పొరేషన్) ను సందర్శించిన మంత్రుల బృందం
* పారిశ్రామిక వాడల అభివృద్ధి, ఆధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ ఎస్టేట్‌లను నిర్మించడం, పర్యావరణానికి అనుకూల గ్రీన్ ప్రాజెక్టులను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించిన JTC కార్పొరేషన్
* సంస్థ పురోగతిని ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించిన JTC రిటైర్డ్ అసిస్టెంట్ సీఈవో సీ కీ పోక్ (Seah Kee Pok)
* సింగపూర్‌లో కీలక ప్రాజెక్టులు జురాంగ్ ఐలాండ్ (Jurong Island), వన్-నార్త్ (one-north), చంగీ బిజినెస్ పార్క్ & పుంగోల్ డిజిటల్ డిస్ట్రిక్ట్ వంటి భారీ ప్రాజెక్టుల అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించిన JTC కార్పొరేషన్ పనితీరు, కార్యకలాపాలను అడిగి తెలుసుకున్న మంత్రులు
* ఆగ్నేయాసియాలోనే మొదటిదైన జురాంగ్ రాక్ కేవర్న్స్ (చమురు నిల్వ కోసం భూమి లోపల నిర్మించిన గుహలు) వంటి వినూత్న నిర్మాణాలను చేపట్టిన సంస్థ JTC కార్పొరేషన్
* ఏపీలో సైతం ఈ తరహాలో పారిశ్రామిక వాడల అభివృద్ధి, స్మార్ట్ ఎస్టేట్‌ల నిర్మాణం, గ్రీన్ ప్రాజెక్టులను అమలు చేయడం వంటి అంశాలపై అధ్యయనం చేసిన మంత్రులు
* ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పి. నారాయణ, బి.సి. జనార్దన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్
















































