investigation should be done on Jagan corruption…
జగన్ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరగాలి: పురందేశ్వరి
జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా వెళ్లినందున మనం కూడా విద్వేషపూరితంగా, కక్షపూరితంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు.
జగన్ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరగాలి: పురందేశ్వరి
రాజమహేంద్రవరం అర్బన్, జూన్ 5: ‘జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా వెళ్లినందున మనం కూడా విద్వేషపూరితంగా, కక్షపూరితంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ రాష్ట్రంలో జరిగిన అవినీతిపై కచ్చితంగా లీగల్గా విచారణ జరగాల్సిన అవసరం ఉంది’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘వైసీపీ ప్రభుత్వంలో మన నాయకులను ఏ విధంగా విసిగించి వెంటాడి ఇబ్బందిపెట్టారో, కారణం కూడా లేకుండా ఏవిధంగా చంద్రబాబును అరెస్టు చేశారో… ఆ రకంగా, ఆ విధంగా వెళ్లాలని మనవాళ్లు అనుకుంటారు. కక్షపూరితంగా మనం వెళ్లనవసరం లేదు. అయితే ప్రకృతి సంపద, ప్రజా సంపదలను వారంతా దోచుకున్నారు. వీటన్నింటిపై సమగ్రమైన విచారణ జరగాల్సి ఉంది. ఇది వ్యక్తిగతంగా కాదు… లీగల్గా ఏ రకంగా ముందుకు వెళ్లాలి అనేది కచ్చితంగా కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది.’ అని పురందేశ్వరి పేర్కొన్నారు.