ADVERTISEMENT
500 సంవత్సరాల తరువాత మళ్ళీ ప్రబంధం- ప్రాచీన సాహిత్య శిల్పం
శ్రీనాథుడు 15 వశతాబ్దికి చెందిన తెలుగుకవి. ప్రబంధనశైలి లో రచనలు చేసిన ప్రౌఢకవి. శృంగారనైషధం ఆయన వ్రాసిన ప్రబంధం. ఆతరువాత ప్రబంధరచన ఆగిపోయింది. పూర్తి ప్రమాణాలు గల ప్రబంధాలులేవు. శతాబ్దాలతరువాత2022 లో 1265 పేజీల అతి పెద్ద సరళ గ్రాంధిక ప్రబంధం భారతవర్ష తెలుగు అకాడెమీ చైర్పర్సన్డాక్టర్ల క్షీపార్వతి, నాగార్జునా విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి ఆచార్య కృష్ణారావు గారి చేతుల మీదుగా విడుదలైంది.
ఆచార్య కృష్ణారావు భారతవర్ష లో సంస్కృత పదాలు కూడా విరివిగా వాడడం వల్ల అచ్చ తెలుగు కావ్యం అనకూడదని సరళ గ్రాంధిక ప్రబంధం అనాలని సూచించారు. ఆయన తన ముందుమాట లో “భారత వర్ష భారతీయ ఆత్మకు ప్రతీక” అన్నారు. అంతా పద్య రూపంలో ఉండేకావ్యాన్ని పద్యకావ్యం అంటారు అంతా గద్యరూపంలో ఉండేకావ్యాన్నిగద్యకావ్యం అంటారు. గద్యం పద్యం కలిసి ఉండే కావ్యాన్ని మిశ్రమ కావ్యం లేదా ప్రబంధకావ్యం అంటారు. దీనర్థం కొంత కథ పద్యరూపంలో వ్రాసేసి మిగితాది గద్యరూపంలో వ్రాసేస్తే ప్రబంధం అయిపోతుందనికాదు. దానికి కొన్ని సాహిత్య ప్రమాణాలు ఇతర లక్షణాలు ఉండాలి. అవన్నీ భారతవర్షలో ఉన్నాయని వంద పాత్రల ను చూపిస్తూ, ప్రబంధవర్ణనలైన1. నగర 2. సముద్ర 3. శైల 4. ఋతు 5. చంద్రోదయ 6. సూర్యోదయ 7. ఉద్యాన 8. సలిల9. మధుపాన 10. రతోత్సవ 11. విప్రలంభ 12. వివాహ, 13. కుమారోదయ 14. మంత్ర 15. ద్యూత 16. ప్రయాణ17. యుద్ధ 18. నాయకాభ్యుదయ వర్ణనలను చూపిస్తూ అందమైన భాషతో కవితాసౌరభాలు విరజిమ్మేసాహిత్య పుష్పం భారతవర్ష ప్రబంధం.1265 పేజీల పెనుగ్రంథం నుండి గ్రహించిన 135 పేజీల చిన్నపుస్తకం. సంస్కృత కీర్తనలు నవర స పద్యాలు తో నిండిన ప్రాచీన సాహిత్య శిల్పం. శాస్త్రీయసాహిత్యం.
శాస్త్రీయ సాహిత్యం అంటే ఏంటి? దాని ప్రాముఖ్యత ఏంటి ?
ఒక సాహిత్యం నాణ్యతను తెలియజేయడానికి వాడేమాట శాస్త్రీయ సాహిత్యం. ప్రతిదేశం దీనికి ఎంతో విలువ నిచ్చి భద్రపరిచి తరువాత తరాలకు అందిస్తుంది. సముద్రంలో దీపస్తంభం ఓడలకి తోవచూపినట్టు జాతికివెన్నెముకైన రచయితలకి తోవచూపిస్తాయి
పంచకావ్యాలు
తెలుగు పంచ కావ్యాలుగా ప్రసిద్ధి కెక్కిన రచనలు అన్నీ ప్రబంధాలే. అల్లసాని పెద్దన రచించి నమను చరిత్రము, తెనాలి రామకృష్ణుడు రచించి న పాండు రంగమాహాత్మ్యము – కృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద, రామరాజభూషణుడు రచించిన వసుచరిత్రము. శ్రీనాథుడు రచించిన శృంగారనైషధం , ఇవన్నీప్రబంధాలే. ప్రబంధాలు అన్నీ శాస్త్రీయ సాహిత్యమే. అటువంటి కోవకు చెందిన దేభారతవర్ష. ఒకచిన్నఉదాహరణ శ్రీనాథుడు మరుత్తరాట్చరిత్ర.
(చాలా మందికి తెలియదు కనుక దీని కథని టూకీగాచెపుతాను.)
పూర్వం కరందముడనే రాజుకి అనిక్షి తుడనే కొడుకు ఉండేవాడు, అతడు పెరిగి పెద్దవాడైన సమయానికి విశాలరాజు తనకుమార్తె వైశాలికి స్వయం వరం ప్రకటించాడు. ఆరాకుమారి ని స్వయంవరంలో చేపట్టడానికి అనిక్షితుడు బయలుదేరాడు. ఈ యువరాజు అందగాడే కాక సకల కళావల్లభుడు. అనిక్షితుడు స్వయంవరానికి వస్తే తమలో ఎవరికికూ డా రాకుమారిదక్కదని ఇతర రాజ కుమారులు అసూయ చెంది మోసంతో బంధించేస్తారు.కొడుకు బంధీ అయినాడని తెలియగానే కరందముడు పెద్దసేనతో వచ్చి ఇతర రాకుమారులను ఓడించి అనిక్షితుని విడుదలచేశాడు. సాహస వీరుడై వుండి శక్తిసామర్థ్యాలు కలిగివుండి కూడా ఇతర రాజకుమారులను ఓడించ లేక తండ్రిచేత విడుదలైనందుకు అనిక్షితుడు బాగా సిగ్గుపడ్డాడు. ఇలాంటి అసమర్ధుడైన తనకు పెండ్లెందుకని రాజ్యమెందుకని తండ్రి ఎంతవారించినా నాలాంటి చేతకానివాడికి పాలించే అర్హతలేదని బ్రహ్మచర్య దీక్షతీసుకొంటానని అడువులకు వెళ్ళిపోయాడు. అనిక్షితుడి పౌరుషం దీక్షలు వైశాలికి నచ్చాయి. పెండ్లంటూ చేసుకొంటే అనిక్షితుడిని తప్ప ఇతరులను పెండ్లాడనంటూ పంతంతో తపస్సు చేసుకోటానికని అడవులకు వెళ్లిపోయింది. అప్పటి కథలు అలాఉండేవి. ప్రజలు కూడా అలాగే ఉండేవారు. మానాభిమానాలు, పంతం పౌరుషం గల అప్పటి ప్రజలని మనం గమనించవచ్చు. శాస్త్రీయ సాహిత్యానికి మరొక ఉదాహరణ మనుచరిత్ర. మనుచరిత్ర లాటి గ్రంధాలు చదవడం వల్లా చాలా లాభంఉంది. మనుచరిత్రలో ప్రవరాఖ్యుడు వేద పారంగతుడు ధర్మా నిష్టాగరిష్ఠుడు. వలచి వచ్చిన వరూధినిని వద్దని మాతాపితరులసేవ, గోసేవ, అగ్నిహోత్రం ఆగిపోతాయని తిరస్కరిస్తాడు. గృహస్తుధర్మమే గొప్పదని భావించి అగ్నిదేవుణ్ణి ప్రార్ధించి హిమాలయాల నుండి తన ఇంటికి చేరుకుంటాడు.
భారతవర్ష కూడా అటువంటి విలువలతో కూడిన సాంఘిక ఇతివృత్తం గల కథ.మంచి భాషకి పట్టం కట్టి మనసంస్కృతిని, విలువలని నిలబెట్టే ప్రబంధకావ్యం భారతవర్ష. 2 లక్షల యాభైవేల పదాలు 100పాత్రలు 200 వృత్తపద్యాలు , 2000 ఉపమానాలు అష్టా దశ వర్ణన లతో సంస్కృతాద్రాలలో అతితక్కువకాలంలో రచించబడి ప్రపంచ రికార్డు సాధించిన అతిపెద్ద సరళ గ్రాంధిక ప్రబంధం.
గొప్ప భాష మన జాతిసొంతం. అదేమన ఉనికి. ఆత్మనిగ్రహం ,ఇంద్రియనిగ్రహం , సత్యవాకుపాలన , తపోబలం, బ్రహ్మచర్యం ఇలాటి మాటలకి నేడు కాలం చెల్లిపోయింది. ఇంద్రియని గ్రహం బ్రహ్మచర్యం బూతుమాటలు. ఇప్పుడు చెత్త సినిమాలు రౌడీ నే కథానాయకుడుగా చూపే విలువలులేని చెత్త కథలతో -కెవ్వుకేక , మంచిఫిగర్ , తేడాగాడు, ఫుల్ఎంజాయ్ ఇలాంటి చెత్తబాషతో ప్రజలని తప్పు తోవపట్టిస్తున్నాయి
మనం ఎటువంటి సాహిత్యాన్ని ఆదరిస్తే అటువంటి ప్రపంచం మనకళ్ళ ముందు ఉంటుంది. ఆప్రపంచంలో నే మనం నివసించాల్సి వస్తుంది. తస్మాత్జాగ్రత్త !!!
ADVERTISEMENT
ADVERTISEMENT