అమరావతి
విశ్వసనీయతకు మారుపేరు జగనన్న ప్రభుత్వం అని మరోసారి రుజువు చేస్తూ.. స్వయం సహాయక సంఘాల అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన హామీని త్రికరణ శుద్ధిగా నెరవేరుస్తూ..
వరుసగా నాల్గవ ఏడాది..
“వైఎస్సార్ ఆసరా”
గత పాలకులు రుణాలు కట్టొద్దు పొదుపు సంఘాల తరపున మేమే చెల్లిస్తామని 2014లో మేనిఫెస్టోలో పెట్టి మరీ, హామీ ఇచ్చి అమలు చేయని కారణంగా..
.. రాష్ట్రవ్యాప్తంగా చితికిపోయిన దాదాపు 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 78.94 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఊరటనిస్తూ.. 4 వాయిదాల్లోఅదే అక్కచెల్లెమ్మలకు 2019 ఎన్నికల నాటికి SLBC తుది జాబితా ప్రకారం ఉన్నరూ. 25,571 కోట్ల రుణాన్ని తామే ఇస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, ఇప్పటికే 3 విడతల్లో రూ. 19,176 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించిన జగనన్న ప్రభుత్వం…
ఇప్పుడు నాల్గవ విడతగా మరో రూ.6,394.83 కోట్ల ఆర్థిక సాయాన్నిజనవరి 23 నుండి రెండు వారాల పాటు పండగ వాతావరణంలో 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78, 94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి అనంతపురం జిల్లా ఉరవకొండలో నేడు (23.01.2024) శ్రీకారం చుట్టనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..
నేడు అందిస్తున్న వైఎస్సార్ ఆసరా లబ్దితో ఈ 56 నెలల కాలంలో నేరుగా DBT (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా అందించిన లబ్ధి రూ.2.50 లక్షల కోట్లు దాటింది
నేడు అందిస్తున్నరూ.6,394.83 కోట్లతో కలిపి” వైఎస్సార్ ఆసరా” క్రింద మన జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 25,571 కోట్లు… ఇచ్చిన మాటను సంపూర్ణంగా నెరవేరుస్తూ..
వివిధ పథకాల ద్వారా కేవలం అక్కచెల్లెమ్మలకు మాత్రమే గత 56 నెలల్లో మన జగనన్న ప్రభుత్వం అందించిన లబ్ది…రూ. 2,66,772.55 కోట్లు
అక్కచెల్లెమ్మలు వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్టుగా చేసి, వారి జీవనోపాధి మెరుగుపడేలా.. అమూల్, హిందూస్తాన్ లివర్, ఐ.టి.సి., పి&జి. అల్లానా, అజియో రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, కాల్ గుడి, జియాన్, నినె, ఇర్మా, అయేకార్ట్, మహేంద్ర అండ్ ఖేతి వంటి వ్యాపార దిగ్గజాలతో, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకొని వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపించడంతో పాటు ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి పథకాలతో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి బాటలు వేసిన జగనన్న ప్రభుత్వం
గత పాలకులు ఒక వైపు రుణాలు మాఫీ చేస్తామని మాట చెప్పి చేయకపోగా, అక్టోబర్ 2016 నుండి సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేయడంతో అప్పులు తడిసి మోపెడయ్యాయి. ఒకవైపు సుమారు రూ.3,036 కోట్ల వడ్డీని అక్క చెల్లెమ్మలే బ్యాంకులకు అపరాధ వడ్డీ రూపేణా చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతేగాక “ఎ”. “బి” గ్రేడ్ లో ఉన్న సంఘాలు కూడా “సీ”, “డి” గ్రేడ్ లలోకి పడిపోయాయి.. NPAలు, అవుట్ స్టాండింగ్‌లు 18.36 శాతానికి చేరాయి
జగనన్న ప్రభుత్వంలో “వైఎస్సార్ ఆసరా”, “వైఎస్సార్ సున్నావడ్డీ”ల ద్వారా లబ్ధి పొందిన అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలు తిరిగి క్రియాశీలకంగా మారడంతో నిరర్థక ఆస్తులు (NPA). అవుట్ స్టాండింగ్ లు కూడా అప్పట్లో ఉన్న 18.36 శాతం నుండి 0.17 శాతానికి తగ్గాయి..
కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులతో అనుసంధానం చేసి జగనన్న ప్రభుత్వం అందించిన సహకారంతో ఇప్పటి వరకు 14,77,568 మంచి అక్కచెల్లెమ్మలు కిరాణా దుకాణాలు. ఆవులు, గెదెలు, మేకల పెంపకం, వస్త్ర వ్యాపారం తదితర వ్యాపారాలు చేపట్టి నెలకు రూ.7,000 నుండి రూ.10,000ల వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు.. అమూల్ తో ఒప్పందం కారణంగా మార్కెట్ లో పోటీ పెరిగి లీటర్ పాలపై రూ.10 నుండి రూ.22 వరకు అదనపు ఆదాయం, ఈ 56 నెలల్లోనే..
అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు వివిధ పథకాల (DBT, Non DBT) ద్వారా కేవలం అక్కచెల్లెమ్మలకు మన జగనన్న ప్రభుత్వం అందించిన లబ్ధి అక్షరాల రూ. 2,66,772.55 కోట్లు..
వైఎస్సార్ ఆసరా మైలు రాళ్లు
మొదటి విడత, 11 సెప్టెంబర్ 2020
అందించిన లబ్ధి రూ.6,318.76 కోట్లు లబ్ధిదారుల సంఖ్య 77,87,295
రెండవ విడత, 07 అక్టోబర్ 2021
అందించిన లబ్ధి రూ.6,439.52 కోట్లు లబ్ధిదారుల సంఖ్య 78,75,539
మూడవ విడత, 25 మార్చి 2023
అందించిన లబ్ధి రూ.6,417.69 కోట్లు లబ్ధిదారుల సంఖ్య 78,94,169
నాల్గవ విడత, 23 జనవరి 2024
అందించిన లబ్ధి రూ.6,394.83 కోట్లు లబ్ధిదారుల సంఖ్య 78,94,169
వైఎస్సార్ ఆసరా ద్వారా 4 విడతల్లో అందించిన మొత్తం లబ్ధి రూ. 25,571 కోట్లు