విశాఖపట్నం – వయా ఉమ్మడి కర్నూలు జిల్లా మీదుగా కడపకు అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం ఒత్తిడి తీసుకురావాలి:
20–11–2023,
అమరావతి.
రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల పురోగతిపై రేపు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం.
ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి హాజరుకానున్న అధికారులు.
సమావేశంలో ప్రస్తావనకు రానున్న అంశాలపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమావేశం.
చీఫ్ సెక్రటరీ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరు.
ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే….:
రాష్ట్ర విభజన వల్ల విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరిగింది:
విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా చట్టంలో పేర్కొన్న అంశాలు అలానే ఉన్నాయి:
ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే:
అప్పుల్లో 58శాతం ఏపీకి, 42 శాతం తెలంగాణకు కేటాయించారు:
కాని రెవిన్యూ పరంగా 58 శాతం తెలంగాణకు, 42 శాతం ఏపీకి వచ్చింది:
పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రం ఆదాయాలు ఏ రకంగా పెరుగుతాయి:
ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు, పోలవరంకు నిధుల రాకలో సమస్యలున్నాయి :
తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు కూడా రాలేదు :
మరి విభజన కష్టాల నుంచి రాష్ట్రం ఏవిధంగా బయటకు రాగలుగుతుంది:
పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై కూడా సమావేశంలో దృష్టిపెట్టాలి:
విభజన వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే కదా విభజన చట్టంలో హామీలు ఇచ్చారు:
హైదరాబాద్ రూపేణా పారిశ్రామిక, రోడ్డు రవాణా, విద్యా సంస్ధల పరంగా ఇలా అన్నిరకాల మౌలిక సదుపాయాలను కోల్పోయాం:
దీనివల్ల రాష్ట్రానికి రెవిన్యూ రూపంలో చాలా నష్టపోయాం:
దీన్ని సర్దుబాటుచేస్తూ విభజన చట్టంలో ఆయా రంగాలకు సంబంధించి మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు హామీలు ఇచ్చింది:
విభజన చట్టంలో ఉన్న ఈ స్ఫూర్తి ఇప్పుడు అమల్లోకూడా కనిపించాల్సిన అవసరం ఉంది:
ఇవి నెరవేరితే రాష్ట్రంలో పలు వసతులు సమకూరుతాయి:
తద్వారా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయి:
రెవిన్యూ క్రమంగా పెరుగుతూ వస్తుంది:
రాష్ట్రం పురోగమిస్తేనే దేశంకూడా పురోగమిస్తుంది:
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పట్ల కేంద్రం తప్పనిసరిగా ప్రత్యేకత చూపించాల్సిన అవసరం ఉంది:
అప్పుడే విభజన నష్టాల నుంచి గట్టెక్కగలుగుతుంది:
అధికార వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిలో భాగంగా మూడు రాజధానులను ప్రకటించాం:
ఈ ప్రాంతాల మధ్య సమతుల్యమైన, సమగ్రమైన అభివృద్ధి మన బాధ్యత:
మూడు ప్రాంతాలను అనుసంధానిస్తూ రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది:
ఇప్పటికే పలు రోడ్లు నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి:
భవిష్యత్తులో కూడా వీటిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది:
ఈ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమగ్రమైన సహకారం, సహాయం అవసరం:
దీనికోసం సమావేశంలో కేంద్రాన్ని గట్టిగా కోరాలి:
కొత్తగా సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీని కోరుతున్నాం:
కచ్చితంగా ఇది వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలి:
దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణంపై కేంద్రం హామీ ఇచ్చింది:
వీటన్నింటికోసం దీనికోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి:
కడపలో స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం హామీ ఇచ్చింది:
స్టీల్ ప్లాంటుకు సమీప ప్రాంతంలో ఎన్ఎండీసీ నుంచి గనుల కేటాయింపు చేయాలి:
దీంతో ప్రతిపాదిత ఫ్యాక్టరీ నిర్మాణానికి మార్గం సులభతరం అవుతుంది:
విశాఖపట్నం నుంచి రాయలసీమ ప్రాంతానికి అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం హై స్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది:
విశాఖపట్నం – వయా ఉమ్మడి కర్నూలు జిల్లా మీదుగా కడపకు అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం ఒత్తిడి తీసుకురావాలి:
దీనివల్ల మూడు ప్రాంతాల మధ్య రాకపోకలు అత్యంత సులభతరం అవుతాయి:
విశాఖ రైల్వే జోన్‌అంశంపై కూడా దృష్టిపెట్టాలి :
వైజాగ్, విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మారుస్తానన్నారు:
విశాఖపట్నంలో నేవీ కార్యకలాపాల వల్ల పౌరవిమానాలకు తీవ్ర ఇబ్బంది వస్తోంది:
దీంతో ఎయిర్ పోర్టును వేరేచోటకు బదిలీచేయాల్సిన అవసరం ఏర్పడింది:
ప్రస్తుతం భోగాపురం ఎయిర్ పోర్టును నిర్మిస్తున్నారు:
ఈ ఎయిర్ పోర్టుకు కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం:
మంచి రహదారి ఏర్పాటుకు కేంద్రం ఇతోధికంగా సహాయం అందించాల్సిన అవసరం ఉంది:
విశాఖ సిటీనుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానం చేసే రహదారి అంశంపై కేంద్రంతో జరుగుతున్న సమావేశంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి:
భోగాపురం ఎయిర్ పోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భూ సేకరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది:
విజయవాడ లాంటి ఎయిర్ పోర్టుల్లోనూ భూ సేకరణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది:
విశాఖ మెట్రో రైలు అంశాన్నికూడా కొలిక్కి తీసుకురావాలన్న సీఎం:
ప్రైవేట్ డెవలపర్ 60 శాతం భరిస్తున్నందున, భూ సేకరణ సహా మిగిలిన 40 శాతం కేంద్రం భరించేలా గట్టిగా ఒత్తిడి తీసుకురావాలన్న సీఎం:
రెండు రాష్ట్రల మధ్య ఆస్తుల విభజన ఇంకా పెండింగ్‌లో ఉంది:
దీనికోసం ఒత్తిడి తీసుకురావాలి:
వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై కూడా దృష్టిపెట్టాలి : సీఎం శ్రీ వైయస్.జగన్.