అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని రాష్ట్ర అభివృద్ధికై అలుపెరగని పోరాటం అమరావతి మహా ఉద్యమం నేటికీ 1300 రోజులు అయిన సందర్భంగా మందడం దీక్ష శిబిరంలో అమరావతి ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ రావు అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీలు దళిత బహుజన జేఏసీ నాయకులతోనూ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రాజధాని అమరావతి పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరావు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాజీ జడ్జి రామకృష్ణ మొదలగువారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు బాలకోటయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు మస్తాన్వలి సిపిఐ నాయకులు జంగాల అజయ్ కుమార్ సిపిఎం నాయకులు ఎం రవి మరియు శివారెడ్డి యుగంధర్ పులి చిన్న చిలకా బసవయ్య చిలకా విజయ్ కొమ్మునేని సురేష్ బాబు పిల్లి మాణిక్యాలరావు మరియు అమరావతి సమన్వయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు