కొంచెం తాగినా తిప్పలే.. కొత్త అధ్యయనాల్లో వాస్తవాలు
Even if you drink a little its un-healthy new found facts
కొంచెం మందు పుచ్చుకుంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదని ఇప్పటివరకు చెప్పుకున్నవన్నీ తప్పే అని కొత్త అధ్యయయయనాలు చెబుతున్నాయి.
హెల్త్ కాన్సియస్ ఉన్నవారంతా ఇకపై ఆల్కహాల్ కు దూరంగా ఉంటేనే మంచిది. కొంచెం తాగడం వల్ల కొంచెమే ఆరోగ్య దెబ్బతింటుంది అంటే అనారోగ్య బారిన పడబోమని కాదని టాటా మెమోరియల్ సెంటర్ లోని సెంటర్ ఫర్ కేన్సర్ ఎపిడమోలజీ డిప్యూటీ డాక్టర్. పంకజ్ చదుర్వేది చెబుతున్నారు. ముఖ్య విశయం ఏమంటే ప్రతిరోజు కొద్దిగా ఆల్కహాలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందనే అపోహ వీడాలన్నారు. ఒకే ఒక ఊరట ఏమంటే తక్కువ తాగిన వారు ఆరోగ్య భంగానికి గురయినప్పటికీ అకాల మృత్యువుకు గురయ్యే అవకాశాలు తక్కువని ఆ నివేదిక తెలిపింది.
వివరాల్లోకి వెళితే..
నలభై ఏళ్లుగా చేపట్టిన అధ్యయనాల ప్రకారం 25 గ్రాముల అల్కహాలును ఒక మహిళ తీసుకుంటే దానిలో 1.5 ఔన్సుల డిస్టిల్డ్ స్పిరిట్ ఉంటుంది. 12 ఔన్సుల బీర్లు రెండు, లేదా 5 ఔన్సుల వైన్ తీసుకుంటే పురుషుల్లో ఆరోగ్యం రిస్క్ లోకి వెళుతుంది. 45గ్రాముల ఆల్కహాలు రోజూ తీసుకుంటే ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతుందని 5 లక్షలమందిపై పరిశోధన చేసి తెలుసుకున్నట్లు అధ్యయనం తెలిపింది.
ఇదివరలో చెప్పినట్లు అప్పుడప్పుడూ తాగినా, లేదా కొద్ది మొత్తంలో తాగినా ఆరోగ్య సమస్యలు రావనడానికి కొత్త అధ్యయనాలు ఒప్పుకోలేదు.
తాగేవారే ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ రాను రాను వారి ఆరోగ్యం క్షీణిస్తుందని కెనడా ఇన్ స్టిట్యూట్ ఫర్ సబ్ స్టెన్స్ యూజ్ రీసెర్చ్ రిపోర్టు తెలిపింది.
అప్పుడప్పుడు కొద్దికొద్దిగా ఆల్కహాలు తీసుకొని చక్కగా ఎక్సర్ సైజులు చేస్తూ, ఊబకాయం లేకుండా ఉన్న వారిలో కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నివేదికలు స్పష్టం చేశాయి.
టాటా మెమోరియల్ సెంటర్ కేన్సర్ ఎపిడమోలజీ, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పంకజ్ చదుర్వేది మాట్లాడుతూ నాకు తెలిసి ఏళ్ల తరబడి అనేక వ్యాసాలు, రిపోర్టుల తక్కువ మోతాదులో మందు పుచ్చుకుంటే ఆరోగ్యానికి హాని ఉండదని అనేక సార్లు చదివినప్పటికీ అటువంటి దేమీ లేదని నూతన అధ్యయనాల్లో తేలిందన్నారు.
నిజానికి ఆరోగ్య సమస్యలు తలెత్త కూడదంటే ఆల్కహాలు జోలికి వెళ్లకపోవడమే మంచిదంటున్నారు. తక్కువ తాగడం, అప్పుడప్పుడు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని అనుకోవడం భ్రమే అంటున్నారు.
ఆల్కహాలు సేవించడం వల్ల నోటి, గొంతు, లివర్, ఈసోఫేగస్, (అన్నవాహిక) బ్రెస్ట్ కేన్సర్ల (రొమ్ముకేన్సర్) బారిని పడతారని, అలాగే మరొకరిపై ఆధారపడే మనస్తత్వం అలవడుతుందని, మూర్చ, ఫిట్స్ తోపాటు ఇతర మానసిక సమస్యలు తలెత్తుతాయన్నారు.
దక్షిణ మధ్య ఆసియాలో మూడొంతుల కేన్సర్ కు ఆల్కహాలే కారణమని ప్రస్తుత అధ్యయనాలు చెబుతున్నాయి. భారత దేశంలో రాను రాను ఆల్కహాలు తాగే అలవాటు ఎక్కువవుతుందని అధ్యయన కారులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆల్కహాలు తాగేవారిలో వ్యంధత్యం ఎక్కువగా ఉందని దీనిపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉండగా, మీడియాలో వాటిని ప్రోత్సహించే విధంగా ప్రకటనలు రావడం దురదృష్ట కరమని డాక్టర్ పంకజ్ చదుర్వేది అన్నారు.
ఆల్కహాలు సీసాలపై గ్రాఫిక్స్ తో కూడిన వార్నింగ్ (హెచ్చరికలు) ప్రింటు చేయడం ద్వారా చదువుతో సంబంధం లేకుండా అందరూ జాగ్రత్త పడతారని తద్వారా మంచి ఫలితం ఉంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు.
తక్కువ మోతాదులో మందు పుచ్చుకునేవారి ఆరోగ్యంపై డిబేట్లు జరిగితే ఆరోగ్యం పై జాగ్రత్త వహిస్తారని, అయితే తాగుబోతులకు ప్రాణాపాయం ఎక్కువగా ఉంటుందన్నారు.
ఆల్కహాలతో వచ్చే ఆనారోగ్యాలు, ఆరోగ్యాలు తీసుకునే వ్యక్తుల శారీరక, మానసిక స్తితిని బట్టి ఉంటాయని, వాటిలో ముఖ్యమైనది వయస్సు, లింగం, అప్పటికే వారికున్న ఆరోగ్య సమస్యలు, జీన్ల తో ముడిపడి ఉంటాయని ఓక్లా లోని ఫార్టిస్ ఎస్కర్ట్ హార్టు ఇన్ స్టిట్యూట్ లోని ఇంటర్ వెన్షల్ కార్డియాలజీ ప్రిన్సిపల్ డైరెక్టర్ డాక్టర్. నిషిత్ చంద్ర చెప్పారు.
రక్తం చిక్కబడితే కొంచెం మోతాదులో బ్రాంది తీసుకోమని డాక్టర్లు సలహా ఇస్తారన్నదానిపై బెంగళూరు మణిపాల్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సునీల్ మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితుల్లోనూ గుండె డాక్టర్లు ఎవరూ ఆల్కహాలును ప్రోత్సహించరన్నారు.
మహిళలు రోజుకు ఒక ఔన్సు, పురుషులు రెండు ఔన్సులు తీసుకోవచ్చన్న అమెరికా గైడ్ లైన్లు తప్పని తేలిందని, కాబట్టి ఆల్కహాలుకు దూరంగా ఉండటమే బెస్ట్ అని చెబుతున్నారు.
ఈ ఏడాది జనవరిలో వరల్డ్ హెల్త్ఆర్గనైజేషన్ (డబ్ల్యు హెచ్ వో ) ఒక నివేదికను ప్రచురిస్తూ, ఇంత మోతాదులో తాగితే ఆరోగ్య ప్రమాదం లేదన్న గణాంకాలేవీ లేవని, అందువల్ల ఆల్కహాలును ఏ మాత్రం తీసుకోకపోవడమే ఉత్తమం అని తెలిపింది.
ఆల్కహాలు విషతుల్యం
ఆల్కహాలు విషతుల్యం, అది మానసిక ఉద్యేగాలను పెంచుతుంది. అంతేకాకుండా స్వతంత్రత కోల్పోయి, మరొకరిపై ఆధారపడే విధంగా చేస్తుందని దశాబ్దం క్రిందటే అంతర్జాతీయ కేన్సర్ రీసెర్చ్ ఏజెన్సీ తెలిపింది.
ఆస్బెస్టాస్, రేడియేషన్, పొగాకు కేన్సర్ కారకాలైతే, ఆల్కహాలు ఏడు రకాలైన కేన్సర్లను కలిగిస్తుంది. దానిలో పేగు , బ్రెస్ట్ కేన్సర్ ముఖ్యమైనవి. ఆల్కహాలులో ఉండే ఇథనాల్ శరీరం లోని బయోలాజికల్ మెకానిజంను దెబ్బతీసి కేన్సర్ కారకాలను పెంపొందిస్తుందని, ఎంత నాణ్యమైన, ఖరీదైన ఆల్కహాలయినప్పటికీ దీనిలో తేడా ఉండబోదని పరిశోధకులు చెబుతున్నారు.
యూరప్ లో సగం మంది కేన్సర్ బారిన పడినవారు తక్కువ మోతాదులో ఆల్కాహాలు తీసుకున్నవారేనని ( వారానికి 1.5 లీటర్ల వైన్ లేద 3.5 లీటర్ల బీయర్ , 450 మిల్లీ లీటర్ల స్పిరిట్ ) తీసుకున్నవారేనన్నారు. మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ రావడానికి కారణం ఆల్కహాలేనని, యురోపియన్ యూనియన్ లో అనేక మంది మహిళలు ఈ మహమ్మారితో మృత్యువాత పడుతున్నారని డబ్ల్యు హెచ్ వో తెలిపింది.