భక్తులకు సౌకర్యవంతమైన దర్శనమే లక్ష్యం…
* సామాన్య భక్తులకు మెరుగైన దర్శన ఏర్పాట్లు
* భక్తుల రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు – భద్రతకు పెద్దపీట
* భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు
* రాష్ట్ర దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్

అమ్మవారి దర్శనానికి విచ్చేసే ప్రతి భక్తుడికి సౌకర్యవంతమైన, సురక్షితమైన దర్శన అనుభవాన్ని అందించేందుకు దేవస్థానం, సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ సోమవారం ఇంద్రకీలాద్రి పై మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులువుగా అమ్మవారి దర్శనం కలిగించడంతోపాటు గౌరవ రాష్ట్రపతి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మూలా నక్షత్రం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుందని అన్నారు.
శరన్నవరాత్రి ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అమ్మవారి దర్శనం సౌకర్యవంతంగా జరిగేలా సంబంధిత అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. వీఐపీ భక్తులతో పాటు సామాన్య భక్తులందరికీ ప్రాధాన్యతనిస్తూ, భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు, భద్రతా చర్యలు పర్యవేక్షిస్తున్నారన్నారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, భక్తుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేశారన్నారు. భక్తులు ఎక్కువసేపు ఇబ్బందులు పడకుండా దర్శన ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాన్నారు.
భద్రతకు ప్రాధాన్యత – నిరంతర పర్యవేక్షణ
ఉత్సవాల సమయంలో భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తగిన బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. .
భక్తులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం
నవరాత్రి ఉత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించడం, భద్రతతో కూడిన ప్రశాంత వాతావరణాన్ని అందించడం ప్రధాన లక్ష్యంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు.



















































