- లండన్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ బృందం
- సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ గిన్ రిచర్డ్స్(gywn richards)తో సమావేశమైన మంత్రి
- మధ్యాహ్నం బాటర్సీ పవర్ స్టేషన్ ను సందర్శించిన మంత్రి నారాయణ
- ప్రపంచంలోనే ఎత్తైన కాంటిలివర్డ్ వీల్ లండన్ ఐ ను అమరావతిలో ఏర్పాటుచేయాలని నిర్ణయం
- అమరావతిలో టూరిజం ప్రాజెక్ట్ లు,ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణం కోసం అధ్యయనానికి వెళ్లిన మంత్రి బృందం
- లండన్.
తేది..02-02-2026
అమరావతిని ప్రపంచంలోనే టాప్ 5 నగరాల్లో ఒకటిగా నిర్మించాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది ప్రభుత్వం…
అమరావతి నగర ప్రణాళిక నుంచి అన్ని ప్రాజెక్ట్ ల నిర్మాణాల విషయంలో ఎంతో పగడ్బందీగా ముందుకెళ్తుంది…ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న ఉత్తమ మోడల్స్ ను అమరావతి నిర్మాణంలో పరిగణనలోకి తీసుకుంటుంది…అమరావతి నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్న పురపాలక శాఖ మంత్రి నారాయణ వివిధ దేశాల్లో అధ్యయనం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తర్వాత అక్కడి మోడల్స్ ను అమరావతిలో అమలుచేసేలా చర్యలు తీసుకుంటున్నారు.తాజాగా ఇంగ్లాండ్ రాజధాని లండన్ లో అధికారులతో కలిసి పర్యటిస్తున్నారు మంత్రి నారాయణ..మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్,అమరావతి గ్రోత్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శొంఠి శ్రీనివాస్ తో కలిసి లండన్ పర్యటనకు వెళ్లారు మంత్రి నారాయణ..ముఖ్యంగా అమరావతిలో నిర్మించ తలపెట్టిన అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ,టూరిజం ప్రాజెక్ట్ లను ఈ పర్యటనలో అధ్యయనం చేస్తున్నారు.
లండన్ పర్యటనలో భాగంగా ముందుగా సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ అండ్ డెవలప్ మెంట్ డైరెక్టర్ డైరెక్టర్ గిన్ రిచర్డ్స్(gywn richards)తో మంత్రి బృందం సమావేశమైంది..లండన్ నగరం మాస్టర్ ప్లాన్,అభివృద్ధి ప్రణాళికలు,రవాణా సౌకర్యాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా గిన్ రిచర్డ్స్ వివరించారు..లండన్ సిటీ మినియేచర్ ద్వారా నగర నిర్మాణం గురించి వివరించారు..ప్రపంచంలోనే విస్తీర్ణంలో అతి పెద్ద నగరంగా ఉన్న లండన్…ప్రపంచ ఆర్ధిక,వాణిజ్య,సాంస్కృతిక కేంద్రాల్లో ఒకటిగా ఉంది.సుమారు 2000 ఏళ్ళ చరిత్ర ఉన్న పురాతన నగరంలో కాలానుగుణంగా అభివృద్ది ఏరకంగా చేస్తున్నారనేది మంత్రి బృందానికి అక్కడి అధికారులు వివరించారు…,
మధ్యాహ్నం లండన్ లోని బాటర్సీ పవర్ స్టేషన్ ను మంత్రి బృందం సందర్శించింది..దశాబ్దాల పాటు విద్యుత్ ఉత్పత్తిని చేసి మూతపడిన ఒక పవర్ స్టేషన్ ను ప్రపంచ ప్రసిద్ద పర్యాటక కేంద్రంగా మార్చి టూరిస్టులను ఆకట్టునేలా మార్పులు చేసారు..థేమ్స్ నది ఒడ్డున అత్యంత సుందరంగా ఆహ్లాదకర వాతావరణంలో ఐకానిక్ భవనాలతో పర్యాటకులకు గమ్యస్థానంగా బాటర్సీ పవర్ స్టేషన్ ను తీర్చిదిద్దారు…ఇక్కడ ఏర్పాటుచేసిన బోటింగ్ తో పాటు రివర్ ఫ్రంట్ అభివృద్ది తో పర్యాటకంగానే కాకుండా వాణిజ్య కేంద్రంగా మారింది…అమరావతిలో కూడా టూరిజం ప్రాజెక్ట్ లను పెద్ద ఎత్తున అభివృద్ది చేయాలని భావిస్తున్న ప్రభుత్వం….థేమ్స్ రివర్ ఫ్రంట్ ను పరిగణనలోకి తీసుకునే అవకాశాలపై మంత్రి నారాయణ చర్చించారు…అక్కడి నుంచి థేమ్స్ నది ఒడ్డున ఉన్న 443 అడుగుల ఎత్తైన లండన్ ఐ వీల్ ను మంత్రి నారాయణ బృందం సందర్శించింది..ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కాంటిలివర్డ్ అబ్జర్వేషన్ వీల్ ఇది…ఇదే తరహా వీల్ ను అమరావతిలో కృష్ణా నది ఒడ్డున ఏర్పాటుచేయాలని ఇప్పటికే ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకరించింది..లండన్ ఐ పనితీరును అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి నారాయణ…థేమ్స్ నది ఒడ్డున ఉన్న మరికొన్ని టూరిజం ప్రాజెక్ట్ లను మంత్రి నారాయణ బృందం సందర్శించింది.























































