ముందస్తు హెచ్చరికలు
- * పుంగనూరు ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా జరగాల్సిన అవసరం
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో, పుంగనూరులో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు ,రాజకీయ ఘర్షణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ,పురపాలక సంఘాల ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ, ఇలాంటి హింసాత్మక ఘటనలు గ్రామ స్థాయి ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా మారుతున్నాయి. ఎన్నికలు అంటే ప్రజల తీర్పును వెల్లడించే పవిత్ర వేదిక కావాలి కానీ, కండబలానికి, భయభ్రాంతులకు గురిచేసే వాతావరణానికి వేదిక కాకూడదు. పుంగనూరు ఉద్రిక్తత రాష్ట్రంలోని ఎన్నికల అధికారులకు, పోలీసు యంత్రాంగానికి ఒక గట్టి హెచ్చరిక లాంటిది.
స్థానిక ఎన్నికలు అంటేనే సమీప బంధువులు, స్థానిక నాయకుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. అయితే, ఈ పోటీ వ్యక్తిగత కక్షలకు, దాడులకు దారితీయకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వం , ఎన్నికల సంఘంపై ఉంది. రాష్ట్రంలో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు జరగాలంటే యంత్రాంగం కిందిస్థాయి వరకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.
1. హింసను సహించని విధానం – ముందస్తు నిరోధక చర్యలు
పుంగనూరు ఘటన లాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి మినహాయింపులు ఉండకూడదు. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ,పోలీసు శాఖ అత్యంత సమస్యాత్మక (Hyper-sensitive) ప్రాంతాలను తక్షణమే గుర్తించి ప్రత్యేక నిఘా పెట్టాలి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులను, రౌడీషీటర్లను ముందస్తుగా అదుపులోకి తీసుకోవాలి. ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా గుంపులను తరలించడాన్ని, ఎన్నికలను ప్రభావితం చేసేందుకు నగదు లేదా మరే ఇతర రూపంలో ప్రలోభాలకు గురిచేయడాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలి.
2. అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించడం
ఎన్నికల సుఫలాలకు ప్రభుత్వ, పోలీసు యంత్రాంగం ఏకపక్షంగా కాకుండా పూర్తిగా నిష్పక్షపాతంగా పనిచేయడం అత్యంత ముఖ్యం. స్థానిక అధికారులు, రిటర్నింగ్ అధికారులు, పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (SHO) ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలవంచకుండా విధులు నిర్వర్తించాలి. అధికార లేదా ప్రతిపక్ష పార్టీలనే తేడా లేకుండా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అధికారులపై ప్రజలకు నమ్మకం కలిగినప్పుడే ఎన్నికలు సజావుగా జరుగుతాయి.
3. సమాన అవకాశాలు – కఠినమైన ప్రచార నిబంధనలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా కవ్వింపు చర్యలు, అనధికారిక రోడ్షోలు, భయపెట్టే ధోరణులను వెంటనే నిరోధించాలి. అన్ని రాజకీయ పార్టీలకు ,స్వతంత్ర అభ్యర్థులకు ప్రచారంలో సమాన అవకాశాలు లభించేలా ఎన్నికల పరిశీలకులు (Micro-observers) నిరంతరం పర్యవేక్షించాలి. ప్రచార ఖర్చులపైనా, అక్రమ డబ్బు పంపిణీపైనా ఫ్లయింగ్ స్క్వాడ్స్ నిరంతరం నిఘా ఉంచాలి.
4. రాజకీయ పార్టీల పరిణతి ,బాధ్యత
కేవలం నిబంధనల ద్వారానే కాకుండా, రాజకీయ పార్టీల నాయకత్వాల చొరవతో కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలను అదుపులో ఉంచుకోవాలి. హింసను ప్రేరేపించే ప్రసంగాలు, దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తాయని గుర్తించి, రాజకీయ నాయకులు సంయమనం పాటించాలి.
పుంగనూరులో జరిగిన అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు హింసాహితంగా, పారదర్శకంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రజలు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించినప్పుడే ప్రజాస్వామ్యం పరిపూర్ణమవుతుంది. ఎన్నికల యంత్రాంగం కఠినమైన చర్యలతో శాంతిభద్రతలను కాపాడుతూ, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Advance Warnings
- * In the wake of the Punganur incident, it is imperative that the local body elections in Andhra Pradesh are conducted smoothly and impartially.
As the atmosphere for local body elections heats up in Andhra Pradesh, the tensions and political clashes that occurred in Punganur are a cause for serious concern. With elections for Gram Panchayats, MPTCs, ZPTCs, and municipal bodies approaching, such violent incidents pose a grave threat to democracy at the grassroots level. Elections should serve as a sacred platform for the expression of the people’s mandate; they must not become a stage for the display of brute force or the creation of an environment defined by fear and intimidation. The tension in Punganur serves as a stern warning to the state’s election authorities and the police machinery.
Local elections inherently involve intense competition among close acquaintances and local leaders. However, the responsibility lies squarely with the government and the Election Commission to ensure that this competition does not escalate into personal vendettas or physical attacks. To guarantee free and fair elections across the state, the administrative machinery must implement robust measures, reaching down to the lowest levels.
1. Zero-Tolerance Policy Toward Violence – Proactive Preventive Measures
To prevent a recurrence of incidents like the one in Punganur, there must be no compromises when it comes to maintaining law and order. The State Election Commission (SEC) and the police department must immediately identify ‘hyper-sensitive’ areas and place them under special surveillance. Anti-social elements and individuals with a history of criminal activity (rowdy-sheeters) who could disrupt law and order must be taken into preventive custody. Any attempt to illegally transport groups of people from other regions, or to influence the election process through the distribution of cash or other inducements, must be dealt with with an iron hand.
2. Impartial Conduct of the Administrative Machinery
It is crucial that the government and police machinery act with complete impartiality rather than showing bias. Local officials, returning officers, and Station House Officers (SHOs) must perform their duties without yielding to any political pressure. Strict action must be taken against anyone who violates the rules, regardless of whether they belong to the ruling party or the opposition. Elections can only be conducted smoothly when the public has confidence in the officials.
3. Equal Opportunities – Strict Campaign Regulations
Provocative actions, unauthorized roadshows, and intimidation tactics during election campaigning must be curbed immediately. Election observers (micro-observers) must continuously monitor the process to ensure that all political parties and independent candidates are provided with equal opportunities for campaigning. Flying squads must maintain constant surveillance over campaign expenditures and the distribution of illicit funds.
4. Maturity and Responsibility of Political Parties
Elections can be conducted peacefully not only through regulations but also through the proactive efforts of political party leadership. All major political parties must ensure their workers remain disciplined. Political leaders should exercise restraint, recognizing that speeches inciting violence and acts of aggression undermine the spirit of democracy.
In light of the untoward incidents that occurred in Punganur, it is the collective responsibility of all stakeholders to ensure that the upcoming local body elections in Andhra Pradesh are conducted in a peaceful and transparent manner. Democracy is truly fulfilled only when an environment is created in which citizens can exercise their right to vote freely and without fear. The public expects the election machinery to uphold democratic values by taking stringent measures to maintain law and order.























































