వాప్‌కాన్ – 2026 (WAPCON)
విశ్వ ఆయుర్వేద పరిషత్ (VAP) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మహిళల ఆయుర్వేద జాతీయ సదస్సు – వాప్‌కాన్ 2026 (WAPCON-2026) ఘనంగా జరిగింది.
ఈ రెండు రోజుల సదస్సులో దేశవ్యాప్తంగా సుమారు 1000 మంది ఆయుర్వేద వైద్యులు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సదస్సుకు గౌరవనీయులైన అతిథులుగా
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జి. పి. రాజశేఖర్ ,
NCISM చైర్‌పర్సన్ డాక్టర్ మణీషా కోథేకర్ ,
ఆయుష్ డైరెక్టర్ శ్రీ దినేష్ కుమార్ IAS ,
శ్రీ పీవీఎన్ మాధవ్ జీ – బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు (ఏపీ), విశ్వ ఆయుర్వేద పరిషత్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మహేష్ వ్యాస్ ,జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ ప్రేమానంద రావు గారు,రాష్ట్ర అధ్యక్షులు Dr మాధవరావు చౌదరి

,విశ్వ ఆయుర్వేద పరిషత్ కు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని సదస్సును ఘనతపరిచారు.
మహిళల ఆయుర్వేద వైద్యుల సాధికారత, ఆయుర్వేద అభివృద్ధి, విధాన పరమైన చర్చలు, ఆరోగ్య రంగంలో మహిళల పాత్రను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించబడింది.
సదస్సులో మహిళా ఆయుర్వేద వైద్యులు మరియు జీవ వైవిధ్య రంగంలో సేవలందించిన మహిళా సాధకులను సత్కరించారు.
ఆయుర్వేద విద్య, పరిశోధన, ఆరోగ్య సేవల విస్తరణ, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆయుష్ విధానాలు, ఆయుష్మాన్ భారత్ పథకం, ఉపాధి మరియు స్టార్టప్ అవకాశాలపై కీలక చర్చలు జరిగాయి.
సదస్సు భాగంగా నిర్వహించిన ఆయుర్వేద ఎక్స్‌పోలో 50కి పైగా వైద్య సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించాయి.
ఈ సదస్సును కన్వీనర్ డాక్టర్
సాహితి గారి నాయకత్వంలో విజయవంతంగా నిర్వహించగా, వాప్‌కాన్-2026 మహిళల ఆయుర్వేద వైద్యులకు ఒక బలమైన వేదికగా నిలిచి, ఆయుర్వేద భవిష్యత్ దిశను నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించిందని నిర్వాహకులు తెలిపారు.

















































