చంద్రబాబు మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పడానికి నీవు ఎవరు సాంబశివ రావు ?
హైదరాబాద్ లో స్టూడియో పెట్టుకుని ఏపిలో మీ కులపోడి కోసం మీరు పడుతున్న పాట్లు చూస్తుంటే ప్రజలకు అసహ్యం పుడుతోంది!
తెలంగాణ రాష్ట్రంలో కూర్చుని ఏపీ గురించి అసత్యాలు ప్రచారం చేసే మీకు ఏపిలో జరుగుతున్న వాస్తవాలు తెలియవు ఇవిగో నిజాలు!
1) బాబుగారు దిగిపోయే నాటికి GSDP వృద్ది రేటు ప్రకారం 28 రాష్ట్రాల ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఉండగా ఆర్బిఐ నివేదిక ప్రకారం నేడు జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది
2)2019లో ఒకటిన్నర లక్షల తలసరి ఆదాయంతో ఆంధ్ర ప్రదేశ్ దేశంలో 17వ స్థానంలో ఉండేది ఈ రోజున రెండు లక్షల25వేలతో 9వస్థానానికి చేరింది
3) బాబు హయాంలో గ్లోబల్ సమ్మిట్ సమావేశాల్లో బుక్కా పకీర్లను స్టేజి మీద కూర్చోబెడితే జగన్ హయాంలో టాటా బిర్లా భజాంక జిఎంఆర్ లాంటి ఉద్దండులను వేదిక మీద కూర్చోబెట్టి ఒప్పందాలను చేసుకున్నారు.
4) జగన్ గారి ప్రభుత్వం 1.52 లక్షల కొత్త MSME లను ఏర్పాటు చేయడం ద్వారా 13.62 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పించారు.
5) 2019లో మైనస్ – 6.5 % తో 27వ స్థానంలో ఉన్న
వ్యవసాయ రంగం 2022 నాటికి 8.2 వృధ్ధి శాతంతో 6వ స్థానానికి ఎగబాకింది.
6) ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ నేడు మెరుగైన వృద్ధిని నమోదు చేసుకుంది. టిడిపి ప్రభుత్వంలో 3.97 లక్షల పర్మినెంట్ ఉద్యోగాలు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 6.10 లక్షలకు చేరుకుంది. అంటే 2.13 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది.
7) బాబు హయాంలో విద్యారంగం దేశంలో 24వ స్థానంలో ఉంటే నాడు నేడు కార్యక్రమం ఫలితంగా ఇప్పుడు 17స్థానాలు మెరుగు పరచుకొని 7వ స్థానానికి చేరుకుంది.
8) వైయస్సార్సీపి ప్రభుత్వంలో ఆరోగ్య సంరక్షణ రంగంపై చేసిన వ్యయం రెండింతలు పెరిగింది. అంటే 7,200 కోట్ల రూపాయల నుంచి 13,700కోట్లకు చేరింది. 17 మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగతోంది. వాటిలో 5 కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం అయ్యాయి.
9) పెట్టుబడులను ఆకర్షిస్తూ వ్యాపార అనుకూల వాతావరణాన్ని పెంపొందిస్తూ భారతదేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ వరుసగా మూడు సంవత్సరాలు మొదటి స్థానంలో నిలిచింది.
10) మహిళలే మహారాణులు అనే విధంగా జగన్ ప్రభుత్వం లో 75% స్త్రీలకే ప్రత్యక్షంగా పరోక్షంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి
11) అప్పులపై మీరు చేస్తున్న దుష్ప్రచారం చాలా తప్పు. ఎఫ్ ఆర్బీఎం పరిమితి జగన్ ప్రభుత్వం ఏనాడూ దాటలేదు. బాబు హయాంలో రుణ వృద్ధి రేటు 169శాతం ఉండగా ప్రస్తుతం జగనన్న ప్రభుత్వంలో 58% కి తగ్గింది.
12) కియా పోయింది అమరరాజా పోయింది అని మీరు చేసిన తప్పుడు ప్రచారంలా కాకుండా కియా మోటార్స్ 400 కోట్ల అదనపు పెట్టుబడితో విస్తరణ జరిగింది. అమరరాజా బ్యాటరీస్ చిత్తూరులోనే ఉంది. రిలయన్స్, అదానీ, TCS,ITC, హీరో మోటార్ కార్స్, గ్రాసిం, JSW, యోకహోమ మరియు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ తో సహా అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆసరాగా నిలిచాయి. బాబు హయాంలో 174 ఉన్న ఐటీ కంపెనీలు ఇప్పుడు 372 కు చేరాయి.
మీ
మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి.
7-9-2023
గుంటూరు.