గొప్ప విజన్ ఉన్న నాయకుడు నారా లోకేష్ బాబు
యువగళం పాదయత్రతో రాష్ట్ర దిశా దశ మార్చిన నారా లోకేష్.
రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి.
నూజివీడు/తుక్కులూరు:
జనవరి,23: రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆధ్వర్యంలో నూజివీడులో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు 41 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మొదటిగా తెలుగుదేశం నాయకులతో కలిసి మంత్రి అడవి ఆంజనేయ స్వామి గుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సుమారు 10 వేలమంది నాయకులు కార్యకర్తలు మహిళలు యువతతో భారీ ర్యాలీ ప్రారంభించారు. సుమారు 10 కిలో మీటర్ల మేర నగర ప్రధాన రహదారి నుండి ఈ ర్యాలీ కొనసాగింది మద్య మధ్య మధ్యలో కార్యకర్తలకు అభివాదం చేస్తూ కేక్ కత్తిరించి కార్యకర్తలకు పంపిణీ చేశారు . గాంధీ నగర్ నందన వనంలో ముగిసిన ర్యాలీ తరువాత భారీ కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలకు తినిపించి లోకేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,రాష్ట్ర విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన నాయకుల కార్యకర్తలకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ మన యువనాయకుడు నారా లోకేష్ బాబు పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ఒక పండగ అని మంత్రి పేర్కొన్నారు.
లోకేష్ నాయకత్వంలో బహుళ జాతి సంస్థలు గూగుల్, రీలయన్స్ వంటి సంస్థలు రాష్ట్రంలో లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారన్నారు లోకేష్ బాబు నాయకత్వంలో స్టీల్ దిగ్గజ సంస్థలు విశాఖపట్నం లో వేల కోట్లు పెట్టుబడులు పెట్టాయన్నారు. శోభనాచల భగవనుని ఆశీస్సులు లోకేష్ బాబు పై ఉండాలని తద్వారా మంచి పరిపాలన అందించాలని, ఆకాంక్షించారు.లోకేష్ బాబు నాయకత్వంలో ప్రజలందరూ
సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు.లోకేష్ నాయకత్వంలో
నూజివీడు నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలందరికీ ఉపాధి ఉద్యోగాలు కలగాలని, అందరి జీవితాల్లో ఆనందం సిద్ధించాలని ఆకాంక్షించారు. శోభనాచల భగవానుడు ఆశీస్సులతో రాష్ట్రంలో నారా చంద్రబాబు లోకేష్ బాబు నాయకత్వంలో జిల్లాలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధిలో ముందడుగు వేయాలని అభిలాషించారు. అలాగే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు అమలుకు ప్రజలు సహకరించాలన్నారు.రైతులంతా సుఖ సంతోషాలతో ఉండాలంటే సకాలంకో వర్షాలు కురవాలి, ప్రకృతి సహకరించాలని దానికి ఆ శోభనాచల భగవానుడి కరుణా కటాక్షం ఉండాలన్నారు. శోభనాచల భగవానుడి చల్లని దీవెనలు రాష్ట్ర ప్రభుత్వంపై ఉండి తద్వారా ప్రజలకు మంచి పరిపాలన అందాలన్నారు. ఈ కొత్త సంవత్సరంలో దేవుళ్ళ అందరి ఆశీస్సులతో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు లోకేష్ నాయకత్వంలో ప్రజలకు అంతా మేలు జరుగుతుందన్నారు.
నూజివీడు నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నమన్నారు.
రానున్న 3 సంవత్సరాల్లో అమరావతిలో దేశంలో ఎక్కడా లేని రాజధాని నిర్మించబోతున్న కూటమి ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ ఆర్ధిక సహాయంతో దేశంలోనే నెంబరు 1 రాజధానిని నిర్మించబోతున్న కూటమి ప్రభుత్వం చిత్త శుద్దితో అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు లోకేష్ వారి సంకల్పానికి మనమందరం సహకరించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం కోసం రోజుకి 14 గంటలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. భావి తరాల అభివృద్దే అజెండాగా పనిచేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రపంచ దేశాలన్నీ పర్యటించి సాంకేతికను నూతన విధానాలన్ని జోడించి రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు అన్నారు. త్వరలో చింతలపూడి ప్రొజెక్టును పూర్తి చేసి నియోజకవర్గ ప్రజల త్రాగు ,సాగు నీటి కష్టాలు త్వరలో తీరుస్తున్న ప్రభుత్వం మాది అన్నారు. అలాగే గొప్ప విజన్ ఉన్న యువ నాయకుడు మన నారా లోకేష్ బాబు అన్నారు. ఎంతో అనుభవం చిత్త శుద్ది ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి అన్నారు. రైతుల నుండి ధాన్యం కొన్న 48 గంటల్లో నగదు జమ చేస్తున్న ప్రభుత్వం మాది మంత్రి రూ.20 కోట్లతో
పలు అభివృద్ధి కార్యక్రమాలు నూజివీడు నియోజకవర్గంలో రూ.,20 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో పూర్తి చేస్తామన్నారు
ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తున్న ప్రభుత్వము కూటమి ప్రభుత్వం
ప్రజలు తమకు అందించిన అఖండ విజయాన్ని బాధ్యతగా స్వీకరించి పేద ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు ప్రజలు తమపై నమ్మకం ఉంచి అందించిన విజయాన్ని బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ప్రజల ఆశలు , ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే 5 ప్రధాన అంశాలపై చంద్రబాబునాయుడు సంతకాలు చేశారని, వాటిని పూర్తిస్థాయిలో నెరవేరుస్తున్నారన్నారు.రాష్ట్రంలో రూ.16 వందల కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పేదలకు పెన్షన్ ను 3 వేల నుండి 4 వేల రూపాయలకు పెంచడమే కాక 3 నెలల బకాయిలను కూడా జులై, 1వ తేదీనే అందించారన్నారు. వికలాంగులకు రూ,6 వేలు,ఫెంక్షన్ అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది అని మంత్రి అన్నారు, యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం త్వరలో కల్పిస్తామన్నారు.ఉచిత గ్యాస్ పంపిణీ దీపావళినుండి అందించామని రాష్ట్రంలోని 61 లక్షల మంది వృద్దులు, దివ్యాంగులకు ఒకటవ తేదీనే పెన్షన్ అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఆర్ధిక విధ్వంసం చేసినప్పటికీ ఇచ్చిన ప్రతీ హామీని తప్పనిసరిగా నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల నాయకులు తెలుగుదేశం జనసేన కూటమి నాయకులు, పెద్దలు,వెంకటేశ్వరరావు, శ్రీనివాసు, రమేష్,రఘు, అది, మధు, దుర్గాప్రసాద్, ఇళయరాజా, జగదీష్, సాంబశివరావు,బాలకృష్ణ, వర్మ, నాగేశ్వరరావు, ఎమ్, సుబ్రహ్మణ్యం, రఘునాధ్, హరినాధ్,గ్రామ పెద్దలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ప్రజలు, మహిళలు,పెద్ద ఎత్తున పాల్గొన్నారు.