వాట్ నెక్స్ట్ ? మల్లగుల్లాలు పడుతున్న ప్రతిపక్షాలు
ఎన్నికల సమయం ముంచు కొస్తుంది… బీజేపీని ఎదుర్కోవడం ఎలా ?
అధికార పక్షంపై ఉండే అసంతృప్తితో ప్రజలే బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారనుకుంటే అలా కూడా జరగడం లేదు.. 2014లో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు.. రైతుల కోసం స్వామినాథన్ కమిషన్,, నల్లధనాన్ని వెలికితీసి అందరి అకౌంట్లలో వేస్తానన్న వాగ్ధానాలతో గెలిచి, ఆపై ఆల్ ఆఫ్ సడన్ గా ముందు చూపులేకుండా పెద్దనోట్లను రద్దు చేయడంతో ప్రజలంతా ఒక్కసారిగా బ్యాంకులపై పడి, రోజుల తరబడి క్యూల్లో ఉండి, బ్యాంకు సిబ్బంది, క్యూల్లో ఉన్న అనేకమంది అకాల మృత్యువుకు బలయినా, 2019లొ అంతకు ముందుకంటే ఎక్కువ సంఖ్యలో పార్లమెంటు స్థానాలను గెలుచుకొనడం కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదు.
వచ్చే ఏడాది మొదటి లోనే ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపిని ఎదుర్కొనేందుకు బీజేపీయేతర సీనియర్ నాయకులు మల్ల గుల్లాలు పడుతున్నారు. రఫేల్, అనిల్ అంబానీ వ్యవహారాలు 2019లో బీజేపీని విజయాన్ని అడ్డుకోలేక పోయాయి. హిండెన్ బర్గ్ నివేదికతో ఆదాని – మోడీలపై గురిపెట్టిన ప్రతిపక్షాలు ఇప్పుడైనా బీజేపీని నిలువరిస్తుందా ? అనేదే అసలైన ప్రశ్న ?
దేశరాజకీయాల్లోకి వెళితే..
పీఎం బరిలో …
గుజరాత్ ముఖ్యమంత్రిగ ఉన్న నరేంద్రమోడీ దేశ ప్రధానికాగలిగినప్పుడు అంతకన్నా సీనియర్ నేతలుగా తాము ఎందుకు దేశ నేతలు కాలేకపోతున్నామని ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్,(సమాజ్ వాదీ పార్టీ )2003 నుంచి 2007 వరకు రక్షణశాఖ మంత్రిగా కూడా పనిచేశారు). బీహార్ కు చెందిన మాజీ సీఎం లాలూయాదవ్ (రాష్ట్రీయ జనతా దళ్) 2004 నుంచి2009 వరకు రైల్వే మంత్రిగా పనిచేశారు.)
పీ ఎంలు కావాలని ఒకప్పుడు తహతహ లాడినప్పటికీ విజయం సాధించలేకపోయారు.
ములాయం గతేడాది కాలం చేయగా, లలూ ప్రసాద్ వృద్దాప్య సంబంధిత అనారోగ్యంతో ఉన్నారు.
పశ్చిమ బెంగాల్
మరో సీనియర్ నేత పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఎప్పటినుంచో పీఎం కావాలని ఆరాటపడుతున్నప్పటికీ కాలం కలసి రావడం లేదు. రాజీవ్ గాంధీ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన ఆమె తర్వాతి కాలంలో విభేదాలతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి, తృణమూల్ కాంగ్రెస్ ను స్థాపించారు. బుద్దదేవ్ బట్టాచార్యను 2011లో ఓడించడం ద్వారా రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ పాలనను అంతం చేసి, పశ్చిమ బెంగాల్ మొదటి మహిళా సీఎంగా, అప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర సీఎంగా ఉన్నారు. 2021లో జరిగిన ఎన్నికల్లో 292అసెంబ్లీ స్థానాలకు 215 గెలుచుకొని విజయదుందుభి మ్రోగించారు. ఆమెకు దేశ రాజకీయలపై ఆసక్తితో పీఎంగా దేశ రాజకీయాలను శాసించాలన్న కోరిక ఉన్నప్పటికీ రాష్ట్రంలో బీజేపీ వ్యూహాలను తిప్పికొట్టడానికే ఆమె సమయం సరిపోతోంది.
శరద్ పవార్
అనేక కేంద్రపదవులు నిర్వహించిన శరద్ పవార్ మహారాష్ట్ర ఎన్నికలను శాసిస్తున్నప్పటికీ ప్రధాని కాలేకపోయారు. కాంగ్రెస్తో బేధాభి ప్రాయాలతో నేషనల్ కాంగ్రెస్ పార్టీని స్తాపించారు. ఆయన కుమార్తె సుప్రియా సూలే రాజ్యసభ సభ్యురాలిగా ప్రజాసమస్యలపై స్పందించి, పార్లమెంటులో అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయినప్పటికీ శరద్ ప్రధాని కాలేకపోతున్నారు.
శివసేన
మహారాష్ట్రలో శివసేనకు తిరుగులేదు. అయితే ఆ పార్టీ కి బీజేపీకి పొసగక పోవడం ఆపార్టీకి అన్యాయం జరిగింది. శివసేన ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్దవ్ ధాకరేను పదవీచ్యుతులను చేసి ఏక్ నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నావిస్ ను ఉపముఖ్యమంత్రిగా చేశారు. కోర్టు వీరిదే అసలైన శివసేనగా గుర్తించి, పార్టీ గుర్తును కూడా వారికే కేటాయించారు. శివసేన వంటి సుదీర్ఘపార్టీ అస్థిత్వాన్ని నిలుపుకోవడానికే సమయం సరిపోతోంది, కేంద్ర రాజకీయాల్లో కాలుపెట్టకుండా బీజేపీ ఇలా చెక్ చెప్పిందని అనుకోవచ్చు.
తెలంగాణ
దక్షిణాదిలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ రెండు సార్లు అసెంబ్లీస్థానాలను గెలుచుకొని కేంద్రంలో చక్రం తిప్పాలని, ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్రాన్ని కుమారుడు తారక రామారావుకు అప్పగించి, ప్రధాని కావాలని కలలు కంటున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్, బీజేపీయేతర థర్డ్ ఫ్రంట్ కోసం దేశం అంతటా తిరుగుతున్నప్పటికీ ఆశించిన ఫలితం దక్కడం లేదు. ఇటీవలతనను నేషనల్ ఫ్రంట్ కు కన్వీనర్ ను చేసినట్లయితే (గతంలో ఎన్టీరామారావు చేపట్టిన పదవి) ఆలిండియా లెవల్లో ఎన్నికల ఖర్చును పెట్టుకుంటానని మిగతా పార్టీలకు బంపర్ ఆఫర్ ఇచ్చినా ఈయనపై నమ్మకముంచే వారే కరువయ్యారు. అందుకు కారణం ఆయన కుటుంబంపై ఉన్న అవినీతి ఆరోపణలే అని వేరే చెప్పనక్కర్లేదు.
జగన్మోహన రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనేక జనరంజక సంక్షేమ పథకాలతో ముందుకు పోతున్నప్పటికీ ఆయనకు దేశ రాజకీయాలపై ఏమాత్రం ఇంటరస్టు లేదని ఖచ్చితంగా చెప్పేశారు. ఇంకా ఆయనను సీబీఐ, ఈడీ కేసులు వెంటాడటం కూడా కారణం కావచ్చు. రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీ అయిన చంద్రబాబును ఎదుర్కోవడం కూడా ఆశామాశీ వ్యవహారం కానందున ఈ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు.
ఎంకే స్టాలిన్
తమిళనాడులో ఐదు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన కరుణానిధి కుమారుడు ఎం కే స్టాలిన్ మొదటిసారిగా ముఖ్యమంత్రి బాధ్యతలను 2021లో చేపట్టారు. ( అంతకుముందు ఆయన చెన్నై మేయర్ గా పనిచేశారు.) ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ద్రవిడ మున్నేట్ర కజకం (డీఎంకే) పార్టీ కాంగ్రెస్తో పొత్తుపెట్టుకోవడంతో కాంగ్రెస్ను వారు బలపరచడమే తప్ప స్వయంగా కేంద్రరాజకీయాల్లో పెరిగే ఛాన్సు తక్కువే. ఆయన చెల్లి కనిమొళనీ రాష్ట్రం నుంచి ఎంపీగా ఉన్నారు.
అయితే క్లీన్ ఇమేజ్ ఉన్న స్టాలిన్ ను కాంగ్రెస్ ఉపయోగించుకోవాలనుకుంటోంది. దీంతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆయనకు ఫోన్ చేసి ఒక సారి రావాలని కోరినట్లు తెలుస్తోంది. భావసారూప్యత ఉన్న పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే కర్తవ్యాన్ని ఆయన భుజ స్కందాలపై ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆయనతో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వ సీఎం పినరాయి విజయన్ కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కేరళ ఎదుర్కొన్న అనేక వరద ఉపద్రవాల్లో కేంద్రం సహకారం అందించలేదు సరికదా.. సౌదీ రాజు చేస్తున్న సహాయాన్ని కూడా కేంద్ర బీజేపీ అడ్డుకుందన్న ఆగ్రహం తోపాటు సహజంగా బీజేపీకి వామపక్షాలకు ఉండే వైరుద్యం కూడా ఇందుకు కారణంగా ఉంది. స్టాలిన్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్నేహపూర్వకంగా మెలిగినప్పటికీ గతంలో కేంద్ర కాంగ్రెస్ పార్టీతో ఆయనకున్న చేదు అనుభవాల దృశ్యా కాంగ్రెస్తో ముందుకు వెళ్లే అవకాశాలు తక్కువ కావచ్చు. అయితే 2019లో రాష్ట్రానికి మేలు చేసే ఏ పార్టీతో అయినా ముందుకెళతాం అని చెప్పింది కాబట్టి లోటుబడ్జెట్ తో విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామనడం కూడా కాంగ్రెస్ కు ఆశాజనకంగా ఉండి ఉండొచ్చు.
కర్ణాటక
మరొక రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్రం గత ఎన్నికల్లో కాంగ్రెస్ అలయెన్స్ తో కుమారగౌడ ముఖ్యమంత్రిగా ఉండగా, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య సహకరించకపోవడాన్ని బీజేపీ ఉపయోగించుకొని అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే కర్నాటక లోని బసవరాజు బోమ్మయ్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోవడంతో కాంగ్రెస్ కు పట్టంకట్టే యోచనలో కర్ణాటక ప్రజలు ఉన్నట్లు ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ కు ఫెచ్ అవుతుంది అయితే అక్కడ కాంగ్రెస్ నాయకుల్లో బోల్డన్ని రాజకీయాలున్నాయి, సిద్దరామయ్య, శివకుమార్, మల్లిఖార్జున ఖర్గే ఎంతవరకు సహకరించుకుంటారోతెలియదు. ఎవరిని సీఎం చేస్తానంటే ఎవరికి కోపం వస్తుందో ? వీరందరినీ ఏక తాటిపైకి తీసుకు రావడం అనుకున్నంత ఈజీ కాదు.
కేజ్రీవాల్
రాష్ట్ర రాజధానిని ఏలుతున్న ఢిల్లీముఖ్యమంత్రి కేజ్రీవాల్ మొదటి నుంచి కాంగ్రెస్, బీజేపీల నుంచి అనేక ఒత్తిళ్లు, సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి బీజేపీ ప్రభుత్వం కాగితాలు, పెన్నులకు కూడా నిధులు కేటాయించకుండా ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ద్వారా అనేక రాజకీయ, పాలనా ఇబ్బందులకు గురిచేస్తున్నప్పటికీ వాటిని తట్టుకోవడమే కాకుండా, పంజాబ్ లోకూడా తన పార్టీ ని విజయంపధంలో నడిపించిన ఘనత కేజ్రీవాల్ దే..
కేజ్రీవాల్ న్యూఢిల్లీలో జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్ కంటాక్స్ గా పనిచేశారు. 2013 లో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని నెలకొల్పి 2013లో ఆ పార్టీ ని గెలుపించుకున్నారు. 2013 నుంచి 2014 ఫిబ్రవరి వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా, ఫిబ్రవరి 14 నుంచి ఏడాదిపాటు అక్కడ ప్రశిడెంట్ రూల్ నడిచింది. 2015లో కేజ్రీవాల్ మళ్లీ ఎన్నికయ్యారు. దానిలో విజయ దుంధుభి మోగించిన కేజ్రీవాల్ పూర్తికాలం సీఎంగా పనిచేశారు. 2020లో మళ్లీ ఎన్నికల్లోగెలిచి, సీఎంగా కొనసాగుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటు స్కూళ్లకు మించి అభివృద్ది చేయడం, వీధివీధిలో మొహల్లా (క్లినిక్ )లను నెలకొల్పడం ద్వారా ప్రజాభిమానాన్ని పొందారు. 2022లో పంజాబ్ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా అంతకు ముందున్న అనేక స్థానిక పార్టీలను కాదని జాతీయ పార్టీగా రూపొందడం సీనియర్ ప్రాంతీయ పార్టీ నేతలకు కలవరం పుట్టించారు. ఎన్నికల అనంతరం మోడీపైనే నాగురి అని ప్రకటించడం వల్లే అతనిని అతని మంత్రివర్గ సభ్యులపై సీబీ ఐ, ఈడీ కేసులతో బీజేపీ వేధిస్తోందని మోడీ –అమిత్ షా లంటే గిట్టని ప్రతిపక్షాలు ఆరోపిస్తునాయి.
బీజేపీ హ్యాట్రిక్ ను ఆపగలవా ?
అయితే మహామహ నేతలంతా బీజేపీని అడ్డుకునేందుకు నానా తిప్పలు పడుతున్న ఈ సమయంలో ఎవరికి వారే ప్రధాని కావాలనుకునే నేతలు కాంగ్రెస్ కు ఎంతగా సహకరించి బీజేపీ హ్యాట్రిక్ ను ఆపగలవో వేచి చూడాల్సిందే.
What next? The opposition parties are struggling
Election time is approaching… How to face BJP?
If the people want to vote against the BJP due to their dissatisfaction with the ruling party, then that is not going to happen.. Two crore jobs per year in 2014.. Swaminathan Commission for farmers, won with promises to unearth black money and put it in everyone’s accounts, and then all of a sudden, without any prior notice, people fell on the banks. , waiting in queues for days, bank staff and many people in the queues succumbed to untimely death, winning more number of parliamentary seats in 2019 than before is not easy for Congress and other opposition parties.
As the elections are approaching early next year, non-BJP senior leaders are scrambling to face the BJP. Rafale and Anil Ambani affairs could not prevent BJP from winning in 2019. With the Hindenburg report, will the opposition, which targeted Adani-Modi, stop the BJP? The real question is?
If we go into national politics..
In PM…
Former Chief Minister of Uttar Pradesh Mulayam Singh (Samajwadi Party) who also served as Defense Minister from 2003 to 2007 asked why they could not become the leaders of the country as senior leaders when Narendra Modi, who was the Chief Minister of Gujarat, could become the Prime Minister of the country. (Former Bihar CM Laluyadav (Rashtriya Janata Dal) served as Railway Minister from 2004 to 2009.)
Even though he once wanted to become PM, he could not succeed.
While Mulayam passed away last year, Lalu Prasad was suffering from old age related ailments.
West Bengal
Another senior leader, CM Mamata Banerjee of West Bengal, has been longing to become the PM since time immemorial. She served as a Union Minister during Rajiv Gandhi’s regime and later came out of the Congress due to differences and founded the Trinamool Congress. She ended the Communist Party rule in the state by defeating Buddhadev Bhattacharya in 2011 and became the first woman CM of West Bengal and has been the CM of the state ever since. In the elections held in 2021, he won 215 out of 292 assembly seats. Although she is interested in national politics and wants to rule the country’s politics as PM, her time is enough to reverse BJP’s strategies in the state.
Sharad Pawar
Sharad Pawar, who held many central positions, could not become the Prime Minister despite ruling the Maharashtra elections. He formed the National Congress Party with Bedhabhi Praya with the Congress. His daughter Supriya Sule is a member of the Rajya Sabha, responding to public issues and raising many questions in Parliament. However, Sharad is not able to become the Prime Minister.
Shiv Sena
In Maharashtra, Shiv Sena did not turn around. However, it was an injustice to the party that the BJP did not reach that party. Shiv Sena deposed Chief Minister Uddhav Dhakare and appointed Ek Nath Shinde as Chief Minister and Devendra Fadnavis as Deputy Chief Minister. The court recognized them as the original Shiv Sena and assigned the party symbol to them. Time is enough to retain the existence of a long-standing party like Shiv Sena, it can be assumed that BJP has said this as a check not to step into central politics.
Telangana
In the newly formed state of Telangana in the south, TRS is eagerly waiting to win two assembly seats and turn the wheel at the centre. Chief Minister Kalvakuntla Chandrasekhara Rao handed over the state to his son Taraka Rama Rao and dreams of becoming the Prime Minister. As a part of that, the Congress and the non-BJP are roaming around the country for a third front, but they are not getting the desired results. Recently, if he was made the convener of the National Front (the position previously held by Ntirama Rao), he would put the election expenses at the Allindia level, even though he had given a bumper offer to the other parties, but those who believed in him were left wanting. Needless to say, the reason for that is the corruption allegations against his family.
Jaganmohana Reddy
The Chief Minister of Andhra Pradesh has made it clear that he has no interest in the country’s politics even though he is pushing ahead with many welfare schemes. Also, the CBI and ED cases chasing him could also be the reason. This decision may have been reached because facing Chandrababu, who is the opposition party in the state, is not a hopeless affair.
MK Stalin
MK Stalin, the son of Karunanidhi, who was the chief minister of Tamil Nadu five times, will take over the responsibilities of the chief minister for the first time in 2021. (Earlier he served as the Mayor of Chennai.) With the alliance of the Dravida Munnetra Kazhakam (DMK), which he represents, with the Congress, there is little chance for him to rise in central politics except to strengthen the Congress. His sister Kanmolani is an MP from the state.
But Congress wants to use Stalin who has a clean image. It seems that Congress chief Mallikarjuna Kharge called him and asked him to come once. Efforts are being made to put the task of bringing all like-minded parties together on his shoulders.
There are high chances of meeting him with Pinarayi Vijayan, the CM of the Communist Government of Kerala. Because the center did not cooperate in the many flood disasters Kerala faced.. The reason for this is the anger that the central BJP blocked the assistance of the Saudi King and naturally the opposition of the BJP to the left. Although the Andhra Pradesh Chief Minister has become friendly with Stalin, his chances of moving forward with the Congress may be slim given his bitter experiences with the Central Congress Party in the past. But in 2019, it has said that it will go ahead with any party that is good for the state, so it might be hopeful for the Congress that it will work with the central government, which will provide special privileges to the state that has been divided with a deficit budget.
Karnataka
In Karnataka, another state, Kumara Gowda was the chief minister with the Congress alliance in the last election, but the BJP took advantage of the non-cooperation of Congress leader Siddaramaiah and brought down the government there. However, election analysts believe that the people of Karnataka are planning to crown the Congress as the Basavaraj Bommai government in Karnataka is completely corrupt. If the Congress government comes there, it will fetch the Congress, but there are many politics among the Congress leaders, it is not known how far Siddaramaiah, Shivakumar, Mallikarjuna Kharge will cooperate. Who will get angry if you make him CM? Bringing them all together is not as easy as it seems.
Kejriwal
Delhi Chief Minister Kejriwal, who is ruling the state capital, has been facing many pressures and challenges from the Congress and BJP since the beginning. Since Delhi is a union territory, the BJP government is facing many political and governance problems through the Lt. Governor of Delhi without allocating funds even for paper and pens, but Kejriwal is credited with leading his party to victory in Punjab as well.
Kejriwal served as Joint Commissioner of In-Communications in New Delhi. He founded the Aam Aadmi Party in 2013 and won that party in 2013. While he was the Chief Minister from 2013 to February 2014, President’s Rule was in place for a year from February 14. Kejriwal was re-elected in 2015. In it, Kejriwal served as the CM for the whole time, who was called by Vijaya Dundhubhi. He won the election again in 2020 and continues as CM. He gained popularity by promoting Delhi government schools beyond private schools and setting up street mohallas (clinics). By winning the Punjab elections in 2022, the formation of a national party and not the many local parties that preceded it has left senior regional party leaders confused. Opposition parties accused Modi and Amit Shah that the BJP is harassing him with CBI and ED cases against his cabinet members
Can BJP stop the hat trick?
However, at this time when all the Mahamaha leaders are trying to stop the BJP, we have to wait and see how much the leaders who want to become the Prime Minister will be able to cooperate with the Congress and stop the BJP’s hat-trick.