Chandrababu Naidu Meets Bill Gates to Foster Collaboration in Health, Education, and Innovation
Davos, Switzerland, January 22, 2025: Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu met with Bill Gates, Founder of Microsoft and the Bill & Melinda Gates Foundation (BMGF), on the sidelines of the World Economic Forum summit in Davos. The meeting focused on forging partnerships to transform Andhra Pradesh into a global hub for health, education, and innovation.
During the discussion, the Chief Minister proposed the establishment of a Center of Excellence for Health Innovation and Diagnostics in Andhra Pradesh. Highlighting the potential of this center to deliver cutting-edge healthcare services to the public, Chief Minister emphasised the state’s commitment to leveraging innovation to improve public health outcomes.
He further invited Bill Gates to join the advisory board for the proposed Artificial Intelligence University in Andhra Pradesh. This initiative aims to position the state as a leader in AI research and development, aligning with global advancements in technology and education.
The Chief Minister also expressed interest in implementing BMGF’s successful programmes, such as health dashboards and other social initiatives, within Andhra Pradesh. He underscored the need for collaboration to adapt global innovations to local challenges, ensuring maximum impact.
Chandrababu Naidu assured Bill Gates that Andhra Pradesh could serve as a gateway for the foundation’s initiatives across South India, providing a platform to amplify its reach and effectiveness in the region.
“I am delighted to meet Bill Gates again after a long time,” said Chief Minister Chandrababu Naidu. “His focus on technology and innovation has been an inspiration to all. We discussed opportunities for collaboration in health and AI innovation, and I look forward to BMGF’s partnership in Andhra Pradesh’s progress,” he added.
Invitation to Hindustan Unilever
Chief Minister Chandrababu Naidu also met Willem Uijen, Chief Supply Chain Officer of Unilever, a global leader in consumer goods known for its food, home care, beauty, and personal care products. Operating in India under the name Hindustan Unilever, the company is looking to expand in line with India’s growing demand.
As part of its expansion, Unilever is considering setting up a palm oil industry with an investment of ₹330 crore in Andhra Pradesh. The Chief Minister highlighted Visakhapatnam as an ideal location for a technology center related to Unilever’s beauty portfolio.
He also emphasised that Hindustan Unilever could benefit from the state’s vast agricultural output, which would support food processing, beauty, and home care product manufacturing. He invited the company to invest further in the state.
Meeting with Cenmat CEO
In a meeting with Roberto Bocca, a member of the World Economic Forum’s Executive Committee and Head of the Center for Energy and Materials (Cenmat), the Chief Minister sought assistance in attracting global investments to Andhra Pradesh in areas such as green hydrogen, battery storage, and solar manufacturing.
He also requested the WEF’s support for establishing a Clean Energy Knowledge and Skill Development Center in the state.
యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉజ్జెన్ గారితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
Davos Cm Tour Update:
Day 3 – Press Release 3:
ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకే మా ప్రాధాన్యత
సహకరించాలని బీఎంజీఎఫ్‌కు వినతి
బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
దావోస్, జనవరి 22 : ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ బిల్ గేట్స్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు మూడోరోజు బిల్ గేట్స్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి పలు అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్, డయాగ్నోస్టిక్స్ ప్రారంభించాలని ఈ కేంద్రం ప్రజలకు అధునాతన ఆరోగ్య సదుపాయాలు అందిస్తుందని చెప్పారు.
ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సలహా కోరిన సీఎం :
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్శిటీ కోసం బిల్ గేట్స్‌ను సలహాదారుల మండలిలో భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ విజయవంతంగా అమలు చేస్తున్న హెల్త్ డ్యాష్‌బోర్డ్‌లు, సామాజిక కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌లో కూడా నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. అంతర్జాతీయ ఆవిష్కరణలను స్థానికంగా వినియోగించుకునేలా సాయం అందించాలని కోరారు. బిల్ గేట్స్ ఫౌండేషన్‌కు దక్షిణాది రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ను ముఖద్వారంగా చేసుకునేలా సహకరిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
బీఎంజీఎఫ్ భాగస్వామ్యానికి ఎదురుచూస్తున్నా :
చాలా రోజుల తర్వాత బిల్ గేట్స్‌ను కలుసుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. సాంకేతికతను వినియోగించుకోవడంలోనూ, ఆవిష్కరణలపై దృష్టిపెట్టడంలో గేట్స్ అందరికీ స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. ఆరోగ్యం, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఇన్నోవేషన్‌పై పరస్పరం సహకరించుకోవడానికి గల అవకాశాలను ఇరువురం చర్చించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పురోగతిలో బీఎంజీఎఫ్ భాగస్వామి కావాలని… ఇందుకోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.
హిందుస్థాన్ యూనిలీవర్‌కు ఆహ్వానం :
ప్రపంచవ్యాప్యంగా వినియోగ వస్తువులు విక్రయించే యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉజ్జెన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఫుడ్, హోమ్ కేర్, బ్యూటీ, పర్సనల్ కేర్ సంబంధిత ఉత్పత్తులకు పేరున్న సంస్థ యూనిలీవర్. భారత్‌లో హిందుస్థాన్ యూనిలీవర్ పేరుతో విక్రయాలు జరుపుతోంది. భారత్‌లో డిమాండ్‌కు అనుగుణంగా మరింతగా విస్తరించాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో రూ. 330 కోట్లతో పామాయిల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అలాగే బ్యూటీ పోర్ట్‌ఫోలియోకు సంబంధించి టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నం అనుకూలంగా వుంటుందని విల్లెం ఉజ్జెన్‌కు ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున వచ్చే వ్యవసాయ దిగుబడులను హిందుస్థాన్ యూనిలీవర్ వినయోగించుకోవచ్చని… ఫుడ్ ప్రాసెసింగ్, బ్యూటీ, హోమ్ కేర్ ఉత్పత్తుల తయారీకి రాష్ట్రం అనుకూలంగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు.
సెన్మట్ సీఈవోతో భేటీ :
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్ (సెన్మట్) హెడ్ రాబర్టో బోకాను సమావేశమైన ముఖ్యమంత్రి.. గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, సోలార్ మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు తరలివచ్చేలా సెన్మట్ సహకారం అందించాలని కోరారు. క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ – స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌కు డబ్ల్యూఈఎఫ్ మద్దతివ్వాలని అభ్యర్ధించారు.
దావోస్‌లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిల్-మిలిందా గేట్స్ ఫౌండర్ బిల్‌గేట్స్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏఐ యూనివర్సిటీ, ఇన్నోవేషన్&ఇంక్యుబేషన్, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ హెల్త్, గేట్‌వే టు సౌత్ ఇండియా వంటి అంశాలపై బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. ఈ సమావేశంలో బిల్‌గేట్స్‌తో పాటు బిల్-మిలిందా గేట్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అర్చనా వ్యాస్ పాల్గొన్నారు.
Day 3 – Press Release 2:
ఏపీలో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయండి
డీపీ వరల్డ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
పోర్టులను పరిశీలించాల్సిందిగా సూచన
దావోస్, జనవరి 22 : ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు ముందుకు రావాలని ప్రపంచంలో కంటైనర్ టెర్మినల్‌లో ప్రతిష్టాత్మక సంస్థ డీపీ వరల్డ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో మూడో రోజు డీపీ వరల్డ్ సెంట్రల్ ఏసియా, ఆఫ్రికా మేనేజింగ్ డైరెక్టర్ రిజ్వాన్ సూమర్‌తో ముఖ్యమంత్రి ఈ మేరకు చర్చలు జరిపారు. భారతదేశంలో డీపీ వరల్డ్‌కు 5 కంటైనర్ టెర్మినల్స్ ఉన్నప్పటికీ ఏపీలో ఇప్పటివరకు ఒక్కటీ లేదని, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, కృష్ణపట్నం, మూలపేటలో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. దీనిపై ఆలోచన చేయాలని రిజ్వాన్ సుమూర్‌ను ముఖ్యమంత్రి కోరారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సీ పోర్టుల్లోనూ, ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్‌పైనా పెట్టుబడులు పెట్టేందుకు ముఖ్యమంత్రి ఆహ్వానించారు. డీపీ వరల్డ్ 40కి పైగా దేశాల్లో 82 మెరైన్, ఇన్‌ల్యాండ్ టెర్మినల్స్ నిర్వహిస్తోంది. గ్లోబల్ కంటైనర్ ట్రాఫిక్‌లో దాదపు 10 శాతం మార్కెట్ డీపీ వరల్డ్ సొంతం. డీపీ వరల్డ్ రాష్ట్రానికి వస్తే రాష్ట్రం నుంచి అంతర్జాతీయ వాణిజ్యాభివృద్ధికి దోహద పడుతుంది.
Day 3 – Davos CM Tour Update
Andhra Pradesh: A Global Destination for Investments
Andhra Pradesh is favourable for Google Cloud Expansion
Explore the possibility of setting up a design center in Visakhapatnam
Invite Petronas for investments in Mulapeta
CM Chandrababu extends invitations at Davos
Discussions with PepsiCo representatives
Davos, Switzerland, January 22, 2025: Chief Minister of Andhra Pradesh, Nara Chandrababu Naidu, highlighted the state’s strategic advantages for global investments during his third day at the World Economic Forum in Davos. He engaged with leaders of top multinational corporations to showcase Andhra Pradesh as an ideal destination for cutting-edge technology, green energy, and infrastructure projects.
Google Cloud Expansion in Andhra Pradesh
CM Chandrababu Naidu met Google Cloud CEO Thomas Kurian to discuss establishing a design center in Visakhapatnam for developing proprietary chips used in servers. He urged Google Cloud to set up a manufacturing unit in Andhra Pradesh to integrate its server supply chain. The Chief Minister assured complete support from the state government and highlighted the state’s readiness to serve as a global hub for server management services.
Existing Collaborations
Google Cloud, the third-largest cloud provider globally, has already established two cloud regions in Delhi and Mumbai. It recently signed an MoU with the Andhra Pradesh government to create a “Data City” in Visakhapatnam and advance artificial intelligence (AI) applications while fostering skill development opportunities for local youth.
Investment opportunities with Petronas
The Chief Minister met with Muhammad Taufik, President and Group CEO of Petronas, a leading Malaysian oil and gas company. Petronas plans to produce 5 million tons of green ammonia annually by 2030 and is exploring investments of ₹13,000–₹15,000 crore in a green hydrogen and ammonia plant in Kakinada. CM Chandrababu Naidu invited Petronas to expand further by investing in Mulapeta, emerging as a petrochemical hub, and the proposed Global Capability Center in the state.
Collaboration with PepsiCo
In a meeting with Eugene Willemsen, CEO of PepsiCo International Beverages, and Stephen Kehoe, Chairman of PepsiCo Foundation, CM Naidu proposed making Visakhapatnam a Global Delivery Center and a Digital Hub for PepsiCo. He also encouraged PepsiCo to partner with the Andhra Pradesh Community Natural Farming (APCNF) initiative to benefit local farmers through its supply chain. The Chief Minister suggested setting up a Kurkure manufacturing unit in the state to enhance industrial growth and provide employment opportunities.
Engagement with Bahrain Delegates
The Chief Minister also met with Hamad Al Mahmeed from the Bahrain Prime Minister’s Office and Abdullah bin Khalifa Al Khalifa, CEO of Mumtalakat. He presented Andhra Pradesh’s progressive industrial policies and invited investments, emphasizing the state’s efficiency in facilitating businesses.
Andhra Pradesh: Speed of Doing Business
Under CM Naidu’s leadership, Andhra Pradesh continues to attract global attention as a hub for innovation, sustainability, and economic growth. The state’s proactive governance and investor-friendly policies ensure seamless integration for businesses aiming to scale globally.
దావోస్‌లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
https://youtube.com/live/AsFmrLV7oU0?feature=share
ముంతాలకత్ సీఈవో అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
పెప్సీకో ఇంటర్నేషన్ బెవరేజస్ సీఈవో యూజీన్ విల్లెంసెన్, పెప్సీకో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కెహోతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం
పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎగ్జీక్యూటివ్ ఆఫీసర్ ముహమ్మద్ తౌఫిక్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం.
Davos Cm Tour Update:
Day 3 – Press Release 1:
గూగుల్ క్లౌడ్ విస్తరణకు ఏపీ అనుకూలం
విశాఖలో డిజైన్ కేంద్రం ఏర్పాటును పరిశీలించండి
మూలపేటలో పెట్టుబడులకు పెట్రోనాస్ సంస్థకు ఆహ్వానం
దావోస్ వేదికగా ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
పెప్సికో ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి చర్చలు
దావోస్, జనవరి 22 :- సర్వర్‌ల కోసం సొంత చిప్‌లను రూపొందిస్తున్న గూగుల్ విశాఖపట్నంలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌ను కోరారు. గూగుల్ క్లౌడ్ తన సర్వర్ సప్లై చైన్ అనుసంధానించేలా తయారీ యూనిట్‌ను ఏపీలో నెలకొల్పాలని థామస్ కురియన్‌కు ముఖ్యమంత్రి కోరారు. సర్వర్ నిర్వహణ సేవల విషయంలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం పూర్తిగా వుంటుందని థామస్ కురియన్‌కు ముఖ్యమంత్రి తెలిపారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో భాగంగా దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. మూడో రోజు పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకట్టుకునేందుకు ప్రముఖ సంస్థల అధిపతులతో చర్చలు జరిపారు.
గూగుల్‌తో ఇప్పటికే పలు ఒప్పందాలు :
క్లౌడ్ ప్రొవైడర్‌లో ప్రపంచంలో మూడో అతి పెద్ద సంస్థ అయిన గూగుల్ క్లౌడ్.. తన ప్లాట్‌ఫామ్ కింద ఇప్పటికే భారత్‌లోని ఢిల్లీ, ముంబైలో రెండు క్లౌడ్ రీజియన్లు ఏర్పాటు చేసింది. ఇటీవల విశాఖపట్నంలో తమ ‘డేటా సిటీ’ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ ఎంవోయూ కుదుర్చుకుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని అభివృద్ధి చేయడానికి, రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పెంపొందించేందకు ఏపీతో ఒప్పందం చేసుకుంది.
పెట్రోనాస్ ప్రెసిడెంట్‌తో ముఖ్యమంత్రి చర్చలు
పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎగ్జీక్యూటివ్ ఆఫీసర్ ముహమ్మద్ తౌఫిక్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. ‘పెట్రోనాస్’ మలేషియాకు చెందిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ. ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, గ్రీన్ మాలిక్యులస్‌కు సంబంధించి భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. 2030 కల్లా ఏడాదికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి కాకినాడ ప్లాంటులో రూ.13,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. పెట్రోకెమికల్ హబ్‌గా అవతరిస్తున్న మూలపేటలోనూ, అలాగే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌లోనూ పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముహమ్మద్ తౌఫిక్‌ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
పెప్సీకో అధిపతులతో సమావేశం
పెప్సీకో ఇంటర్నేషన్ బెవరేజస్ సీఈవో యూజీన్ విల్లెంసెన్, పెప్సీకో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కెహోతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. పెప్సీకో ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫుడ్ బెవరేజెస్. ఇప్పటికే ఏపీలోని శ్రీసిటీలో బాటిలింగ్ ప్లాంట్ నిర్వహిస్తున్న పెప్సికో బెవరేజెస్… విశాఖపట్నాన్ని గ్లోబల్ డెలివరీ సెంటర్‌గా చేసుకుని పెప్సీకో డిజిటల్ హబ్‌ను ఏర్పాటు చేయవచ్చని ముఖ్యమంత్రి సూచించారు. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్‌ను విశాఖకు విస్తరించాల్సిందిగా కోరారు. కుర్‌కురే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుతో పాటు పెప్సీకో తమ సప్లై చైన్ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఏపీసీఎన్‌ఎఫ్‌తో భాగస్వామ్యం కావాలని సూచించారు. బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయంలో ప్రతినిధి హమద్ అల్ మహ్మీద్, ముంతాలకత్ సీఈవో అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫాతోనూ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పారిశ్రామికాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీలను వివరించిన ముఖ్యమంత్రి….స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజనెస్ కోసం ఎపికి రావాలని వారిని ఆహ్వానించారు.
CM N. Chandrababu Naidu, to Engage in High-Profile Meetings on Day 3 of Davos Visit
Davos Cm Tour Update Day 3:
• దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు 3వ రోజు పర్యటన వివరాలు :
• వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో 3వ రోజు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశాలు
• సీఎంతో భేటీ కానున్న యునీలీవర్, డీపీ వరల్డ్ గ్రూపు, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), గూగుల్ క్లౌడ్, పెప్సీకో, ఆస్ట్రా జెనెకా సంస్థల అధిపతులు
• బిల్ గేట్స్, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధితోనూ నేడు సీఎం చర్చలు
• దావోస్ సమావేశాల్లో గ్రీన్‌కోతో ఎంవోయూ కుదుర్చుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం
• ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబ్రేషన్, గ్రీన్ హైడ్రోజన్ – పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి
• ఏపీలో పెట్టుబడులకు వున్న అవకాశాలను వివరించనున్న చంద్రబాబు
CM Chandrababu Naidu Showcases Investment Opportunities at Davos
Davos, Switzerland, January 21, 2025: On the second day of the World Economic Forum 2025 in Davos, Andhra Pradesh Chief Minister Chandrababu Naidu engaged in strategic discussions with global industry leaders to promote investment opportunities in the state. These high-profile meetings underscored Andhra Pradesh’s emergence as a preferred destination for global investments and collaboration.
Meeting with Chuck Robbins, Chairman and CEO of CISCO
The Chief Minister met with Chuck Robbins, Chairman and CEO of CISCO, to discuss potential areas of collaboration and investment in Andhra Pradesh. The discussions focused on leveraging CISCO’s technological expertise to enhance digital infrastructure in the state and drive innovation-led growth.
Discussion with ArcelorMittal/Nippon Steel Leadership
In a key meeting, Chandrababu Naidu held discussions with Mr. Lakshmi N. Mittal, Executive Chairman, and Mr. Aditya Mittal, CEO of ArcelorMittal/Nippon Steel. The focus was on the company’s landmark ₹1.4 lakh crore investment in a 17.8-million-ton integrated steel project in Anakapalli. This greenfield project is set to be one of the largest of its kind, reinforcing Andhra Pradesh’s position as a hub for industrial growth.
Exploring Opportunities with LG Chem Ltd.
Chandrababu Naidu also engaged with Mr. Shin Hak Cheol, CEO of LG Chem Ltd., to explore further investment opportunities across a variety of sectors, including chemicals, renewable energy, and manufacturing. The discussions reflected Andhra Pradesh’s potential as a partner for global chemical industry leaders.
Maritime Investment Prospects with Maersk
The Chief Minister held a productive conversation with Mr. Vincent Clerc, CEO of Maersk, to discuss investment opportunities in Andhra Pradesh’s maritime sector. Maersk expressed keen interest in exploring the state’s extensive coastline and developing logistics and port infrastructure.
Roundtable: Positioning Andhra Pradesh as a Global Petrochemical Hub
Chandrababu Naidu participated in a high-level roundtable to present Andhra Pradesh’s vision for becoming a global petrochemical hub. Key highlights of his address included:
• Strategic Growth in Andhra Pradesh: Highlighting consistent growth in the state, he emphasised India’s rapid economic expansion as the world’s 5th largest economy and 4th largest in purchasing power parity.
• Petrochemical Sector Opportunities: Andhra Pradesh hosts HPCL in Vizag, with BPCL projects underway in Ramayapatnam. The Chief Minister stressed the sector’s rapid growth and its potential to drive employment and revenue generation.
• Maritime Advantage: With a 1,000-km coastline, 5-6 operational ports, and three more under construction, the state offers unparalleled opportunities for logistics and trade.
• Future Outlook: By 2028, Andhra Pradesh aims to achieve the highest incremental growth in India, supported by a robust petrochemical and industrial ecosystem.
The Chief Minister stated, “This is a win-win situation for investors and Andhra Pradesh, as the ecosystem we are building will create jobs, generate revenue, and promote sustainable growth.”
These meetings and discussions at Davos reflect Andhra Pradesh’s proactive approach to attracting global investments and its commitment to driving economic transformation.
Government of Andhra Pradesh has decided to sign an MoU
with “The Art of Living” for taking up Leadership development and capacity building programs for government officials through Vyakti Vikas Kendra, a Public Education and Charitable Trust founded under the aegis of Art of Living. Based on the directions of Hon’ble Chief Minister after the meeting with Gurudev Sri Sri Ravi Shankar, the Chairman of Vyakti Vikas Kendra Sri. Prasanna Prabhu met Principal Secretary GAD (Political) Sri.S Suresh Kumar, IAS and discussed about the focus areas and implementation strategy. These programs are designed to equip and empower officers with the latest tools and technologies for achieving all-around excellence in governance and service delivery. These programs aim to transform government officials into more efficient, empathetic, and visionary leaders, driving excellence in their roles and contributing meaningfully to society. GAD and Planning department are jointly preparing the strategy for taking up the Leadership development and capacity building programs for government officials. The MoU will be signed in the presence of Hon’ble Chief Minister.
CM Chandrababu Naidu Showcases Investment Opportunities at Davos
Davos, Switzerland, January 21, 2025: On the second day of the World Economic Forum 2025 in Davos, Andhra Pradesh Chief Minister Chandrababu Naidu engaged in strategic discussions with global industry leaders to promote investment opportunities in the state. These high-profile meetings underscored Andhra Pradesh’s emergence as a preferred destination for global investments and collaboration.
Meeting with Chuck Robbins, Chairman and CEO of CISCO
The Chief Minister met with Chuck Robbins, Chairman and CEO of CISCO, to discuss potential areas of collaboration and investment in Andhra Pradesh. The discussions focused on leveraging CISCO’s technological expertise to enhance digital infrastructure in the state and drive innovation-led growth.
Discussion with ArcelorMittal/Nippon Steel Leadership
In a key meeting, Chandrababu Naidu held discussions with Mr. Lakshmi N. Mittal, Executive Chairman, and Mr. Aditya Mittal, CEO of ArcelorMittal/Nippon Steel. The focus was on the company’s landmark ₹1.4 lakh crore investment in a 17.8-million-ton integrated steel project in Anakapalli. This greenfield project is set to be one of the largest of its kind, reinforcing Andhra Pradesh’s position as a hub for industrial growth.
Exploring Opportunities with LG Chem Ltd.
Chandrababu Naidu also engaged with Mr. Shin Hak Cheol, CEO of LG Chem Ltd., to explore further investment opportunities across a variety of sectors, including chemicals, renewable energy, and manufacturing. The discussions reflected Andhra Pradesh’s potential as a partner for global chemical industry leaders.
Maritime Investment Prospects with Maersk
The Chief Minister held a productive conversation with Mr. Vincent Clerc, CEO of Maersk, to discuss investment opportunities in Andhra Pradesh’s maritime sector. Maersk expressed keen interest in exploring the state’s extensive coastline and developing logistics and port infrastructure.
Roundtable: Positioning Andhra Pradesh as a Global Petrochemical Hub
Chandrababu Naidu participated in a high-level roundtable to present Andhra Pradesh’s vision for becoming a global petrochemical hub. Key highlights of his address included:
• Strategic Growth in Andhra Pradesh: Highlighting consistent growth in the state, he emphasised India’s rapid economic expansion as the world’s 5th largest economy and 4th largest in purchasing power parity.
• Petrochemical Sector Opportunities: Andhra Pradesh hosts HPCL in Vizag, with BPCL projects underway in Ramayapatnam. The Chief Minister stressed the sector’s rapid growth and its potential to drive employment and revenue generation.
• Maritime Advantage: With a 1,000-km coastline, 5-6 operational ports, and three more under construction, the state offers unparalleled opportunities for logistics and trade.
• Future Outlook: By 2028, Andhra Pradesh aims to achieve the highest incremental growth in India, supported by a robust petrochemical and industrial ecosystem.
The Chief Minister stated, “This is a win-win situation for investors and Andhra Pradesh, as the ecosystem we are building will create jobs, generate revenue, and promote sustainable growth.”
These meetings and discussions at Davos reflect Andhra Pradesh’s proactive approach to attracting global investments and its commitment to driving economic transformation.
Davos Cm Tour Update Day 3:
• దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు 3వ రోజు పర్యటన వివరాలు :
• వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో 3వ రోజు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశాలు
• సీఎంతో భేటీ కానున్న యునీలీవర్, డీపీ వరల్డ్ గ్రూపు, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), గూగుల్ క్లౌడ్, పెప్సీకో, ఆస్ట్రా జెనెకా సంస్థల అధిపతులు
• బిల్ గేట్స్, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధితోనూ నేడు సీఎం చర్చలు
• దావోస్ సమావేశాల్లో గ్రీన్‌కోతో ఎంవోయూ కుదుర్చుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం
• ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబ్రేషన్, గ్రీన్ హైడ్రోజన్ – పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి
• ఏపీలో పెట్టుబడులకు వున్న అవకాశాలను వివరించనున్న చంద్రబాబు
CM N. Chandrababu Naidu, to Engage in High-Profile Meetings on Day 3 of Davos Visit
DAVOS Day-2: పర్యావరణ పరిరక్షణ – క్లీన్ ఎనర్జీ అంశం పై స్వనీతి ఆధ్వర్యంలో దావోస్ వేదికగా నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్.

Davos Cm Tour Update Day 2:
• దావోస్‌లో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన వివరాలు
• వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో రెండో రోజూ వరుస సమావేశాలు
• 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి భేటీలు
• గ్రీన్ హైడ్రోజన్ – గ్రీన్ మాన్యుఫాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకానమీ సదస్సులు – రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరుకానున్న చంద్రబాబు
• సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, యూఏఈ ఎకానమీ మినిస్టర్‌తోనూ ఈరోజు భేటీ కానున్న సీఎం
• వెల్స్‌పన్ చైర్మన్ బీకే గోయింకా, ఎల్జీ కెమ్ సీఈవో షిన్ హక్ చియోల్, కార్ల్స్‌బెర్గ్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్, టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, వాల్‌మార్ట్ ప్రెసిడెంట్-సీఈవో కాత్ మెక్‌లే, సిస్కో సీఈవో చుక్ రాబిన్స్, కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ తదితరులతో పెట్టుబడులపై చర్చించనున్న చంద్రబాబు
• బ్లూమ్‌బెర్గ్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూల ద్వారా రాష్ట్రప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్న ముఖ్యమంత్రి
దావోస్‌లో మిట్టల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్, సీఈఓ ఆదిత్య మిట్టల్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు నారా లోకేష్ గారు, టీజీ భరత్ గారు. ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయడానికి ఇప్పటికే అంగీకారం తెలిపారు. ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే అంశంపై ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది.
“If there is a rebirth, I wish to be born as a Telugu again”: Nara Chandrababu Naidu.
Telugu community praised for global success.
CM Naidu outlines ambitious goals for Andhra Pradesh.
Zurich/Switzerland, January 20 — Chief Minister Nara Chandrababu Naidu, during his tour to attend the World Economic Forum in Davos, addressed an enthusiastic gathering of Telugu entrepreneurs and professionals at a Meet and Greet event organised by the Telugu community in Zurich. He expressed his pride in being a part of the Telugu community and shared his vision for the state’s future.
Proud to Represent the Telugu Community
“It is my fortune to be born into the Telugu community, which has always been a source of inspiration. If there is a rebirth, I wish to be born as a Telugu child again. My heart and soul are dedicated to the progress of our people,” he said. He commended the global achievements of Telugus and emphasized their growing presence across the world.
Empowering Youth and Creating Opportunities
Chief Minister highlighted the importance of youth in nation-building and urged them to aspire for leadership roles. “Our people should not merely seek jobs but become job creators. The foundation we laid for IT and entrepreneurship has positioned Telugus as leaders globally,” he said.
He also stressed the need for inclusive growth, mentioning his initiatives to empower women through education and 33% reservations in colleges and jobs.
Transforming Andhra Pradesh into a Global Hub
Chandrababu Naidu outlined his vision to make Andhra Pradesh a hub for work-from-home opportunities and green energy. “We aim to leverage technological advancements, such as AI and green hydrogen, to create sustainable growth. Women can balance household responsibilities and contribute economically with work-from-home opportunities,” he said. He encouraged NRIs to play an active role in the state’s development.
Global Recognition for Andhra Pradesh’s Growth
Reflecting on his earlier tenure, the CM recalled his meeting with Bill Gates, which led to Microsoft’s establishment in Hyderabad. “Such milestones have propelled our community’s progress. Today, Satya Nadella, a proud Telugu individual, is the CEO of Microsoft,” he noted.
He attributed the success of initiatives like Hi-Tech City to the strategic vision and stable governance of his administration. “Winning elections is critical to sustaining development. With a stable government, we can transform the state into a global leader,” he said.
Vision 2047: Swarna Andhra Pradesh
Chandrababu Naidu shared his roadmap for making Andhra Pradesh and the Telugu community global leaders by 2047. “India is on track to become a global economic superpower by 2047, and Telugus will play a pivotal role in this journey. Our community must leverage global opportunities while contributing to our homeland’s growth,” he pointed out.
Call to Action for the Telugu Diaspora
He urged the Telugu diaspora to actively engage with Andhra Pradesh’s development. “Your expertise and ideas can help us realize our vision of Swarna Andhra Pradesh by 2047. Let us work together to make Andhra Pradesh a beacon of innovation and prosperity,” he said.
Davos Cm tour Update
Day 1 – Press Release 2
మళ్లీ జన్మ ఉంటే తెలుగుబిడ్డగానే పుడతా
తెలుగుజాతిలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నా
ఉద్యోగాలు చేయడం కాదు… ఇచ్చే స్థాయికి మనవాళ్లు ఎదగాలి
రాష్ట్రాభివృద్ధిలో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం అవసరం
వర్క్‌ఫ్రం హోం హబ్‌గా ఏపీని మార్చుతాం
జ్యూరిచ్‌లో తెలుగు పారిశ్రామిక వేత్తల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
జ్యూరిచ్/స్విడ్జర్లాండ్, జనవరి 20 :- ‘నిత్య స్ఫూర్తి నిచ్చే తెలుగు జాతిలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడతా. నేనెక్కడున్నా నా మనసు తెలుగు జాతి కోసమే తపనపడుతుంది’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు జ్యూరిచ్‌లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొన్నారు. అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు.
మనవాళ్లకే అవకాశాలెక్కువ
‘రాజకీయాల్లోకి వచ్చేందుకు యువతను ఎక్కువగా ప్రోత్సహించా. ఏ దేశమైనా యువత వల్లే అభివృద్ధి చెందుతుంది. యూరప్ లోని 12 దేశాల నుంచి ఈ సమావేశానికి మీరంతా వచ్చారు. గతంలో నేను ఇక్కడి ఎయిర్ పోర్టుకు వస్తే ఎవరూ ఉండేవారు కాదు. ఒకప్పుడు యూరప్‌లో తెలుగువారు ఉండేవారు కాదు. మన వాళ్లు చాలా తెలివైన వాళ్లు… ఎక్కడ అవకాశాలు అంటే అక్కడికి వెళ్తారు. ఊహించని అవకాశాలు భారతీయులకు వస్తాయి… అందులో తెలుగువారు అగ్రస్థానంలో ఉంటారు. యూరప్ మొత్తం వయసు సమస్యతో ఇబ్బంది పడుతోంది. ప్రపంచంలో మన వాళ్లకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ప్రపంచంలో ఎన్నిదేశాలు ఉన్నాయో అన్ని చోట్ల భారతీయులు, తెలుగువారి ఆనవాళ్లు తప్పకుండా ఉంటున్నాయి.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
నా కోసం మీరు చేసిన పోరాటం మర్చిపోలేను
‘ఇన్ని దేశాల్లో తెలుగువారు ఉంటారని నా జీవితంలో ఊహించలేదు. అవకాశాలు అందిపుచ్చుకుని విదేశాలకు వచ్చారు. నన్ను జైలుకు పంపిన సమమంలో మీరు పోరాడిన తీరు నేను చూశాను… ఇన్ని దేశాల్లో తెలుగువారు ఉన్నారా అనిపించింది. 53 రోజుల పాటు నా కోసం మీరు ఉద్యమం చేశారు. రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తి అధికారంలో ఉంటే ఏమైందో గత ఐదేళ్లు చూశాం. రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఎన్నికల సమయంలో ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించారు. ఇది నా జీవితంలో మర్చిపోలేను. పౌరులను తయారు చేయడంలో గతంలో చాలా మంది నాయకులు బాధ్యత తీసుకున్నారు. సింగపూర్ ఒక మత్స్య గ్రామం… అలాంటి దేశాన్ని పబ్లిక్ పాలసీలతో అడ్వాన్స్ దేశంగా పాలకులు మార్చారు. ఏపీ అంటే వ్యవసాయం అని మాత్రమే అనుకున్నారు. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 1993లో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. 1995లో నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఆ సమయంలో ఎవరూ చేయని సాహసం చేశాను. రెండవ తరంలో సంస్కరణలు ప్రారంభించి ఐటీకి ప్రాధాన్యం ఇచ్చా. ఎవరికీ తెలియని సమయంలో ఐటీ గురించి మాట్లాడాను. పిల్లల్ని చదవిస్తే కోట్లు సంపాదిస్తారని చెప్పాను. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం వల్ల తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం దేశంలో అందరికంటే ఎక్కువ ఉంది. దీనికి కారణం నాడు నేను వేసిన పునాది.
ఉద్యోగాలిచ్చే స్థాయికి తెలుగుజాతి ఎదగాలి
‘మనవాళ్లు ఉద్యోగాలు చేయడం కాదు… ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఎప్పుడూ చెప్పేవాణ్ని. రెండవ తరంలో ఎంట్రప్రెన్యూర్‌కు ఆనాడు పునాది వేశానని గర్వంగా చెప్తున్నా. ఆడపిల్లలను చదివించాలని, వివక్ష చూపించొద్దని చెప్పా. కాలేజీ సీట్లలో, ఉద్యోగాల్లో 33 శాతం ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టాను. ఏ ఐటీ కంపెనీకి వెళ్లినా ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువగా కనబడుతున్నారు. ఇప్పుడు అన్ని దేశాల్లో జనాభా సమస్య వచ్చింది. జపాన్ లాంటి దేశం ఇండియా నుంచి మ్యాన్ పవర్ కావాలని మొదటిసారి అడుగుతోంది. సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోతే సంపద సృష్టించినా, టెక్నాలజీ ఉన్నా ఎవరు అనుభవిస్తారు.? 2047 నాటికి భారత్ ఆర్ధికంగా ప్రపంచంలో మొదటి, రెండవ స్థానాల్లో ఉంటాం. 2 కోట్ల మంది తెలుగువాళ్లు ప్రపంచ దేశాలకు వెళ్తే దున్నేస్తారు. మీరు ఇక్కడే ఉండండి… మరింత విస్తరించండి. అభివృద్ధి చేయాలంటే దగ్గరే ఉండాల్సిన పనిలేదు… ఫోన్ ద్వారా కూడా అవుతుంది. తెలుగువారు ప్రపంచమంతా ఉండాలి…. కర్మభూమిని పట్టించుకోవాలి… జన్మభూమికి అవకాశాలు కల్పించాలి. ఈ రెండింటినీ సమాంతరంగా తీసుకెళ్లాలి.’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
వర్క్‌ఫ్రం హోమ్ హబ్‌గా ఏపీ
‘ఎవరు ఏ రంగంలో రాణించాలన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఉండకూడదు. రాజకీయాల్లో ఉండి డబ్బులు సంపాదిస్తే ఎప్పటికీ గౌరవం రాదు. కుటుంబం రాజకీయాలపై ఆధారపడకూడదని ఒకటి రెండుసార్లు విఫలం అయినా హెరిటేజ్ స్థాపించి గౌరవంగా ఉన్నాం. నేను రాజకీయం చేస్తే నా సతీమణి వ్యాపారం చూస్తుంది. లోకేష్ కూడా రాజకీయాలు చేస్తుంటే బ్రాహ్మణి వ్యాపారాలు చూస్తున్నారు. సంపద సృష్టించడం కష్టం కాదు. 2047 నాటికి నెంబర్ గా తెలుగుజాతి ఉండాలనేదే నా సంకల్పం. వ్యవసాయం, కూలీ కుటుంబాల నుంచి వచ్చాం. ప్రపంచలో ఎక్కడికెళ్లినా రాణిస్తున్నాం. ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రకటిస్తే ఏం చేయాలో ఆలోచించి మన వాళ్లను కాపాడుకోగలిగాం. మనం వచ్చిన మార్గాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల కోసం నాడు ఫైళ్లు పట్టుకుని తిరిగాను… కారణం మన వాళ్ళ భవిష్యత్తు కోసం.
సుస్థిర ప్రభుత్వంతో అభివృద్ధి
‘నాడు బిల్ గేట్స్‌ను నేను కలవాలంటే కుదరదని చెప్పారు. ఐదు నిమిషాలు సమయం కావాలని వెళ్లాను. కానీ నేను చెప్పింది వింటూ నలభై నిమిషాల సమయం ఇచ్చారు. నేను ఏమి చేయాలని బిల్‌గేట్స్ అడిగారు… మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో పెట్టాలని కోరాను. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌కు రావడంతో మన తెలుగు బిడ్డ సత్యనాదెళ్ల సీఈఓ అయ్యారు. ప్రతి ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లొచ్చు. కేంద్రంలో మోదీ 3వ సారి పీఎం అయ్యారు. గుజరాత్‌లో బీజేపీ 5వ సారి గెలిచింది. 2004లో కూడా మనం గెలిచి ఉంటే తెలుగు జాతి ఊహకు కూడా అందనంత స్థాయిలో ఉండేది. కానీ అదృష్టం ఏంటంటే నా తర్వాత వచ్చిన పాలకులు హైటెక్ సిటీ కూల్చలేదు. కానీ ఏపీలో మొన్న వచ్చిన పాలకులతో అమరావతి, పోలవరం అన్నీ పోయాయి. మీ శక్తి పెరిగితే మన తెలుగు సంస్కృతి నిలబడుతుంది. మీరు, మీ పిల్లలు తెలుగులోనూ మాట్లాడాలి. అవకాశాలను వెతికిపట్టి ఏపీని వర్క్ ఫ్రం హోమ్ హబ్ గా చేయాలన్నది నా కోరిక. మహిళలు ఇంటి పనులు చూసుకుంటూనే ఐదారు గంటలు పని చేస్తే డబ్బులు సంపాదించవచ్చు. ఏఐని అందరూ అడాప్ట్ చేసుకోవాలి. విద్యుత్ రంగంలో ఊహించని పరిణామాలు రాబోతున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా ఏపీ తయారవుతుంది. మీరు ఏపీ అభివృద్ధిలో భాగం కావాలి. నేను ఒక్క ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడటం లేదు… తెలుగుజాతి అభ్యున్నతి గురించి మాట్లాడుతున్నా. దేశానికి ఏదో చేయాలన్న సంకల్పంతో మోదీ పని చేస్తున్నారు. వికసిత్ భారత్ 2047తో కేంద్రం ముందుకెళ్తే… స్వర్ణాంధ్ర విజన్ 2047తో మనం ముందుకెళ్తున్నాం. మీకున్న నాలెడ్జ్‌తో నాకు సలహాలు ఇస్తే స్వీకరిస్తా. మీరు చూపించే ప్రేమ నా జీవితంలో మర్చిపోలేను. మీ ఆదరణకు నేను ఎంత చేసిన తక్కువే.’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
జ్యూరిచ్‌లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు నారా లోకేష్ గారు, టీజీ భరత్
AP CM@DAVOS UPDATE
Chief Minister N. Chandrababu Naidu Embarks on a Promising Tour to Davos
➢ Back-to-back Meetings with investors mark the first day
➢ Warm reception by the Indian diaspora in Zurich
Zurich, January 20: Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu began his visit to Davos for the World Economic Forum (WEF) summit on an enthusiastic note. On the first day, he engaged in a series of high-level meetings with investors and business leaders, showcasing the vast potential of Andhra Pradesh as an investment destination.
Strengthening India-Switzerland Ties
During his first meeting at the Hilton Hotel, Zurich, Chandrababu Naidu met with Mr. Mridul Kumar, Indian Ambassador to Switzerland. They discussed avenues to attract Swiss investments into Andhra Pradesh. Highlighting that over 350 Swiss companies, including Nestlé, ABB, and Novartis, are already operating in India, the ambassador noted Switzerland’s growing interest in Indian markets.
Chief Minister emphasised Andhra Pradesh’s unique strengths in sectors like pharmaceuticals, medical devices, technical textiles, and rail components manufacturing. He proposed collaborations between Swiss universities and Andhra Pradesh’s upcoming Skill and AI universities, fostering innovation and workforce development.
Exclusive Interactions with Swiss Business Leaders
Mr. Kumar facilitated a meeting between CM Naidu and top executives from four leading Swiss companies including Raoul Keller, Secretary General, Swissmem, Markus Tacke, CEO, Oerlikon, Erich Schmid, CEO, Angst + Pfister and Jörn van der Krone, Head of Economics and External Affairs, Swiss Textiles.
The discussions centered on investment opportunities in Andhra Pradesh, focusing on leveraging the state’s skilled workforce, business-friendly policies, and infrastructural advantages. Mr Naidu extended a formal invitation to these companies to establish their presence in Andhra Pradesh, underscoring the incentives offered by both the central and state governments.
Key opportunities in AP presented
The Chief Minister highlighted several initiatives for investment:
* Establishing advanced research and development centres.
* Collaborations for innovation hubs and incubators.
* Joint ventures in advanced manufacturing sectors like aerospace, automotive, and energy.
* Expanding contract manufacturing and skill development in textiles.
* Setting up advanced facilities such as anti-vibration systems, plumbing labs, and coating centres.
These discussions align with Andhra Pradesh’s commitment to fostering global partnerships and driving innovation-led growth.
Grand Reception in Zurich
The Chief Minister, along with ministers Nara Lokesh, TG Bharat, and a team of officials, received a rousing reception at Zurich Airport. Members of the Europe Telugu Desam Party Forum and the Indian diaspora welcomed him with enthusiasm, reflecting their pride and support for Andhra Pradesh’s developmental strides.
A Unique Interaction Between Two Leaders
An unexpected encounter at Zurich Airport saw CM Naidu meet Telangana Chief Minister Revanth Reddy. The two leaders exchanged views on developmental projects and ongoing investments in their respective states, emphasising collaborative efforts for regional growth.
Davos Cm Tour Update:
Day 1 – Press Release 1:
ఉత్సాహంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన
తొలిరోజే పెట్టుబడిదారులతో వరుస సమావేశాలు
ఘన స్వాగతం పలికిన ప్రవాసాంధ్రులు
స్విస్ కంపెనీలతో భేటీ – పెట్టుబడులకు ఆహ్వానం
జ్యూరిచ్, జనవరి 20 : వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తొలిరోజు పర్యటనలో వరుసగా పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారు. ముందుగా జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్‌లో స్విట్జర్లాండ్‌లోని భారత అంబాసిడర్ మృధుల్ కుమార్‌తో సమావేశమై రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. నెస్ట్లే, ఏబీబీ, నోవార్టీస్ వంటి దిగ్గజ కంపెనీలతో సహా ఇప్పటివరకు 350కు పైగా స్విట్జర్లాండ్ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాయని, మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని మృధుల్ కుమార్ వివరించారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మాస్యుటికల్స్, మెడికల్ డివైజ్‌లు, టెక్నికల్ టెక్స్‌టైల్స్, రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీ, స్విట్జర్లాండ్ యూనివర్సిటీలు.. ఏపీలో ఏర్పాటు చేస్తున్న స్కిల్లింగ్, ఏఐ యూనివర్సిటీకి కలిసి పనిచేసేలా చూడాలని మృధుల్ కుమార్‌కు ముఖ్యమంత్రి చెప్పారు. వర్క్ ఫ్రం హోం విధానంలో స్విట్జర్లాండ్‌కు కావాల్సిన సేవలను అందించేందుకు అన్నిరంగాలకు చెందిన నైపుణ్య యువత ఏపీలో ఉన్నారని తెలిపారు.
స్విట్జర్లాండ్ కంపెనీల సీఈవోలతో భేటీ :
తమ భేటీ అనంతరం మృధుల్ కుమార్ స్విట్జర్లాండ్‌కు చెందిన నాలుగు ప్రముఖ సంస్థల సీఈవోలు, ఇతర ముఖ్యులను సీఎం చంద్రబాబుతో సమావేశపరిచారు. మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ అయిన ‘స్విస్‌మెన్’ సెక్రటరీ జనరల్ రౌల్ కెల్లర్, పాలిమర్ ప్రాసెసింగ్ రంగానికి చెందిన ‘ఓర్లికాన్’ సీఈవో మార్కస్ టకే, హై క్వాలిటీ ఇండిస్ట్రియల్ కాంపోనెంట్స్ అండ్ కస్టమ్ ఇంజినీర్డ్ సొల్యూషన్స్ సంస్థ అయిన ‘ఆంగ్స్ట్ ఫిస్టర్’ సీఈవో ఎరిచ్ స్మిడ్, టెక్స్‌టైల్స్ రంగానికి చెందిన ‘స్విస్ టెక్స్‌టైల్స్’ హెడ్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ ఎక్స్‌టెర్నల్ ఎఫైర్స్ జార్న్ వాన్ డెర్ క్రోన్‌కు రాష్ట్రంలో పెట్టుబడులకు గల విస్తృత అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యతతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాలను వినియోగించుకునేందుకు ఏపీకి రావాలని ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అంతులేని అవకాశాలు :
రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కానీ మాన్యుఫాక్చరింగ్ కోసం సౌకర్యాలు కల్పించడం, కీలక రంగాల్లో ఇన్నోవేషన్ కోసం ఏపీలోని యూనివర్సిటీలతో స్విస్ రీసెర్చ్ సంస్థలు కలిసి పనిచేయడం, ఇన్నోవేషన్ హబ్‌లు – ఇంక్యుబేటర్ల ఏర్పాటు, స్విస్ వెట్ తరహాలో రాష్ట్రంలో ప్లంబింగ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు, శిక్షణ కార్యక్రమాలకు ‘స్విస్‌మెన్’ కంపెనీ ముందుకురావాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో అడ్వాన్స్ కోటింగ్ సెంటర్ ఆవశ్యకత ఉందని, అలాగే ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఎనర్జీ, టూలింగ్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయని, పరిశోధన కోసం ఏఎం సెంటర్ నెలకొల్పవచ్చని… వీటిని ‘ఓర్లికాన్’ వినియోగించుకోవచ్చని చంద్రబాబు సూచించారు. అడ్వాన్డ్స్ సీలింగ్ సొల్యూషన్స్ ప్లాంట్, యాంటీవైబ్రేషన్ సిస్టమ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయొచ్చని ‘ఆంగ్స్ట్ ఫిస్టర్’కు తెలిపారు. ఏపీలోని టెక్స్‌టైల్ రంగంలో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కోసం రావాల్సిందిగా ‘స్విస్ టెక్స్‌టైల్స్’ను సీఎం ఆహ్వానించారు.
జ్యూరిచ్‌లో అపూర్వ స్వాగతం :
దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు ముందుగా జ్యూరిచ్ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అధికారుల బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది. యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున తరలివచ్చి ముఖ్యమంత్రి జ్యూరిచ్ రావడంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కాసేపు వారితో ముచ్చటించి ఉత్సాహ పరిచారు.
కలుసుకున్న ఇరు రాష్ట్రాల సీఎంలు :
జ్యూరిచ్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుకోకుండా కలుసుకున్నారు. ఒకరికి ఒకరు ఎదురుపడటంతో కాసేపు ఇరువురు కూర్చుని మాట్లాడుకున్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రాలకు వస్తున్న పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది.
Davos Day 1
Chief Minister Chandrababu Naidu Arrives at Zurich
Amaravati, 20 January 2025: On day one of his visit to Davos to attend the World Economic Forum in Davos, Chief Minister Nara Chandrababu Naidu, along with Ministers Nara Lokesh, T.G. Bharat, and a team of officials arrived at Zurich airport a short while ago.
At the airport, CM Chandrababu Naidu and the Ministers were warmly welcomed by the Europe TDP Forum members and the Indian diaspora.
In a short while, CM Chandrababu and the Ministers are scheduled to meet with investors in Zurich.
CM meets his counterpart from Telangana at Zurich
Chief Minister Nara Chandrababu Naidu and Telangana Chief Minister A Revanth Reddy met at Zurch airport. They discussed development programmes being implemented in both the Telugu States and various investment opportunities.
Davos Day 1
Chief Minister Chandrababu Naidu Arrives at Zurich
Amaravati, 20 January 2025: On day one of his visit to Davos to attend the World Economic Forum in Davos, Chief Minister Nara Chandrababu Naidu, along with Ministers Nara Lokesh, T.G. Bharat, and a team of officials arrived at Zurich airport a short while ago.
At the airport, CM Chandrababu Naidu and the Ministers were warmly welcomed by the Europe TDP Forum members and the Indian diaspora.
In a short while, CM Chandrababu and the Ministers are scheduled to meet with investors in Zurich.
CM meets his counterpart from Telangana at Zurich
Chief Minister Nara Chandrababu Naidu and Telangana Chief Minister A Revanth Reddy met at Zurch airport. They discussed development programmes being implemented in both the Telugu States and various investment opportunities.
Davos update
Day-1
• జ్యూరిచ్ విమానాశ్రయంలో కలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
• రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ.
Davos update
Day-1
దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు జ్యూరిచ్ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అధికారుల బృందం.
జ్యూరిచ్ విమానాశ్రయానికి కాసేపటి క్రితం చేరుకున్న సీఎం చంద్రబాబు, సభ్యుల బృందం
విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులకు ఘన స్వాగతం పలికిన యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు.
కాసేపట్లో పెట్టుబడిదారులతో జ్యూరిచ్‌లో సమావేశం కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు.