విజయవాడ, తేదీ: 25-11-2023:
రాష్ట్రంలో నవంబర్ 25 నుండి డిసెంబర్ 22 వరకూ జెండర్ అసమానతలకు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు
-సెర్ఫ్ సిఇఓ ఏఎండి ఇంతియాజ్
*
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు జెండర్ అసమానత్వ సమస్యలు ఎదుర్కోవడం కొరకు నిర్మాణాత్మకమైన వ్యూహాలను అమలు చేయడం కొరకు DAY – NRLM /AP SERP ద్వారా స్వయం సహాయక సంఘాలు, ఇతర ప్రభుత్వ విభాగాలు, వివిధ స్వచ్చంద సంస్థలు /పౌర సమాజ సంస్థలు (సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్) అనుసంధానంతో ఈ నెల 25 నుండి డిశంబర్ 22 వరకూ అన్ని రాష్ట్రాలలో జెండర్ వివక్షతకు వ్యతిరేకంగా జాతీయ ప్రచారం (National Campaign Against Gender based Discrimination) నిర్వహించాలని సూచించారని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ సిఇఓ ఏఎండి ఇంతియాజ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ లో గౌరవ కేంద్ర మంత్రి వర్యులు సాద్వి నిరంజన్ జ్యోతి, ఫగ్గన్ సింగ్ కులస్తే లు గ్రామీణాభివృద్ధి శాఖ ఆద్వర్యంలో ఈ రోజు ప్రారంభించారు.
విజయవాడ లోని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జెండర్ కాంపియన్ పోస్టర్ ను ఇంతియాజ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ ఈ సంవత్సరం నిర్వహించే ప్రచార ఇతివృత్తము “భయం, వివక్ష మరియు హింస లేకుండా గౌరవప్రదమైన జీవితానికి నిర్మాణాత్మక అడ్డంకులను పరిష్కరించడం ద్వారా, జెండర్ యొక్క అసమానతలను పరిష్కరించడం ద్వారా మహిళలు మరియు జెండర్-వైవిధ్య వ్యక్తుల యొక్క హక్కులను కాపాడటం మరియు సంస్థలను ముందుకు తీసుకువెళ్ళడం” (advance the agency and rights of women and gender diverse individuals of intersectional identities, by addressing structural barriers for a life without fear, discrimination and violence based on Gender’).
రాష్ట్రంలో జెండర్ అసమానత్వ సమస్యలపై ప్రచారం కొరకు రాష్ట్రం లోని రూరల్ లైవ్ లీ హుడ్ మిషన్ లలో వివిధ ప్రభుత్వ విభాగాలు, వివిధ స్వచ్చంద సంస్థలు / సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ లతో ఒక రాష్ట్ర స్థాయి కోర్ కమిటీ ఏర్పాటు చేసుకుని వారితో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించి, ప్రణాళిక రూపొందించి అన్ని డిపార్ట్ మెంట్ ల ద్వారా జెండర్ ఆధారిత వివక్ష మీద ప్రచారం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ -సెర్ప్ వారు ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ కార్యాలయములో శనివారం జెండర్ కాంపెయిన్ ను సిఇఓ ఇంతియాజ్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమములో అన్ని జిల్లాలు ప్రాజెక్ట్ ఆఫీసర్లు, టి పి యం యు, పధక సంచాలకులు, డి ఆర్ డి ఎ జిల్లా స్థాయి సిబ్బంది మరియు మండల స్థాయి వరకు వర్చ్యువల్ పద్దతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ నవంబర్ 25 నుండి డిశంబర్ 22 వరకూ ప్రణాళిక ప్రకారం 4 వారాలపాటు మొదటి వారం: జెండర్ ఆధారిత హింస, రెండవ వారం: బాల్య వివాహాలు , మూడవ వారం: రక్త హీనత మరియు నాల్గవ వారం: బాలికల విద్య అనే అంశాలపై ప్రచారం నిర్వహిస్తామని ఇంతియాజ్ తెలిపారు.
ఈ సందర్భంగా సంబంధించిన పోస్టర్లను సిఇఓ ఇంతియాజ్ ఆవిష్కరిస్తూ ఈ కార్యక్రమమును రాబోవు రోజులలో జెండర్ సమస్యల పరిష్కారము గ్రామ స్థాయిలో జెండర్ పాయింట్ పర్సన్ , జెండర్ ఫోరం , సోషల్ యాక్షన్ కమిటీ, మండల స్థాయిలో జెండర్ రీసోర్స్ సెంటర్ ద్వారా జెండర్ సమస్యలు పరిష్కారం చేయుటకు నైపుణ్య శిక్షణలతో బలోపేతం చేసి జెండర్ సమస్యలకు పరిష్కార వేదికగా తీర్చి దిద్ద బోతున్నట్లు తెలియ జేశారు.
ఈ కార్యక్రమము అందరి సమన్వయంతో నిర్వహించి జయప్రదం చేయాలని సెర్ప్ ముఖ్య కార్య నిర్వహణాధికారి ఇంతియాజ్ కోరినారు ఈ కార్యక్రమంలో జెండర్ కాంపెయిన్ కోర్ కమిటి సభ్యులు, సెర్ప్ అధికారులు హాజరైనారు. చివరిలో జెండర్ కాంపియన్ ప్రతిజ్ఞలో అందరూ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ సిఇఓ సెర్ఫ్ జి. విజయ కుమారి, హెచ్ఆర్ డైరెక్టర్ పి. సుశీల, పెన్షన్ డైరెక్టర్ పి. లావణ్య కుమారి, హ్యూమన్ డెవలప్ మెంట్ డైరెక్టర్ పి. శ్రీనివాసులు, స్త్రీ నిధి ఎండి కెవి. నాంచారయ్య, తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగిన జెండర్ కాంపియన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రతినిధిగా సత్య సాయి జిల్లాకు చెందిన పి. ఈశ్వరమ్మ పాల్గొన్నారు.