08-09-2023
ప్రభుత్వ బడిపిల్లల మరణాలపై జనసేన పార్టీ కార్యాలయము విడుదల చేసిన పత్రికా ప్రకటన పూర్తిగా అవాస్తవం.
1. ఒక విద్యా సంవత్సరంలోనే మృతి చెందిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య 62,754 అంటూ, కనిపించకుండా పోయిన విద్యార్థుల సంఖ్య 2,29,000 అంటూజనసేనపార్టీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలోన అంశాలు పూర్తిగా అవాస్తవం. వాస్తవాలను కింద పొందుపరుస్తున్నాం.
2. భయాందోళనకు గురిచేయాలన్న ఒక దురుద్దేశంతో ఈ ప్రచారం చేస్తున్నట్టుగా భావిస్తున్నాం.గత ప్రభుత్వం హయాంలో చేసిన సర్వే, దానిద్వారా సేకరించిన నిర్ధారణలేని ఓ డేటాను సరిచేస్తుంటే, నిర్ధారణలేని అదే డేటాను ప్రమాణంగా తీసుకుని ఆరోపణలు చేయడం దుర్మార్గం. బడిపిల్లలు విషయంలో, ప్రభుత్వ పాఠశాలల విషయంలో ఇలాంటి ఆరోపణలు చేయడం అమానవీయం. ప్రజలను, పిల్లలను ఆందోళనకు గురిచేసేలా ప్రకటనలు చేయడం దుర్మార్గం.
3. 2023-24 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పూర్తిచేశాక, బడికిరాకుండా ఉండిపోయిన పిల్లలు ఎవరైనా ఉన్నారా? అన్న విషయంపై ప్రత్యేక దృష్టిపెట్టడం జరిగింది. బడిఈడు కలిగిన పిల్లలు అందర్నీకూడా బడికి పంపాలన్న లక్ష్యంతో ఈకార్యక్రమం చేపట్టడం జరిగింది.
4. ప్రభుత్వం చేపట్టిన సర్వేద్వారా వివిధ పాఠశాలల్లో మొత్తంగా 83,40,874 మంది పిల్లలు ఉన్నట్టు తేలింది. కాని ఇంకా ఎవరైనా బడికి రాకుండా, చదువులకు దూరమై ఉన్నారా అన్న అంశంపై ప్రభుత్వం మరింత శ్రద్ధపెట్టింది.
5. దీనికోసం 2015-16 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం చేపట్టిన ప్రజాసాధికార డేటానుకూడా ప్రభుత్వం పరిశీలించింది. ఈ డేటా అంతా కూడా తప్పుల తడకగా నిక్షిప్తం చేయడం జరిగింది. ఆనాటి ప్రజాసాధికార డేటాలోని వివరాలనే చైల్డ్ ఇన్ఫోద్వారా ఆన్లైలోలో పెట్టడం జరిగింది.
6. ప్రజాసాధికార సర్వేలోని దాదాపు 2 లక్షలకుపైగా బడిపిల్లలకు సంబంధించి డేటలో తప్పులు తడకగా ఉన్నట్టు తేలింది. లేనివారిని ఉన్నట్టుగానూ, అలాగే డబుల్ ఎంట్రీల రూపంలోనూ, మరోవైపు సరైన పరిశీలన చేయకుండా ఈ డేటాను ఎంట్రీ చేసినట్టు తేలింది.
7. అంగన్‌వాడీ పాఠశాలలో చేరిన తర్వాత, పాఠశాల స్థాయి, ఉన్నత విద్యాస్థాయి వరకూ కూడా ఎక్కడాకూడా సంబంధింత విద్యార్థి డ్రాప్‌అవుట్‌కాకుండా అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాలతో పూర్తి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించిన ఉత్తమ నైపుణ్యాలున్న పౌరుడిగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. దీనికోసం ప్రతి విద్యార్థినీ ప్రభుత్వం ట్రాక్ చేస్తోంది. బయట మానేయకుండా, చదువులు మానేయకుండా చూడాలన్నదే ఈ ట్రాకింగ్ ఉద్దేశం.
8. దీనికోసం గత ప్రభుత్వం ప్రజాసాధికార సర్వే డేటాను పూర్తిగా స్వఛ్చీకరణ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికోసం విద్యాశాఖ ద్వారా మరియు గ్రామ సచివాలయ శాఖ ద్వారాసర్వే చేపట్టింది. అప్పటి ప్రజాసాధికార డేటాను రీ వెరిఫై చేసి, లేని తప్పులుగా నమోదుచేసి, డబుల్ ఎంట్రీ చేసి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఆ డేటాను సరిచేయడం జరిగింది. పాత డేటాలో ఇలాంటి పొరపాట్లు జరిగాయని, 2,15, 320 మంది వాస్తవంగా లేని పిల్లలను, ఉన్నట్టుగా ఆ డేటాలో చూపించనట్టు నిర్థారణ అయ్యింది. ఒకవేళ ఈ వివరాలకు నిందించాల్సి వస్తే, గత ప్రభుత్వాన్ని నిందించాల్సి ఉంటుంది.
9. అలాగే 2015 వ సంవత్సరము నుండి ఇప్పటివరకు అంటే ఏడు సంవత్సరాల వరకు ఆ డేటాను సరిదిద్దే ప్రయత్నంకూడా చేయలేదు. బడి ఈడు గల పిల్లల డేటాలో 62,754 మంది మరణించినట్టుగా పేర్కొనడం కూడా ఒక ఊహాజనిత గణాంకం. 2015లో ప్రజాసాధికార సర్వే జరిగినప్పుడు 5 ఏళ్ల చిన్నారి బడిలో చేరితే ఇప్పుడు వయస్సు సుమారు 12 ఏళ్లు అయి ఉంటుంది. ఈ 7 ఏళ్లకాలంలోకూడా వీరిపై ఎలాంటి నిర్థారణ లేదు. ఈ విషయంలో ఇప్పటి ప్రభుత్వం చేపట్టిన సర్వేలో అసలు బయటపడింది ఇప్పుడు ఈ వివరాలన్నింటినీ సరిచేయడం జరుగుతుంది. ఆరోపణలు చేయాలనుకుంటే, గత ప్రభుత్వంమీద రాజకీయపార్టీలు ఆరోపణలు చేయాలి.
10. డ్రాప్ ఓట్లు 3,88,000గా నిర్ధారణ అయినట్లు జనసేన పత్రికా ప్రకటనలోని అంశంకూడా పూర్తిగా అవాస్తవము. ప్రస్తుతము 5 నుండి 18 సంవత్సరముల మధ్య వయసున్న విద్యార్థులు 83 లక్షల 40,874 వేల మంది విద్యార్థులు పాఠశాలలో ఉన్నారు . ఇంకనుబడి బయట ఎంత మంది ఉన్నదీ, ప్రస్తుత ప్రభుత్వం సర్వేజరుపగా గత ప్రభుత్వంలో జరిగిన లెక్కల అవకతవకలన్నీ బయటపడుతున్నాయి. ఈ సర్వే ను ఇంకా కొనసాగించి ఖచ్చితమైన డేటాను సేకరించి పూర్తిగా వాస్తవ డేటాని ప్రభుత్వము అందుబాటులో ఉంచుటకు చేస్తు న్నన్న కృషి మాత్రమే కానీ సదరు రాజకీయపార్టీ ప్రకటన పూర్తిగా వాస్తవ విరుద్ధమైనది.
11. ప్రభుత్వము విద్యపై ప్రత్యేక దృష్టి సారించి, పదవ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థుల కొరకు మరియు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థుల కొరకు సదరు విద్యాసంస్థలలో రీ అడ్మిషన్ అవకాశము ప్రత్యేకముగా ఈ సంవత్సరము కల్పించడ మైనది . రీ అడ్మిషన్ వద్దనుకున్న వారి కొరకు ఓపెన్ స్కూల్లో చేరుటకు మరియు వారికి స్కిల్ కోర్సుల్లో ప్రవేశం చేయుటకు ప్రభుత్వము ఏర్పాటు చేసినది ఈ విధముగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (GER) 100% సాధించుటకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసి చిత్తశుద్ధితో అమలు చేయుచున్నది. పదవ తరగతిలో మరియు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్ అయి తిరిగి అడ్మిషన్ అయిన వారి కొరకు అమ్మఒడి కార్యక్రమం జగనన్న విద్యా కానుక కార్యక్రమంకూడా విస్తరింప చేయుచున్నది.
-పాఠశాల విద్యాశాఖ