తేది: 03.07.2023
గుంటూరులో రెండు రోజుల పాటు డిఫెన్స్ పెన్షన్ (స్పర్ష్) ఔట్ రీచ్ ప్రోగ్రామ్
జులై 4,5 తేదీల్లో కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్(CDA),చెన్నై ఆధ్వర్యంలో రక్షణ సేవ పెన్షనర్లు, రక్షణ పౌర పెన్షనర్లు , కుటుంబ పెన్షనర్లు (స్పర్ష్) గౌరవానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సిస్టం ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్ష (స్పర్ష్) అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నామని గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లా సైనిక సంక్షేమ అధికారిణి శ్రీమతి ఆర్.గుణ షీలా ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరులోని పోలీస్ గ్రౌండ్ ఎదురు, నగరం పాలెం, శుభమస్తు కళ్యాణ మండపం నందు రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగనుందని ఆమె వెల్లడించారు.
కార్యక్రమానికి డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్ మెంట్ అధికారులు మరియు సిబ్బంది హాజరై రక్షణ సేవ, రక్షణ పౌర, కుటుంబ పెన్షనర్లు (స్పర్ష్) గౌరవానికి సంబంధించిన ఫిర్యాదులు మరియు ప్రశ్నలు తదితర సమస్యలను పరిష్కరిస్తారన్నారు. పెన్షనర్లు మాన్యువల్ మరియు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించవచ్చన్నారు. గుంటూరు, బాపట్ల మరియు పల్నాడు జిల్లాలలో నివసిస్తున్న రక్షణ శాఖ పెన్షనర్లు అందరూ తమ ఒరిజినల్ మిలిటరీ డిశ్చార్జ్ సర్టిఫికేట్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్, పెన్షన్ పాస్ బుక్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, తమ కుటుంబ సభ్యుల వివరాలు మరియు తమ పెన్షన్ కి లింక్ చేయబడిన మొబైల్ ను కార్యక్రమానికి తీసుకొని రావాల్సి ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరై తమ సందేహాలు, ఫిర్యాదులను నివృత్తి చేసుకునే సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. జులై 4,5 వ తేదీల్లో (రేపు, ఎల్లుండి) ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారు 8688817827, 9849994278, 8309705635 ఫోన్ నంబర్లను సంప్రదించాలని గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లా సైనిక సంక్షేమ అధికారిణి శ్రీమతి ఆర్.గుణ షీలా సూచించారు.