Collectors Conference – The Chief Minister will review GSDP growth and district-wise GSDP estimates.
అమరావతి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రారంభమైన 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.
సచివాలయం ఐదో బ్లాకులోని కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్సుకు హాజరైన సీఎస్ సాయి ప్రసాద్, జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు.
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్నందుకు సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపిన కలెక్టర్ల కాన్పరెన్స్… స్టాండింగ్ ఓవేషన్ తెలిపిన మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు.
జీఎస్డీపీ గ్రోత్, జిల్లాల వారీ జీఎస్డీపీ అంచనాలపై సమీక్షించనున్న ముఖ్యమంత్రి.
జీఎస్డీపీ గ్రోత్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వనున్న వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ బాబు.ఏ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పీయూష్ కుమార్, రోనాల్డ్ రోస్, వినయ్ చంద్
కలెక్టర్ల కాన్ఫరెన్సులో మంత్రుల సింగపూర్ పర్యటన వివరాలను అందించనున్న మంత్రులు.
సింగపూర్ ట్రైనింగ్ వివరాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని, బీసీ జనార్దన్ రెడ్డి.
స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, విద్య-వైద్యం, పెట్టుబడుల గ్రౌండింగ్, జలధార వంటి అంశాలపై సమీక్షించనున్న ముఖ్యమంత్రి.
వివిధ జిల్లాల్లో అవలంభిస్తున్న ఉత్తమ పద్దతులను ప్రజెంట్ చేయనున్న వివిధ జిల్లాల కలెక్టర్లు.
అమరావతి
సచివాలయంలో కొనసాగుతున్న 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్…
కలెక్టర్ల కాన్ఫరెన్సులో స్వాగతోపన్యాసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు…
- గత పాలకుల నుంచి రూ. 9.74 లక్షల కోట్ల అప్పులు ప్రభుత్వానికి సంక్రమించాయి.
- 94 కేంద్ర పథకాల నుంచి రూ.10 వేల కోట్లను గత ప్రభుత్వం డైవర్ట్ చేసింది.
- రూ.1.30 లక్షల కోట్ల చెల్లించాల్సిన బిల్లులు కూడా గత పాలకులు మనపై రుద్దారు.
- ప్రజా ప్రతినిధులు-అధికారుల కలయికే ప్రభుత్వం.
- ప్రజాస్వామ్యంలో సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత.
- గతంలో డెలివరీ లీకేజిలు ఎక్కువగా ఉండేవి… ఇప్పుడు డీబీటీ ద్వారా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి నిధులు వెళ్తున్నాయి.
- గత పాలకుల కారణంగా రాష్ట్రం గుంతలు పడిన రోడ్లతో విధ్వంసమైంది.
- ఇప్పుడు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం. జీవన ప్రమాణాలు పెంచేలా పాలన సాగిస్తున్నాం.
- వివిధ పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం.
- బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం మనందరి సమిష్టి కృషి
- రెండేళ్ల క్రితం రాష్ట్రం గురించి ఏం మాట్లాడారు… ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు అనే దానికి ఈ అవార్డు ఉదాహరణ.
- మంత్రులు, సీఎస్ మొదలుకుని… గ్రామ స్థాయి అధికారి వరకు పని చేయడం వల్లే ఈ అవార్డు దక్కింది.
- ప్రజల సంతృప్తి స్థాయిని కొలమానంగా పెట్టుకుని పాలన అందిస్తున్నాం.
టీం ఏపీ స్పిరిట్‌తోనే బిజినెస్ రిఫార్మర్ అవార్డు
రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి ఉద్యోగులు, మంత్రులకు ఈ అవార్డు అంకితం : కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
- అధికారులు క్షేత్రస్థాయిలో బాగా పనిచేసిన చోట ప్రజల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది.
- మంత్రుల నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధి, ఉద్యోగి వరకూ అంతా బాధ్యతగా ఉండాలి.
- వచ్చిన ఫిర్యాదులు వందశాతం పరిష్కారం కావాల్సిందే.
- ఆర్థికేతర ఫిర్యాదులను పరిష్కరించకుండా.. కొందరు పైకి కిందకు తిప్పుతున్నారు… వాటిని తక్షణం పరిష్కరించాలి.
- ఆర్థికపరమైన ఫిర్యాదుల గురించి కూడా విచారణ చేసి సరైన వాటిని పరిష్కరించాలి.
- 2027 మార్చి నాటికల్లా రెవెన్యూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన కావాలి.
- సమస్య పరిష్కారం కోసం వినూత్నంగా ఆలోచనలు చేస్తే సుపరిపాలన అందించినట్టే.
- డబ్బులు లేవనడం కాదు… సంపద సృష్టి పని చేయాలి… చేద్దాం.
- వెల్ఫేర్, డెవలప్మెంట్, వెల్త్ క్రియేషన్ అనేది ఓ సైకిల్.
- అభివృద్ధి లేకుండా సంపద లేదు. సంపద లేకుండా సంక్షేమం లేదు.
- సూపర్ సిక్స్ పథకాలతో భద్రత, భరోసా కల్పించాం.
- పీ4తో ఆర్ధిక ప్రమాణాలు పెంచుతున్నాం
- 26 కొత్త పాలసీలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ అంటే నమ్మకాన్ని కల్పించాం.
- రాయల్ ఎన్ ఫీల్డ్ ను డ్రైవ్ చేయడమనేది గర్వంగా ఉండేది.
- నా కాలేజీ రోజుల్లో కూడా ఎన్ ఫీల్డ్ డ్రైవ్ చేయడం చాలా గొప్పగా ఫీలయ్యేవాళ్లం.
- అలాంటి రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థను ఏపీకి తెచ్చాం.
- రూ. 23 లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకున్నాం.
- ఇవి సాకారమైతే 24 లక్షల మేర ఉద్యోగాలు వస్తాయి.
- గ్రీన్ ఎనర్జీతో పాటు గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తి దిశగా ముందుకు వెళ్తున్నాం.
- డేటా, ఏఐ, క్వాంటం లాంటి టెక్నాలజీలకు ఏపీ కేంద్రంగా మారనుంది.
- గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ లాంటి దిగ్గజ కంపెనీలు ఏపీకి వచ్చాయి.
- రోజుకో ఒప్పందం, వారానికో శంకుస్థాపన చేసుకోగలుగుతున్నాం.
- వేసవిలో దేశ ప్రజలకు చల్లబరిచే ఏసీలు మన రాష్ట్రం నుంచే సరఫరా చేసే పరిస్థితికి వచ్చాం.
- గత ప్రభుత్వం అనవసరంగా ప్రైవేటు భూములను నిషేధిత జాబితాలో పెట్టేసింది.
- కార్యాలయాల చుట్టూ తిరిగి ప్రజలు విసిగిపోతున్న పరిస్థితి ఉంది.
- భూముల విషయంలో జీరో ఎర్రర్ రికార్డులు తయారు చేయాలి.
- రోడ్లు, వంతెనలు, ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి.
- ప్రతీ మూడు నెలలకూ నిర్వహించే కలెక్టర్ల సదస్సు మంత్రులు, అధికారులకు క్వార్టర్లీ పరీక్షలు.
- ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేదు.
- పబ్లిక్ రిలేషన్స్ ఎంతో ముఖ్యమో… పబ్లిక్ డెలివరీ కూడా అంతే ముఖ్యం.
- లాస్ట్ మైల్ లో ఉండే ఉద్యోగిని కూడా మోటివేట్ చేస్తే అద్భుతంగా పని చేయగలరు.
- విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చి 0.30 పైసల మేర కొనుగోలు వ్యయం తగ్గించాం.
- మరో 0.30 పైసలు త్వరలోనే తగ్గిస్తాం… తొలిసారి ట్రూ డౌన్ చేయగలిగాం.
- గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాం… ఆన్ లైన్ లో పన్నులు కట్టారు.
- ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పదో తరగతి టాపర్ల ఫోటోలతో యాడ్ ఇచ్చాం.
- ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని చాటి చెప్పాం.
- డిమాండ్ డ్రివెన్ అగ్రికల్చర్, ఆక్వా కల్చర్ దిశగా అడుగులు వేస్తున్నాం.
- అన్ని రంగాల్లో… అన్ని వ్యవస్థల్లో ఏపీ పనితీరు బెంచ్ మార్క్ గా మారాలి.
- జిల్లాలు, కలెక్టర్ల మధ్య అభివృద్ధిలో పోటీ ఉండాలి.
- జిల్లాల్లో అమలు చేసే ఉత్తమ పద్దతులను బెస్ట్ ప్రాక్టీసెస్ మిగతా జిల్లాల్లోనూ అమలు చేస్తాం… ఆ కలెక్టర్లనే వాటికి నోడల్ ఆఫీసరుగా పెడతాం.
- సీయింగ్ ఇజ్ బిలీఫ్ అనే విధానంలో 3 రోజుల కార్యదర్శులు, 6 రోజులు హెచ్వోడీలు, 8 రోజులు కలెక్టర్లు ఫీల్డ్ కు వెళ్లాలి
- సామాజిక మాధ్యమాలను సక్రమంగా వినియోగించుకోవాలి.
విద్యా రంగంలో మార్పులు తీసుకొచ్చాం
పదవ తరగతిలో ఫలితాలు బాగొస్తే రాజకీయ నాయకులు క్రెడిట్ తీసుకుంటారు
కానీ రియల్ హీరోస్ అయిన స్టూడెంట్స్ ఫోటోలతో ప్రకటనలు ఇచ్చాం
కార్పొరేట్ సెక్టార్ చేసే పనిని ప్రభుత్వం చేసింది…దేశంలోనే ఇదొక నూతన ఒరవడి : కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి
సచివాలయంలో కొనసాగుతున్న 7వ కలెక్టర్ల సమావేశం.
కూటమి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, విజయాలు కలెక్టర్ల సదస్సులో వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
దాదాపు 100కు పైగా పథకాలు, ప్రభుత్వ సేవలు, విజయాలు వివరించిన ముఖ్యమంత్రి
- సూపర్ సిక్స్ పథకాల సూపర్ హిట్
- తల్లికి వందనం : రూ.10,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం
- స్త్రీ శక్తి : ఆగస్ట్ 15 నుంచి పథకం ప్రారంభం, మహిళలు 63.61 కోట్ల ప్రయాణాలు (మే 6 వరకు)
- విభిన్న ప్రతిభావంతుల కోసం దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం – 20.51 లక్షల ప్రయాణాలు
- దీపం 2 పథకం కింద 4 కోట్ల సిలిండర్లు.
- 269 అన్న క్యాంటీన్‌లు – 9.15 కోట్ల భోజనాలు (మే 6 నాటికి)
- అన్నదాత సుఖీభవ : 46 లక్షల మంది రైతులకు 3 విడతలు కలిపి రూ.8,985 కోట్లు జమ
- ఎన్టీఆర్ భరోసా : ఇప్పటివరకు రూ.63 వేలకోట్లకు పైగా పెన్షన్ల కోసం వ్యయం…
- మత్స్యకార సేవలో : ఏడాదికి 20 వేల చొప్పున 1.25 లక్షల మందికి రూ.250 కోట్లు
- మత్స్యకారుల కోసం జీ.వో 217 రద్దు – నీటి వనరులపై హక్కు
- ఆటో డ్రైవర్ల సేవలో : ఏడాదికి రూ.15,000… రూ.436 కోట్లు జమ, 2.90 లక్షల మందికి లబ్ది
- గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపు
- వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ
- స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు
- ఈ ఏడాది మైనారిటీ సంక్షేమానికి రూ. 3,670 కోట్లు వ్యయం
- 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనంకు రూ.51 కోట్లు
- ఇమామ్‌లకు నెలకు రూ.10,000 మౌజన్లకు రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.90 కోట్లు
- వక్ఫ్ బోర్డు పునరుద్దరణ – అన్ని వర్గాలకు ప్రాధాన్యం
- పురోహితులకు నెలకు రూ.15,000కు వేతనాల పెంపు
- నాయీ బ్రాహ్మణులకు నెలకు రూ.25,000కు వేతనాల పెంపు
- మగ్గాలున్న చేనేతలకు 200, మరమగ్గాలున్న చేనేతలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు
- జూనియర్ లాయర్లకు రూ.10,000 గౌరవ వేతనం
- మెగా డీఎస్సీ… ముఖ్యమంత్రి తొలి సంతకం. 15,941 టీచర్ పోస్టుల భర్తీ
- 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకం పూర్తి, రూ.4,500 నుంచి రూ.12,500కు స్టైఫండ్ పెంపు
- 10 వేలకుపైగా పోస్టులతో జాబ్ కేలండర్ విడుదల
- భవిష్యత్ నగరంగా అమరావతి నిర్మాణం – శాశ్వత, ఏకైక రాజధానిగా కేంద్రం గెజిట్
- ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగానికి ఊతం
- జె బ్రాండ్స్ రద్దు – నాణ్యమైన మద్యం సరఫరా- బెల్ట్ షాపుల నియంత్రణ
- అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు
- బాలింతలకు మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్లు
- చెత్త పన్ను రద్దు – దాదాపు 84 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ తొలగింపు
- ప్రతీ నెల ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’. డోర్ టు డోర్ కలెక్షన్. స్వచ్ఛ రథాలు
- రూ.861 కోట్లతో 20,060 కి.మీ పాత్ హోల్ ఫ్రీ రోడ్లు- రూ.2500 కోట్లతో రహదారుల నిర్మాణం
- విజయవాడ – మచిలీపట్నం 6 లైన్ రోడ్డుకు ఆమోదం
- మూలపేట – వైజాగ్ – కాకినాడ బీచ్ రోడ్, నాగ్పూర్ – అమరావతి హైవే నిర్మాణం
- హైదరాబాద్ – అమరావతి – చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు పచ్చజెండా
- రికార్డు స్థాయిలో బెంగుళూరు – అమరావతి హైవే పనులు
- గాడిలో పంచాయతీరాజ్ వ్యవస్థ. పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో 4,000 కి.మీ. రోడ్ల నిర్మాణం
- అడవితల్లి బాటతో గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణం, శివారు గ్రామాలకు 4జీ నెట్వర్క్
- కొత్తగా 28 పాలసీలు, పరిశ్రమలకు రాయితీలకు దేశంలో తొలి సారి ఎస్క్రో ఖాతాలు
- దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25.3 శాతం ఏపీకి – బిజినెస్ రిఫార్మర్ అవార్డు
- సీఐఐ సమ్మిట్ 538 ఒప్పందాలు. రూ.11.38 లక్షల కోట్ల పెట్టుబడులు, 13.95 లక్షల ఉద్యోగాలు
- 17 ఎస్ఐపీబీ సమావేశాల్లో రూ.11,37,222 పెట్టుబడులు, 10,01,147 లక్షల ఉద్యోగాలు
- 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్
- విశాఖ ఐటీ హబ్ – టీసీఎస్ ప్రారంభం, కాగ్నిజెంట్‌కు శంకుస్థాపన
- తిరుమల సహా దేవాలయాల సేవల్లో పెనుమార్పులు, 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు
- 15వ ఆర్ధిక సంఘం నిధుల విడుదల, 90కిపైగా సీఎస్ఎస్ పథకాల పునరుద్ధరణ
- ప్రతీ ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కుళాయి కనెక్షన్లు.
- 100 రోజుల్లోనే హంద్రీనీవా కాలువ విస్తరణ
- రాయలసీమలో అన్ని చెరువులు, ప్రాజెక్టులు నింపి సాగు, తాగునీరు
- సాగునీటి ప్రాజెక్టులకు 23 నెలల్లో రూ.24 వేల కోట్లు ఖర్చు
- శరవేగంగా పోలవరం నిర్మాణం – డయాఫ్రం వాల్ పూర్తి – విశాఖకు నీళ్లు
- రూ.2 వేల కోట్లతో పోలవరం నిర్వాసితులకు పునరావాసం
- వెలిగొండ ప్రాజెక్టుకు రూ.571 కోట్లు వ్యయం – జులై నాటికి తొలి దశ పూర్తి
- తుంగభద్ర గేట్ల మరమ్మతులు పూర్తి – ఏపీ వాటాగా రూ.55 కోట్ల కేటాయింపు
- చింతలపూడి ఎత్తిపోతల అనుమతుల్లో పురోగతి
- సాగు నీటి ప్రాజెక్టుల మరమ్మతులకు రూ.610 కోట్లతో మరమ్మతులు
- రాష్ట్ర వ్యాప్తంగా కాలువల నిర్వహణ, పూడికలతీత, లాకుల మరమ్మతులకు నిధులు
- మళ్లీ సాగునీటి సంఘాల కీలక పాత్ర- 6,047 సాగునీటి సంఘాలకు ఎన్నికలు
- రాజధానిలో క్వాంటం వ్యాలీ భవనాలకు శంకుస్థాపన
- క్వాంటమ్ రిఫరెన్స్ ఫెలిసిటీ సెంటర్ ప్రారంభం
- కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమోనియాకు శంకుస్థాపన..రెండేళ్లలో గ్రీన్ అమోనియ ఎగుమతి
- రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ, 24 గంటల్లో డబ్బులు జమ
- మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా పొగాకు, మామిడి, కోకో, ఉల్లి పంటలకు రూ.1,100 కోట్లు
- రాష్ట్ర ఆర్థికాభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28 శాతం…. పెరిగిన మూలధన వ్యయం
- రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు, నాలా చట్టం, ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు
- గేట్స్ ఫౌండేషన్, టాటా సంజీవనితో… డిజి హెల్త్ కేర్, యూనివర్సల్ హెల్త్ పాలసీ
- విద్యా వ్యవస్థలో పెనుమార్పులు – మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్
- పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాల సాధన – ముస్తాబు వంటి వినూత్న కార్యక్రమాలు
- డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్, పారదర్శకంగా బదిలీలు
- గాడిన పడిన విద్యుత్ రంగం – ట్రూ డౌన్ కు అంకురార్పణ
- యూనిట్ కాస్ట్ 0.30 పైసలు తగ్గింపు – మరో 0.30 పైసలు తగ్గింపునకు లక్ష్యం
- ఈవీలకు ప్రోత్సాహం -వాహనాలకు గ్రీన్ టాక్స్ తగ్గింపు
- 90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఒప్పందాలు
- 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్
- సోలార్ రూఫ్ టాప్ లో బీసీలకు రూ.20 వేల అదనపు సాయం
- స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, డేటా డ్రివెన్ డెసిషన్స్, విపత్తుల నిర్వహణ,
- పీ4 ద్వారా పేదరిక నిర్మూలన – 2 లక్షల కుటుంబాలకు చేయూత
- మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 1035 సేవలు
- విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్ల అభివృద్ధి
- కేంద్రంతో సమన్వయం – దాదాపు 90 కేంద్ర పథకాల పునరుద్దరణ
- రుణాల రీ షెడ్యూల్ తో వడ్డీ తగ్గింపు
- రాష్ట్రానికి సెమీ కండక్టర్, డిఫెన్స్ పరిశ్రమలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11440 కోట్లతో కేంద్ర సాయం
- వేగంగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్ ల నిర్మాణం
- జూలై నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తి
- లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు – విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు గెజిట్
- ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటు
- లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తలు – మరో 5 లక్షల మంది లక్ష్యం
- శ్రీ సిటీలో రూ. 5 వేల కోట్లతో ఎల్ జీ, రూ.1000 కోట్లతో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన
- రూ.5,400కోట్లతో రెన్యూ ఎనర్జీ సంస్థకు శంకుస్థాపన
- అనకాపల్లిలో రూ.1.35 లక్షల కోట్లతో ఆర్సెలార్ రూ ప్లాంట్‌కు శంకుస్థాపన
- విశాఖపట్నంలో రూ.1.35 లక్షల కోట్లతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ హబ్‌కు శంకుస్థాపన
- రూ.1 లక్షల కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు అడుగులు
- 23 నెలల్లో 5.5 లక్షల ఇళ్లు పేదలకు అందజేత..మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంకల్పం
- 50 వేల మంది కాంట్రాక్టర్లకు రూ.2 వేల కోట్లు చెల్లింపులు
- ఉద్యోగులకు 23 నెలల్లో రూ.21 వేల కోట్ల బకాయిలు చెల్లింపులు
- అగ్నిమాపక శాఖ బలోపేతం – రూ. 34 కోట్లతో కొత్త పరికరాలు, వాహనాలు
- తగ్గిన క్రైమ్ రేట్ – మహిళల భద్రతకు ప్రాధాన్యత
- గంజాయి-డ్రగ్స్ పై ఉక్కుపాదం- ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
అమరావతి
అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లాలని… రిజల్ట్ ఓరియేంటేషనుతో పని చేయాలని కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం.
కలెక్టర్లకు సూచనలు చేస్తూ కీలక కామెంట్లు చేసిన ముఖ్యమంత్రి.
చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి
- ఆఫీస్ టెల్స్ యూ డేటా… ఫీల్డ్ టెల్స్ యూ ట్రూత్.. దీన్ని గుర్తు పెట్టుకోవాలి.
- స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఈజ్ నాట్ స్లోగన్… గవర్నెన్స్ డిసైడ్స్ ద స్పీడ్ ఆఫ్ గ్రోత్.
- ఫైల్స్ షుడ్ నాట్ మూవ్… రిజల్ట్స్ షుడ్ మూవ్.. అప్పుడే ఫలితాలు వస్తాయి.
స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ స్లోగన్ మాత్రమే కాదు… రాష్ట్ర వృద్ధిలో వేగం చూపించేలా ఉండాలి
ఫైల్స్‌లో కాదు… ఫలితాల్లో మార్పు కనిపించాలి : కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రతీ అధికారి, ప్రతీ కలెక్టర్‌కు ఫీల్డ్ విజిట్ తప్పని సరి
క్షేత్రస్థాయి పర్యటనతోనే వాస్తవాలు తెలుస్తాయి : కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
మనం మాటల్లో చెప్పడం కాదు… ప్రజలకు మార్పు స్పష్టంగా కనబడాలి
బెస్ట్ ప్రాక్టీసెస్‌లో రాష్ట్రమే ఒక బెంచ్ మార్క్‌గా కనబడాలి
పెట్టుబడులు, వృద్ధిలో కలెక్టర్లు పోటీ పడాలి… ఒకరికొకరు సహకరించుకోవాలి : కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి
రాష్ట్రంలో జీఎస్డీపీ లక్ష్యాలు, వృద్ధిరేటు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ల సదస్సులో చర్చ.
జీఎస్డీపీ లక్ష్యాలపై కలెక్టర్లు, కార్యదర్శులు, హెచ్ఓడీలకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…
- జీఎస్డీపీ విషయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ప్రజలపై ప్రభావం చూపిస్తాయి.
- గిరిజన ప్రాంతంలో ఉంటూనే పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో అభివృద్ధి వేర్వేరుగా ఉంది.
- అల్లూరి జిల్లాలో కాఫీ పంటకు విలువ జోడింపుతో జీఎస్డీపీ ఎక్కువగా ఉంది.
- అభివృద్ధిపై దృష్టి సారించి ప్రగతి సాధనకు కీలకం కావాలి. సర్వీస్ సెక్టార్ పెరగాలి.
- దేశ జీడీపీలో ఏపీ 10 శాతం మేర వ్యవసాయ ఉత్పత్తుల వాటాను కలిగి ఉంది.
- కొన్ని జిల్లాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి.. వాటికి సంబంధించిన ప్లాంట్లు వస్తే మరింత అభివృద్ధికి ఆస్కారం ఉంది.
- జీఎస్డీపీ గ్రోత్ విషయంలో కలెక్టర్లు ఎలా పని చేస్తున్నారనే అంశంపై అధ్యయనం చేస్తు్న్నాం.
- నూతన ఆవిష్కరణలతో అభివృద్ధి ఎలా సాధించాలన్నదానిపై జిల్లా కలెక్టర్లు ఆలోచనలు చేయండి.
- రాష్ట్ర స్థాయిలో కలెక్టర్లకు పోటీ పెట్టినట్టే… జిల్లా స్థాయిలో నియోజకవర్గాల మధ్య పోటీ పెట్టండి.
- ఫీల్డ్ లెవల్ ఆఫీసర్లకు చాలా అనుభవం ఉంటుంది.. వాళ్ల దగ్గర చాలా సమాచారం ఉంటుంది.
- క్షేత్ర స్థాయి అధికారులను సమర్థంగా వినియోగించుకుంటే అభివృద్ధి వేగంగా జరుగుతుంది.. సంక్షేమం చక్కగా అందుతుంది… వినూత్నమైన ఆలోచనలను అమలు చేసేందుకు అవకాశం దక్కుతుంది.
- సూర్యలంక, మంగినపూడి, విశాఖ, శ్రీకాకుళం, మైపాడు తదితర ప్రాంతాల్లో బీచ్ ఫ్రంట్లను అభివృద్ధి చేస్తే స్థానికులకు అవకాశాలు పెరుగుతాయి.
- కొత్త జాతీయ రహదారులు కొత్త అవకాశాల్ని సృష్టిస్తాయి… లాజిస్టిక్స్ హబ్ లను ఏర్పాటు చేసుకోవచ్చు… టౌన్ షిప్ లను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది.
- విజన్ యూనిట్లను జిల్లా కలెక్టర్లు సమర్ధంగా వినియోగించుకోవాలి.
- గతంలో పెద్ద జిల్లాల్లో 21 నియోజకవర్గాలను పర్యవేక్షించాల్సి వచ్చేది.
- కలెక్టర్లు జిల్లా పర్యటనకు వెళ్తే ప్రయాణానికే ఓ పూట పట్టేంది.
- ఇప్పుడు ప్రతీ జిల్లా కలెక్టర్ పరిధిలో కేవలం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి.
- గతంతో పోల్చుకుంటే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.
- గతానికంటే మెరుగైన పనితీరు కనబర్చడానికి… అభివృద్ధి చేయడానికి, సంక్షేమం అందించడానికి ఇప్పుడు కలెక్టర్లకు అవకాశాలు ఎక్కువ.
బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి చెందాలి
రాష్ట్రంలో రోజుకో ఎంఓయూ… వారానికో శంకుస్థాపన
వేగంగా పనిచేయాలి… అంతే వేగంగా అభివృద్ధి చూపించాలి
స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ స్లోగన్‌కే పరిమితం కాకూడదు
పబ్లిక్ రిలేషన్స్ ఎంత ముఖ్యమో… పబ్లిక్ డెలివరీ అంతే ముఖ్యం
వినూత్నంగా ఆలోచిస్తే నిధుల కొరతను అధిగమించవచ్చు
జిల్లా కలెక్టర్ల మధ్య అభివృద్ధిలో పోటీ ఉండాలి
కాలేజీ రోజుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ డ్రైవ్ చేశా… ఇప్పుడు ఆ సంస్థను ఏపీకి తెచ్చాం
7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం
అమరావతి, మే 7:- అభివృద్ధి సహా వివిధ రంగాల్లో బెంచ్ మార్క్ సెట్ చేసేలా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రెండేళ్ల క్రితం రాష్ట్రం గురించి ఏం మాట్లాడుకునేవారో… ఇప్పుడేం మాట్లాడుకుంటున్నారో ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. రాష్ట్రాభివృద్ధికి గ్రామస్థాయి ఉద్యోగులను కూడా మోటివేట్ చేసే బాధ్యతను జిల్లా కలెక్టర్లే తీసుకోవాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో రెండు రోజులపాటు జరిగే 7వ కలెక్టర్ల కాన్ఫరెన్సు గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”గత పాలకుల నుంచి రూ. 9.74 లక్షల కోట్ల అప్పులు ప్రభుత్వానికి సంక్రమించాయి. 94 కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి రూ.10 వేల కోట్లను గత ప్రభుత్వం డైవర్ట్ చేసింది. రూ.1.30 లక్షల కోట్ల బిల్లులు కూడా గత పాలకులు మనపై రుద్దారు. గత పాలకుల నిర్వాకం వల్ల రాష్ట్రం గుంతలు పడిన రోడ్లతో విధ్వంసమైంది. అందరి సహకారంతో అలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కి… వ్యవస్థలను గాడిలో పెట్టగలిగాం. ప్రజా ప్రతినిధులు-అధికారుల కలయికే ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత. ఇప్పుడు సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం. జీవన ప్రమాణాలు పెంచేలా పాలన సాగిస్తున్నాం. వివిధ పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. ప్రజల సంతృప్తి స్థాయిని కొలమానంగా పెట్టుకుని పాలన అందిస్తున్నాం.”అని ముఖ్యమంత్రి చెప్పారు.
W-D-WC.. ఇదో సైకిల్
“అధికారులు క్షేత్రస్థాయిలో బాగా పనిచేసిన చోట ప్రజల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. మంత్రుల నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధి, ఉద్యోగి వరకూ అంతా బాధ్యతగా ఉండాలి. వచ్చిన ఫిర్యాదులు వందశాతం పరిష్కారం కావాల్సిందే. ఆర్థికేతర ఫిర్యాదులను పరిష్కరించకుండా.. కొందరు పైకి కిందకు ఫైళ్లు తిప్పుతున్నారు… వాటిని తక్షణం పరిష్కరించాలి. ఆర్థికపరమైన ఫిర్యాదుల గురించి కూడా విచారణ చేసి సరైన వాటిని పరిష్కరించాలి. 2027 మార్చి నాటికల్లా రెవెన్యూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన కావాలి. సమస్య పరిష్కారం కోసం వినూత్నంగా ఆలోచనలు చేస్తే సుపరిపాలన అందించినట్టే. డబ్బులు లేవనడం కాదు… సంపద సృష్టికి పని చేయాలి… చేద్దాం. వెల్ఫేర్, డెవలప్మెంట్, వెల్త్ క్రియేషన్ అనేది ఓ సైకిల్. అభివృద్ధి లేకుండా సంపద లేదు. సంపద లేకుండా సంక్షేమం లేదు. సూపర్ సిక్స్ పథకాలతో భద్రత, భరోసా కల్పించాం. పీ4తో ఆర్ధిక ప్రమాణాలు పెంచుతున్నాం. 26 కొత్త పాలసీలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ అంటే నమ్మకాన్ని కల్పించాం. రాయల్ ఎన్ ఫీల్డ్ వాహనాన్ని డ్రైవ్ చేయడమనేది గర్వంగా ఉండేది. కాలేజీ రోజుల్లో ఎన్ ఫీల్డ్ డ్రైవ్ చేయడాన్ని గొప్పగా ఫీలయ్యేవాళ్లం. అలాంటి రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థను ఏపీకి తెచ్చాం. రూ. 23 లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకున్నాం. ఇవి సాకారమైతే 24 లక్షల మేర ఉద్యోగాలు వస్తాయి. గ్రీన్ ఎనర్జీతో పాటు గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తి దిశగా ముందుకు వెళ్తున్నాం. డేటా, ఏఐ, క్వాంటం లాంటి టెక్నాలజీలకు ఏపీ కేంద్రంగా మారనుంది. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ లాంటి దిగ్గజ కంపెనీలు ఏపీకి వచ్చాయి. రోజుకో ఒప్పందం, వారానికో శంకుస్థాపన చేసుకోగలుగుతున్నాం. వేసవిలో దేశ ప్రజలను చల్లబరిచే ఏసీలు మన రాష్ట్రం నుంచే సరఫరా చేసే పరిస్థితికి వచ్చాం.”అని సీఎం వివరించారు.
బెస్ట్ ప్రాక్టీసెస్ అమలు చేసే కలెక్టర్లే నోడల్ ఆఫీసర్లు
“గత ప్రభుత్వం అనవసరంగా ప్రైవేటు భూములను నిషేధిత జాబితాలో పెట్టేసింది. కార్యాలయాల చుట్టూ తిరిగి ప్రజలు విసిగిపోతున్న పరిస్థితి ఉంది. భూముల విషయంలో జీరో ఎర్రర్ రికార్డులు తయారు చేయాలి. రోడ్లు, వంతెనలు, ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి. ప్రతీ మూడు నెలలకూ నిర్వహించే కలెక్టర్ల సదస్సు మంత్రులు, అధికారులకు క్వార్టర్లీ పరీక్షలు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేదు. పబ్లిక్ రిలేషన్స్ ఎంతో ముఖ్యమో… పబ్లిక్ డెలివరీ కూడా అంతే ముఖ్యం. లాస్ట్ మైల్ లో ఉండే ఉద్యోగిని కూడా మోటివేట్ చేస్తే అద్భుతంగా పని చేయగలరు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చి 0.30 పైసల మేర కొనుగోలు వ్యయం తగ్గించాం. మరో 0.30 పైసలు త్వరలోనే తగ్గిస్తాం… తొలిసారి ట్రూ డౌన్ చేయగలిగాం. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాం… ఆన్ లైన్ లో పన్నులు కట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పదో తరగతి టాపర్ల ఫోటోలతో యాడ్ ఇచ్చాం. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని చాటి చెప్పాం. డిమాండ్ డ్రివెన్ అగ్రికల్చర్, ఆక్వా కల్చర్ దిశగా అడుగులు వేస్తున్నాం. అన్ని రంగాల్లో… అన్ని వ్యవస్థల్లో ఏపీ పనితీరు బెంచ్ మార్క్ గా మారాలి. జిల్లాలు, కలెక్టర్ల మధ్య అభివృద్ధిలో పోటీ ఉండాలి. జిల్లాల్లో అమలు చేసే ఉత్తమ పద్దతులను బెస్ట్ ప్రాక్టీసెస్ మిగతా జిల్లాల్లోనూ అమలు చేస్తాం… ఆ కలెక్టర్లనే వాటికి నోడల్ ఆఫీసరుగా పెడతాం. సీయింగ్ ఇజ్ బిలీఫ్ అనే విధానంలో 3 రోజుల కార్యదర్శులు, 6 రోజులు హెచ్వోడీలు, 8 రోజులు కలెక్టర్లు ఫీల్డ్ కు వెళ్లాలి. సామాజిక మాధ్యమాలను సక్రమంగా వినియోగించుకోవాలి. రిజల్ట్ ఓరియేంటేషనుతో ప్రతి ఒక్కరూ పని చేయాలి. ఆఫీస్ టెల్స్ యూ డేటా… ఫీల్డ్ టెల్స్ యూ ట్రూత్.. దీన్ని గుర్తు పెట్టుకోవాలి. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఈజ్ నాట్ స్లోగన్… గవర్నెన్స్ డిసైడ్స్ ద స్పీడ్ ఆఫ్ గ్రోత్. ఫైల్స్ షుడ్ నాట్ మూవ్… రిజల్ట్స్ షుడ్ మూవ్.. అప్పుడే ప్రజలకు మంచి సేవలు అందుతాయి.”అని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. 7వ కలెక్టర్ల కాన్ఫరెన్సులో మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు
100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు
23 నెలల్లో ప్రజా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను కలెక్టర్ల కాన్ఫరెన్సులో వివరించిన సీఎం చంద్రబాబు
అమరావతి, మే 7: రాష్ట్ర సచివాలయంలో జరిగిన 7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో ప్రారంభోపన్యాసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు.. అధికారులకు వివిధ అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎంత కష్టపడి పథకాలను.. కార్యక్రమాలను అమలు చేస్తున్నామనే విషయాన్ని ముఖ్యమంత్రి వివరించారు. జరుగుతోన్న పరిణామాలను గమనిస్తూ.. రాష్ట్రంలోని పరిస్థితులను అంచనా వేసుకుంటూ ప్రభుత్వం పాలన ఏ విధంగా సాగిస్తుందోననే అంశాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. ఈ క్రమంలో 23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన దాదాపు 100 పథకాలు, కార్యక్రమాలు వంటి వాటిని సీఎం వివరించారు.
దాదాపు 100కు పైగా పథకాలు, ప్రభుత్వ సేవలు, విజయాలు వివరించిన ముఖ్యమంత్రి
- తల్లికి వందనం : రూ.10,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం
- స్త్రీ శక్తి : ఆగస్ట్ 15 నుంచి పథకం ప్రారంభం, మహిళలు 63.61 కోట్ల ప్రయాణాలు (మే 6 వరకు)
- విభిన్న ప్రతిభావంతుల కోసం దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం – 20.51 లక్షల ప్రయాణాలు
- దీపం 2 పథకం కింద 4 కోట్ల సిలిండర్లు.
- 269 అన్న క్యాంటీన్‌లు – 9.15 కోట్ల భోజనాలు (మే 6 నాటికి)
- అన్నదాత సుఖీభవ : 46 లక్షల మంది రైతులకు 3 విడతలు కలిపి రూ.8,985 కోట్లు జమ
- ఎన్టీఆర్ భరోసా : ఇప్పటివరకు రూ.63 వేలకోట్లకు పైగా పెన్షన్ల కోసం వ్యయం…
- మత్స్యకార సేవలో : ఏడాదికి 20 వేల చొప్పున 1.25 లక్షల మందికి రూ.250 కోట్లు
- మత్స్యకారుల కోసం జీ.వో 217 రద్దు – నీటి వనరులపై హక్కు
- ఆటో డ్రైవర్ల సేవలో : ఏడాదికి రూ.15,000… రూ.436 కోట్లు జమ, 2.90 లక్షల మందికి లబ్ది
- గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపు
- వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ
- స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు
- ఈ ఏడాది మైనారిటీ సంక్షేమానికి రూ. 3,670 కోట్లు వ్యయం
- 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనంకు రూ.51 కోట్లు
- ఇమామ్‌లకు నెలకు రూ.10,000 మౌజన్లకు రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.90 కోట్లు
- వక్ఫ్ బోర్డు పునరుద్దరణ – అన్ని వర్గాలకు ప్రాధాన్యం
- పురోహితులకు నెలకు రూ.15,000కు వేతనాల పెంపు
- నాయీ బ్రాహ్మణులకు నెలకు రూ.25,000కు వేతనాల పెంపు
- మగ్గాలున్న చేనేతలకు 200, మరమగ్గాలున్న చేనేతలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు
- జూనియర్ లాయర్లకు రూ.10,000 గౌరవ వేతనం
- మెగా డీఎస్సీ… ముఖ్యమంత్రి తొలి సంతకం. 15,941 టీచర్ పోస్టుల భర్తీ
- 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకం పూర్తి, రూ.4,500 నుంచి రూ.12,500కు స్టైఫండ్ పెంపు
- 10 వేలకుపైగా పోస్టులతో జాబ్ కేలండర్ విడుదల
- భవిష్యత్ నగరంగా అమరావతి నిర్మాణం – శాశ్వత, ఏకైక రాజధానిగా కేంద్రం గెజిట్
- ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగానికి ఊతం
- జె బ్రాండ్స్ రద్దు – నాణ్యమైన మద్యం సరఫరా- బెల్ట్ షాపుల నియంత్రణ
- అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు
- బాలింతలకు మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్లు
- చెత్త పన్ను రద్దు – దాదాపు 84 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ తొలగింపు
- ప్రతీ నెల ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’. డోర్ టు డోర్ కలెక్షన్. స్వచ్ఛ రథాలు
- రూ.861 కోట్లతో 20,060 కి.మీ పాత్ హోల్ ఫ్రీ రోడ్లు- రూ.2500 కోట్లతో రహదారుల నిర్మాణం
- విజయవాడ – మచిలీపట్నం 6 లైన్ రోడ్డుకు ఆమోదం
- మూలపేట – వైజాగ్ – కాకినాడ బీచ్ రోడ్, నాగ్పూర్ – అమరావతి హైవే నిర్మాణం
- హైదరాబాద్ – అమరావతి – చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు పచ్చజెండా
- రికార్డు స్థాయిలో బెంగుళూరు – అమరావతి హైవే పనులు
- గాడిలో పంచాయతీరాజ్ వ్యవస్థ. పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో 4,000 కి.మీ. రోడ్ల నిర్మాణం
- అడవితల్లి బాటతో గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణం, శివారు గ్రామాలకు 4జీ నెట్వర్క్
- కొత్తగా 28 పాలసీలు, పరిశ్రమలకు రాయితీలకు దేశంలో తొలి సారి ఎస్క్రో ఖాతాలు
- దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25.3 శాతం ఏపీకి – బిజినెస్ రిఫార్మర్ అవార్డు
- సీఐఐ సమ్మిట్ 538 ఒప్పందాలు. రూ.11.38 లక్షల కోట్ల పెట్టుబడులు, 13.95 లక్షల ఉద్యోగాలు
- 17 ఎస్ఐపీబీ సమావేశాల్లో రూ.11,37,222 పెట్టుబడులు, 10,01,147 లక్షల ఉద్యోగాలు
- 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్
- విశాఖ ఐటీ హబ్ – టీసీఎస్ ప్రారంభం, కాగ్నిజెంట్‌కు శంకుస్థాపన
- తిరుమల సహా దేవాలయాల సేవల్లో పెనుమార్పులు, 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు
- 15వ ఆర్ధిక సంఘం నిధుల విడుదల, 90కిపైగా సీఎస్ఎస్ పథకాల పునరుద్ధరణ
- ప్రతీ ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కుళాయి కనెక్షన్లు.
- 100 రోజుల్లోనే హంద్రీనీవా కాలువ విస్తరణ
- రాయలసీమలో అన్ని చెరువులు, ప్రాజెక్టులు నింపి సాగు, తాగునీరు
- సాగునీటి ప్రాజెక్టులకు 23 నెలల్లో రూ.24 వేల కోట్లు ఖర్చు
- శరవేగంగా పోలవరం నిర్మాణం – డయాఫ్రం వాల్ పూర్తి – విశాఖకు నీళ్లు
- రూ.2 వేల కోట్లతో పోలవరం నిర్వాసితులకు పునరావాసం
- వెలిగొండ ప్రాజెక్టుకు రూ.571 కోట్లు వ్యయం – జులై నాటికి తొలి దశ పూర్తి
- తుంగభద్ర గేట్ల మరమ్మతులు పూర్తి – ఏపీ వాటాగా రూ.55 కోట్ల కేటాయింపు
- చింతలపూడి ఎత్తిపోతల అనుమతుల్లో పురోగతి
- సాగు నీటి ప్రాజెక్టుల మరమ్మతులకు రూ.610 కోట్లతో మరమ్మతులు
- రాష్ట్ర వ్యాప్తంగా కాలువల నిర్వహణ, పూడికలతీత, లాకుల మరమ్మతులకు నిధులు
- మళ్లీ సాగునీటి సంఘాల కీలక పాత్ర- 6,047 సాగునీటి సంఘాలకు ఎన్నికలు
- రాజధానిలో క్వాంటం వ్యాలీ భవనాలకు శంకుస్థాపన
- క్వాంటమ్ రిఫరెన్స్ ఫెలిసిటీ సెంటర్ ప్రారంభం
- కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమోనియాకు శంకుస్థాపన..రెండేళ్లలో గ్రీన్ అమోనియ ఎగుమతి
- రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ, 24 గంటల్లో డబ్బులు జమ
- మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా పొగాకు, మామిడి, కోకో, ఉల్లి పంటలకు రూ.1,100 కోట్లు
- రాష్ట్ర ఆర్థికాభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28 శాతం…. పెరిగిన మూలధన వ్యయం
- రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు, నాలా చట్టం, ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు
- గేట్స్ ఫౌండేషన్, టాటా సంజీవనితో… డిజి హెల్త్ కేర్, యూనివర్సల్ హెల్త్ పాలసీ
- విద్యా వ్యవస్థలో పెనుమార్పులు – మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్
- పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాల సాధన – ముస్తాబు వంటి వినూత్న కార్యక్రమాలు
- డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్, పారదర్శకంగా బదిలీలు
- గాడిన పడిన విద్యుత్ రంగం – ట్రూ డౌన్ కు అంకురార్పణ
- యూనిట్ కాస్ట్ 0.30 పైసలు తగ్గింపు – మరో 0.30 పైసలు తగ్గింపునకు లక్ష్యం
- ఈవీలకు ప్రోత్సాహం -వాహనాలకు గ్రీన్ టాక్స్ తగ్గింపు
- 90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఒప్పందాలు
- 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్
- సోలార్ రూఫ్ టాప్ లో బీసీలకు రూ.20 వేల అదనపు సాయం
- స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, డేటా డ్రివెన్ డెసిషన్స్, విపత్తుల నిర్వహణ,
- పీ4 ద్వారా పేదరిక నిర్మూలన – 2 లక్షల కుటుంబాలకు చేయూత
- మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 1035 సేవలు
- విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్ల అభివృద్ధి
- కేంద్రంతో సమన్వయం – దాదాపు 90 కేంద్ర పథకాల పునరుద్దరణ
- రుణాల రీ షెడ్యూల్ తో వడ్డీ తగ్గింపు
- రాష్ట్రానికి సెమీ కండక్టర్, డిఫెన్స్ పరిశ్రమలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11440 కోట్లతో కేంద్ర సాయం
- వేగంగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్ ల నిర్మాణం
- జూలై నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తి
- లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు – విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు గెజిట్
- ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటు
- లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తలు – మరో 5 లక్షల మంది లక్ష్యం
- శ్రీ సిటీలో రూ. 5 వేల కోట్లతో ఎల్ జీ, రూ.1000 కోట్లతో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన
- రూ.5,400కోట్లతో రెన్యూ ఎనర్జీ సంస్థకు శంకుస్థాపన
- అనకాపల్లిలో రూ.1.35 లక్షల కోట్లతో ఆర్సెలార్ రూ ప్లాంట్‌కు శంకుస్థాపన
- విశాఖపట్నంలో రూ.1.35 లక్షల కోట్లతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ హబ్‌కు శంకుస్థాపన
- రూ.1 లక్షల కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు అడుగులు
- 23 నెలల్లో 5.5 లక్షల ఇళ్లు పేదలకు అందజేత..మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంకల్పం
- 50 వేల మంది కాంట్రాక్టర్లకు రూ.2 వేల కోట్లు చెల్లింపులు
- ఉద్యోగులకు 23 నెలల్లో రూ.21 వేల కోట్ల బకాయిలు చెల్లింపులు
- అగ్నిమాపక శాఖ బలోపేతం – రూ. 34 కోట్లతో కొత్త పరికరాలు, వాహనాలు
- తగ్గిన క్రైమ్ రేట్ – మహిళల భద్రతకు ప్రాధాన్యత
- గంజాయి-డ్రగ్స్ పై ఉక్కుపాదం- ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
మంత్రుల సింగపూర్ పర్యటనపై జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఇచ్చిన ప్రజెంటేషన్ తదితర అంశాలపై సీఎం దిశానిర్దేశం
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…
- నేర్చుకోవటం అనేది నిరంతర ప్రక్రియ, అత్యుత్తమ విధానాలు ఎక్కడున్నా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
- సింగపూర్ లో అనుసరిస్తున్న పాలనా విధానాలు అక్కడి ప్రజల విశ్వాసాన్ని దక్కించుకున్నాయి.
- సింగపూర్ లోని అత్యుత్తమ విధానాలను తీసుకుని ఓ జిల్లాను మోడల్ గా అభివృద్ధి చేద్దాం.
- సింగపూర్ విధానాల అమలుకు 90 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేసి పర్యవేక్షణ చేయాలి.
- నేను కాదు మనం అనే విధానంలో ముందుకు వెళ్తాం… ఈ విధానం ఇవాళ్టీ నుంచి నాతో మొదలవుతుంది.
ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్లు
నేను కాదు… మనం
క్షేత్ర స్థాయి ఉద్యోగుల అనుభవాన్ని వినియోగించుకోవాలి
సింగపూర్ ఉత్తమ విధానాలను ఓ జిల్లాలో అమలు చేద్దాం
టూరిజం అభివృద్ధి చేసిన జిల్లాకు అత్యధిక ఆదాయం
7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు
అమరావతి, మే 7: టీమ్ వర్క్‌తోనే అభివృద్ధి జరుగుతుందని… నేను అని కాకుండా.. మనం అనే ఆలోచన విధానం అందరిలో రావాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇక నుంచి తాను కూడా నేను అనే పదాన్ని పక్కన పెట్టి మనం అనే పదాన్ని ఉపయోగిస్తానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన 7వ కలెక్టర్ల కాన్ఫరెన్సులో వివిధ అంశాలపై చర్చ జరిగింది. దీంట్లో భాగంగా జీఎస్డీపీ గ్రోత్, జిల్లాల వారీగా జీఎస్డీపీ అంచనాలు, సింగపూర్ దేశంలో మంత్రులకు ట్రైనింగ్ వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”నేర్చుకోవటం అనేది నిరంతర ప్రక్రియ, అత్యుత్తమ విధానాలు ఎక్కడున్నా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. సింగపూర్ దేశంలో అనుసరిస్తున్న పాలనా విధానాలు అక్కడి ప్రజల విశ్వాసాన్ని దక్కించుకున్నాయి. సింగపూర్ అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను తీసుకుని ఓ జిల్లాను మోడల్ గా అభివృద్ధి చేద్దాం. సింగపూర్ విధానాల అమలుకు 90 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేసి పర్యవేక్షణ చేపట్టాలి. సింగపూర్ దేశంలో నేను కాదు.. మనం అనే విధానాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో కూడా నేను కాదు మనం అనే విధానాన్నే అవలంభిద్దాం. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినా… సంక్షేమ, అభివృద్ధి జరగుతున్నా.. అందరి కృషి వల్లే సాధ్యమైంది. కలిసి కట్టుగా పని చేస్తే… ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకుంటే ప్రభుత్వం మరింత విజయవంతంగా సేవలు అందించగలదు. నేను కాదు మనం అనే విధానాన్ని నాతో ప్రారంభిస్తున్నా. ప్రతి ఒక్కరూ ఇదే తరహాలో ఆలోచన చేయాలి. జీఎస్డీపీ విషయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ప్రజలపై ప్రభావం చూపిస్తాయి. గిరిజన ప్రాంతంలో ఉంటూనే పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో అభివృద్ధి వేర్వేరుగా ఉంది. అల్లూరి జిల్లాలో కాఫీ పంటకు విలువ జోడింపుతో జీఎస్డీపీ ఎక్కువగా ఉంది. అభివృద్ధిపై దృష్టి సారించాలి… ప్రగతి సాధనలో కీలకంగా వ్యవహరించాలి. సర్వీస్ సెక్టార్ మరింతగా పెరగాలి. దేశ జీడీపీలో ఏపీ 10 శాతం మేర వ్యవసాయ ఉత్పత్తుల వాటాను కలిగి ఉంది. కొన్ని జిల్లాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి.. వాటికి సంబంధించిన ప్లాంట్లు వస్తే మరింత అభివృద్ధికి ఆస్కారం ఉంది. జీఎస్డీపీ గ్రోత్ విషయంలో కలెక్టర్లు ఎలా పని చేస్తున్నారనే అంశంపై అధ్యయనం చేస్తు్న్నాం. నూతన ఆవిష్కరణలతో అభివృద్ధి ఎలా సాధించాలన్నదానిపై జిల్లా కలెక్టర్లు ఆలోచనలు చేయండి. అన్నమయ్య జిల్లా కలెక్టరే దీనికి ఉదాహరణ. బెస్ట్ పాలసీల అమల్లో కలెక్టర్లు పోటీలు పడాలి. రాష్ట్ర స్థాయిలో కలెక్టర్లకు పోటీ పెట్టినట్టే… జిల్లా స్థాయిలో నియోజకవర్గాల మధ్య పోటీ పెట్టండి. ఫీల్డ్ లెవల్ ఆఫీసర్లకు చాలా అనుభవం ఉంటుంది.. వాళ్ల దగ్గర చాలా సమాచారం ఉంటుంది. క్షేత్ర స్థాయి అధికారులను సమర్థంగా వినియోగించుకుంటే అభివృద్ధి వేగంగా జరుగుతుంది.. సంక్షేమం చక్కగా అందుతుంది… వినూత్నమైన ఆలోచనలను అమలు చేసేందుకు అవకాశం దక్కుతుంది. సూర్యలంక, మంగినపూడి, విశాఖ, శ్రీకాకుళం, మైపాడు తదితర ప్రాంతాల్లో బీచ్ ఫ్రంట్లు అభివృద్ధి చేస్తే స్థానికులకు అవకాశాలు పెరుగుతాయి. కొత్త జాతీయ రహదారులు కొత్త అవకాశాల్ని సృష్టిస్తాయి… లాజిస్టిక్స్ హబ్ లను ఏర్పాటు చేసుకోవచ్చు… టౌన్ షిప్ లను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. విజన్ యూనిట్లను జిల్లా కలెక్టర్లు సమర్ధంగా వినియోగించుకోవాలి. గతంలో పెద్ద జిల్లాల్లో 21 నియోజకవర్గాలను పర్యవేక్షించాల్సి వచ్చేది. కలెక్టర్లు జిల్లా పర్యటనకు వెళ్తే ప్రయాణానికే ఓ పూట పట్టేది. ఇప్పుడు ప్రతీ జిల్లా కలెక్టర్ పరిధిలో కేవలం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. గతానికంటే మెరుగైన పనితీరు కనబర్చడానికి… అభివృద్ధి చేయడానికి, సంక్షేమం అందించడానికి ఇప్పుడు కలెక్టర్లకు అవకాశాలు ఎక్కువ.”అని సీఎం వివరించారు.
నేను కాదు…మనం
టీమ్ వర్క్‌తోనే అభివృద్ధి జరుగుతుంది. మనం అనే ఆలోచనా విధానం అందరిలో రావాలి
నేను అనే పదాన్ని పక్కన పెట్టి మనం అనే పదం ఉపయోగిద్దాం : కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
బిజినెస్ రిఫార్మర్ అవార్డు సాధించిన ముఖ్యమంత్రికి స్టాండింగ్ ఓవేషన్ తో గౌరవం
మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు ఇలాంటి అవార్డులు రావాలి: సీఎం చంద్రబాబు
ఈ అవార్డును టీమ్ ఏపీకి అంకితం: ముఖ్యమంత్రి
అమరావతి, మే 7: బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ – 2025 అవార్డు సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ అభినందనలు తెలిపింది. గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబుకు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”మంత్రులు, సీఎస్ మొదలుకుని… గ్రామ స్థాయి అధికారి వరకు పని చేయడం వల్లే ఈ అవార్డు దక్కింది.బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం మనందరి సమిష్టి కృషి. రెండేళ్ల క్రితం రాష్ట్రం గురించి ఏం మాట్లాడారు… ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు అనే దానికి ఈ అవార్డు ఉదాహరణ. గతంలో ఇలాంటి అవార్డులు తీసుకోవడానికి ఇష్టపడేవాడిని కాదు… కానీ ఇప్పుడు ఇలాంటి అవార్డులు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను. ఎన్ని అవార్డులు వస్తే… మన రాష్ట్రానికి అంత గుర్తింపు దక్కుతుంది… మరిన్ని పెట్టుబడులు వస్తాయి. అందుకే మరిన్ని అవార్డులను మనం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ అవార్డును టీమ్ ఏపీకి అంకితం చేస్తున్నాను.”అని ముఖ్యమంత్రి చెప్పారు.
జిల్లా కలెక్టర్ల సమావేశంలో గ్లోబల్ బెస్టు లాజిస్టిక్స్ అంశంపై ఐఅండ్ఐ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబు ప్రెజెంటేషన్ ఇస్తూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పోర్టులకు అదనంగా మరో 7పోర్టులను అభివృద్ధి చేయడం జరుగుతోందని వాటికి అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను కోరారు.జాతీయ రహదారులకు సంబంధించి మాట్లాడుతూ 2025-26లో రాష్ట్రంలో 24వేల 117 కోట్ల రూ.ల విలువైన 969 కి.మీ.ల పొడవైన 39 పనులు పూర్తయినట్టు వివరించారు. 2026-27లో 30వేల 781 కోట్ల రూపాయల విలువైన 1467 కి.మీ.ల పొడవైన 79 పనులు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. అదే విధంగా 2027-28లో 8వేల 19 కోట్ల రూ.ల విలువైన 425 కి.మీ.ల పొడవున 11 జాతీయ రహదారుల అభివృద్ధికి లక్ష్యంగా నిర్ణయించామని పేర్కొన్నారు. 2025 నుండి 2028 వరకు మొత్తం 62వేల 967 కోట్ల రూపాయల విలువైన 2861 కి.మీ.ల పొడవున 129 పనులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.కాగా లాక్షా 3వేల 667 కోట్ల రూపాయలు విలువైన 2543 కి.మీ.ల పొడవైన 64 ప్రాజెక్టులు పైపులైనులో ఉన్నాయని కృష్ఘ బాబు వివరించారు.
రైల్వే ప్రాజెక్టులు గురించి వివరిస్తూ 43వేల 101కోట్ల రూపాయల విలువైన 2517 కి.మీ.ల పొడవున 40 ప్రాజెక్టులు మంజూరై ప్రగతిలో ఉన్నట్టు వివరించారు.అంతేగాక 13వేల 305 కోట్ల విలువైన 343 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు,రైల్వే అండర్ బ్రిడ్జిలు నిర్మాణంలో ఉన్నట్టు తెలిపారు.అలాగే 3 వేల 651 కోట్లతో 167 ట్రాఫిక్ సంబంధిత సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు.అమృత్ భారత్ స్టేషన్ల కింద 3వేల 81 కోట్లతో 74 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నారన్నారు. అదే విధంగా 64వేల 417 కోట్ల రూపాయల విలువైన 624 ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయని తెలిపారు.
లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్-మల్టీ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ గురించి వివరిస్తూ అమరావతి, విశాఖపట్నం,తిరుపతి ఎకనామిక్ రీజియన్స్ లో మల్టీమోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఏర్పాటుకు ప్రతిపాదించిన ట్టు చెప్పారు
07-05-2026
90 day Action plan further to Ministers ‘Singapore visit’
Focus on execution, integrated governance of districts, real time monitoring, citizens feed back
Heath Minister presents report on Singapore visit at collector’s conference
Following is the text of report presented by Health Minister Shri Satyakumar Yadav at Collector’s conference
at AP secretariat on Thursday
Minister for Health Satyakumar Yadav on Thursday said the recent study visit to Singapore by a team of Andhra Pradesh Ministers had provided valuable insights into governance, interdepartmental coordination, digital administration, and citizen-centric public service delivery.
Speaking on the first day of the District Collectors’ Conference held at the Andhra Pradesh Secretariat under the chairmanship of Chief Minister N. Chandrababu Naidu, Mr. Yadav said the seven-day structured governance programme in Singapore highlighted the importance of disciplined execution alongside visionary leadership.
A six-member ministerial delegation visited Singapore as per the directions of the Chief Minister to study global best practices in governance and institutional systems. The delegation participated in expert-led sessions, ministerial interactions, case studies, simulations, and field visits to key infrastructure and governance institutions.
Mr. Yadav said the delegation had prepared a 90-day action plan based on the observations made during the visit, which would be submitted to the Chief Minister for further guidance.
“The strongest message from the programme was that governance succeeds only when vision is matched by disciplined and time-bound execution. Leadership and vision are already available in Andhra Pradesh, but the focus now must be on strengthening execution systems and coordination,” he said.
The Minister said Singapore’s governance framework was designed around citizen experience rather than departmental silos. He underlined the need for stronger interdepartmental coordination at the field level to ensure effective implementation of government schemes and infrastructure projects.
Referring to Singapore’s “whole-of-government” approach, Mr. Yadav said departments there functioned with continuous coordination, data integration, and real-time monitoring mechanisms, resulting in efficient service delivery and faster grievance redressal.
The delegation also studied Singapore’s integrated community infrastructure model, where healthcare, sports facilities, libraries, food centres, recreational spaces, and citizen services were brought together within public housing ecosystems.
Mr. Yadav said the Ministers were particularly impressed by Singapore’s long-term urban planning, climate resilience measures, water management systems, and extensive greenery initiatives.
The delegation visited the Jurong industrial region and one of the world’s largest automated ports, where logistics and container movement are managed largely through autonomous systems and centralized command centres.
On crisis management, the Minister said Singapore had presented detailed modules on pandemic response, emergency preparedness, communication systems, and technology-enabled governance. He added that the delegation had also shared India’s experience in handling the COVID-19 pandemic, including indigenous vaccine development, large-scale vaccination drives, and medical assistance extended to several countries.
Mr. Yadav said the proposed 90-day action framework focused on integrated district governance, real-time monitoring systems, citizen feedback mechanisms, unified grievance platforms, and improved coordination among departments.
He said thematic focus areas identified by the delegation included public health coverage, digital healthcare systems, flood management, climate-resilient urban infrastructure, cybercrime prevention, disaster preparedness, and promotion of natural farming.
The Minister observed that while Singapore’s scale and population were different from Andhra Pradesh, several governance practices could be adapted to suit local administrative requirements and improve public service delivery in the State.
[4:35 pm, 7/5/2026] K Ramanjaneyulu Pub Cell 7544-RV.Divisional PRO INPR18 K. Ramanjaneyulu K. Ramanjaneyulu: జిల్లా కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న వైద్యారోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్
[4:43 pm, 7/5/2026] K Ramanjaneyulu Pub Cell 7544-RV.Divisional PRO INPR18 K. Ramanjaneyulu K. Ramanjaneyulu: స్వర్ణాంధ్ర @ 2047 దిశగా ‘స్వచ్ఛ ఆంధ్ర’
కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్.
7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ (MA&UD) ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ “స్వచ్ఛ ఆంధ్ర”పై సమగ్రమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు.రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో, పర్యావరణ అనుకూలంగా (క్లీన్, గ్రీన్ అండ్ రెసిలియంట్) తీర్చిదిద్దడమే ప్రభుత్వ విజన్ అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు (WASH) కల్పించడంతో పాటు, టెక్నాలజీ సాయంతో వ్యర్థాల నిర్వహణ, మోడల్ సర్క్యులర్ ఎకానమీని తీసుకురావాలని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ జీవన ప్రమాణాలున్న టాప్ 100 నగరాల్లో మన రాష్ట్రం నుంచి కనీసం రెండు నగరాలు నిలిచేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
“చెత్త నుంచి సంపద” (వేస్ట్ టు వెల్త్) అనే విధానంతో సర్క్యులర్ ఎకానమీని బలోపేతం చేస్తూ, పర్యావరణానికి మేలు చేసే ‘లైఫ్’ (LiFE) పద్ధతులను అలవాటు చేసుకోవాలని సురేష్ కుమార్ గారు సూచించారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు అత్యధునాతన టెక్నాలజీలను వాడాలని ఆయన తెలిపారు. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (SWM) రూల్స్ 2026ను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ 15 నాటికల్లా భారీ స్థాయిలో చెత్తను ఉత్పత్తి చేసే వారిని (Bulk Waste Generators) గుర్తించి ఆన్‌లైన్ పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాలని, స్వయం సహాయక సంఘాలు (SHGs) మరియు స్థానిక వ్యాపారుల ద్వారా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు. పల్లెలు, పట్టణాల మధ్య వ్యత్యాసం లేకుండా డంపింగ్ యార్డులు, చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్లను అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని (గ్రీన్ కవర్) 50 శాతానికి పెంచే లక్ష్యంతో పని చేస్తున్నామని, డీప్ టెక్ పాలనతో పారదర్శకతను పెంచుతున్నామని ఆయన వివరించారు.
ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు స్వచ్ఛ సర్వేక్షణ్-2025లో జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి అత్యుత్తమ ర్యాంకులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.దీనికోసం ఇప్పటికే జాతీయ ర్యాంకింగ్స్ సాధించే సత్తా ఉన్న 46 మున్సిపాలిటీలను ఎంపిక చేసి, రాష్ట్ర స్థాయి పీఎంయూ (PMU) బృందాల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. “స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర” (SASA) కార్యక్రమం కోసం వాష్-ఐ, సాహస్, AIILSG సంస్థల సహకారంతో 35 వేల మందికి పైగా సిబ్బందికి శిక్షణ ఇచ్చి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. స్వచ్ఛ ర్యాంకుల్లో మెరుగైన ఫలితాల కోసం నూరు శాతం ఇంటింటి నుంచి చెత్త సేకరణ, మూలం వద్దే చెత్తను వేరు చేయడం (సోర్స్ సెగ్రిగేషన్) వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం ఈ సాసా (SASA) ర్యాంకింగ్స్‌లో గుంటూరు, విశాఖపట్నం, కోనసీమ జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.
మౌలిక సదుపాయాలు మరియు ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ, మురుగునీటి శుద్ధి కేంద్రాల (STPs) నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్లను కోరారు.దాదాపు రూ.326.49 కోట్ల నిధులతో ఈ ప్రాజెక్టులకు అవసరమైన 89.44 ఎకరాల ప్రైవేటు భూమిని వెంటనే సేకరించాల్సిన అవసరం ఉందన్నారు.అలాగే ప్రతీ నెల 10వ, 20వ తేదీలలో స్థానిక సంస్థల పరిధిలో తప్పనిసరిగా ఈ-వేస్ట్ (e-waste) సేకరించేలా చూడాలన్నారు. ఈ పనులన్నీ సజావుగా జరిగేలా కలెక్టర్ల అధ్యక్షతన మున్సిపల్, పంచాయతీ రాజ్, కాలుష్య నియంత్రణ మండలి (PCB) అధికారులతో జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని సురేష్ కుమార్ గారు ఆదేశించారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో కూడా ‘నెట్ జీరో’ విధానాలను అమలు చేస్తూ ప్రజలందరి భాగస్వామ్యంతో స్వచ్ఛ ఆంధ్రను సాధించాలని ఆయన అన్నారు.
‘స్వచ్ఛ ఆంధ్ర’లో భాగంగా చెత్త నుంచి సంపద సృష్టించే ‘సర్క్యులర్ ఎకానమీ’ విధానానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ తన ప్రసంగంలో మరింత వివరంగా చెప్పుకొచ్చారు. పారిశ్రామిక శాఖ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే అనకాపల్లి, నెల్లూరు, కర్నూలు, కడప, పల్నాడు, నంద్యాల వంటి పలు జిల్లాల్లో సుమారు 590 ఎకరాలకు పైగా భూములను ఇందుకోసం కేటాయించామని, పరిశ్రమలు స్థాపించడానికి ముందుగా వచ్చే సంస్థలకు ప్రత్యేక రాయితీలు (Early Bird Incentives) కూడా అందిస్తున్నామని తెలిపారు. పర్యావరణానికి మేలు చేసే ఈ ఆధునిక ప్రాజెక్టుల ద్వారా వ్యర్థాలను సమర్థవంతంగా పునర్వినియోగం చేస్తూ పచ్చదనాన్ని పెంపొందించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జూన్ 2026 నాటికి రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ సాధించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ లక్ష్య సాధన కోసం పర్యావరణ అనుకూలమైన ఈ-ఆటోలను (E-Autos) అందుబాటులోకి తెస్తున్నామని, ఇప్పటికే 501 వాహనాలకు అనుమతులు ఇవ్వగా నెల్లూరు మున్సిపాలిటీలో తొలి విడతగా 30 వాహనాలతో సేవలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఇక దశాబ్దాలుగా పట్టణాల్లో పేరుకుపోయిన చెత్త గుట్టల (లెగసీ వేస్ట్) తొలగింపులో కూడా వేగం పెంచామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 152 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తలో ఇప్పటికే 118 లక్షల టన్నులకు పైగా చెత్తను శాస్త్రీయంగా తొలగించామని, జూన్ కల్లా ఈ ప్రక్రియను వంద శాతం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇలా చెత్తను తొలగించి బాగుచేసిన స్థలాల్లో కాలుష్య నియంత్రణ మండలి (APPCB) నిధులతో ప్రజలకు ఉపయోగపడేలా ఆహ్లాదకరమైన పార్కులను నిర్మిస్తామని, అలాగే పట్టణాల శివార్లలోని స్థలాల్లో ‘మియావాకి’ పద్ధతిలో దట్టమైన అడవులను పెంచుతామని ఆయన పంచుకున్నారు.
వ్యర్థాల నిర్వహణను మరింత పకడ్బందీగా, శాస్త్రీయంగా చేపట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 107 సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ (ISWM) ప్లాంట్లకు అనుమతులు ఇచ్చామని ఆయన వివరించారు. వీటితో పాటు 148 మురుగునీటి శుద్ధి కేంద్రాలు (STPs), 20 ఎఫ్.ఎస్.టి.పి (FSTP) ల నిర్మాణాలను అక్టోబర్ 2026 కల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అధికారులకు స్పష్టం చేశారు. ఇళ్ల దగ్గరే తడి, పొడి చెత్తను వేరు చేయడంలో మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) సేవలను విస్తృతంగా వాడుకుంటున్నామని, ఇప్పటికే సుమారు 36 వేల మందికి పైగా సభ్యులకు దీనిపై శిక్షణ ఇచ్చి ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని ఆయన గుర్తుచేశారు. అలాగే అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల లాంటి భారీగా చెత్తను ఉత్పత్తి చేసే వారిని (Bulk Waste Generators) సర్వే ద్వారా గుర్తించి, కొత్త నిబంధనల ప్రకారం వారి ఆవరణల్లోనే చెత్తను కంపోస్ట్‌గా మార్చే ‘బయో-డైజెస్టర్ల’ను తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. దీనికోసం తయారీ సంస్థలతో మాట్లాడి తక్కువ ధరకే ఆ యంత్రాలు అందేలా ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని సురేష్ కుమార్ గారు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
CM propose 90 days action plan to adopt Singapore’s best administrative practices in one district as a model
CM advice officials to develop “We” mindset instead of individualistic “Me” following Singapore approach
Amaravati: Chief Minister N Chandrababu Naidu stated that Singapore’s governance systems have earned the trust of its people and proposed that Andhra Pradesh adopt some of Singapore’s best administrative practices by developing one district as a model. He directed officials to prepare a 90-day action plan for implementing Singapore-inspired governance practices and to closely monitor its execution.
Addressing Collectors conference at Secretariat today the Chief Minister said Singapore follows ‘Not Me… We’ philosophy.
The Chief Minister said that everyone should adopt a collective “We” mindset instead of an individualistic “Me” approach. He announced that he too would consciously replace the word “I” with “We” in his public discourse.
Addressing the officials, the Chief Minister said learning is a continuous process and that adopting best practices from anywhere in the world can deliver strong outcomes.
On the issue of Gross State Domestic Product (GSDP), the Chief Minister said decisions taken today would have a long-term impact on the people of the state. Referring to regional disparities, he observed that although both Parvathipuram and Alluri districts are tribal regions, Alluri district has achieved higher GSDP due to value addition in coffee cultivation.
He emphasised the need to focus on development and accelerate progress through innovation. The Chief Minister highlighted that the service sector must expand further and pointed out that Andhra Pradesh contributes nearly 10 percent of the country’s agricultural output.
He also noted that several districts possess rare earth mineral resources and said that establishing processing plants related to these minerals could create additional avenues for growth and industrial development.
The Chief Minister informed the gathering that the government is studying the role of district collectors in driving GSDP growth and encouraged collectors to come up with innovative ideas for development. He cited the Collector of Annamayya district as an example of proactive administration.
He urged collectors to compete in implementing best policies and suggested creating healthy competition not only among collectors at the state level but also among constituencies within districts.Field-level officers possess immense experience and valuable information and if their expertise is effectively utilised, development can be accelerated, welfare delivery can improve and innovative ideas can be implemented successfully, he said.
The Chief Minister also underlined the importance of tourism-led growth. He said that developing beach fronts at Suryalanka, Manginapudi, Visakhapatnam, Srikakulam, Mypadu and other coastal areas would create significant livelihood opportunities for local communities.
He added that new national highways would generate fresh economic opportunities, enabling the establishment of logistics hubs and townships.
The Chief Minister instructed district collectors to make effective use of vision units and pointed out that district administration has become more manageable after the reorganisation of districts.
“Earlier, collectors in larger districts had to oversee up to 21 Assembly constituencies and now each collector oversees only about seven Assembly constituencies. With technology now widely available, collectors have far greater opportunities than before to improve governance, accelerate development and deliver welfare effectively, the Chief Minister added.
జిల్లా కలెక్టర్ల సమావేశంలో కాస్ట్ ఆప్టిమైజేషన్-ప్యూయల్ అండ్ ఎనర్జీ పై ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు సియం ఎక్స్ అఫిషియో స్పెషల్ సిఎస్ కె.విజయానంద్ ప్రజెంటేషన్ ఇస్తూ
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ నెట్ జీరో ఎమిషన్స్ వైపు అడుగులు వేస్తున్నామని తెలిపారు.రైతులకు, పరిశ్రమలకు,ఇళ్లకు తక్కువ ధరకు నమ్మకంగా విద్యుత్ సరఫరా చేయడం మా ఉద్దేశం అని తెలిపారు.స్మార్ట్ గ్రిడ్లు, మైక్రో గ్రిడ్లు, సోలార్ రూఫ్‌టాప్ కార్యక్రమాల ద్వారా స్థానిక స్థాయిలోనే శక్తి స్వయం సమృద్ధి సాధించాలని, AI మరియు స్మార్ట్ టెక్నాలజీలను ఉపయోగించి సమర్థవంతంగా శక్తి నిర్వహణ జరగాలని చెప్పారు.
PM సూర్య ఘర్ యోజన కింద రాష్ట్రంలో ఇప్పటివరకు 7.25 లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా, వాటిలో 1.31 లక్షల ఇళ్లలో సోలార్ ప్యానెల్స్ అమర్చడం పూర్తయిందని వెల్లడించారు. ఇది 441 మెగావాట్ల సామర్థ్యానికి సమానం. ULA మోడల్ కింద SC/ST వర్గాలకు 6 లక్షల మంది వినియోగదారులకు ఉచితంగా సోలార్ పవర్ అందించే లక్ష్యంతో 50 వేల మందికి ఇప్పటికే అమర్చడం పూర్తయిందని చెప్పారు. రోజూ దాదాపు 2,600 మంది వరకు కొత్త ఇన్‌స్టాలేషన్లు జరుగుతున్నాయని గణాంకాలతో వివరించారు.
PM కుసుమ్ స్కీమ్ కింద రైతులకు ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 227 ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించామని, వీటిలో 217 ప్లాంట్లకు భూమి సేకరణ పూర్తయిందని, 97 చోట్ల నిర్మాణ పనులు మొదలయ్యాయని విజయానంద్ తెలిపారు. ఇది మొత్తం 1,162.8 మెగావాట్ల సామర్థ్యానికి సంబంధించినది. ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెల్స్ అమర్చడానికి చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ RESCO మోడల్‌లో ప్రారంభించామని, 78 ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో 826 kW సామర్థ్యంతో సోలార్ సిస్టమ్స్ అమర్చనున్నామని వెల్లడించారు. దీని వల్ల ఏటా 34.5 లక్షల రూపాయలు ఆదా అవుతాయని, రాష్ట్రవ్యాప్తంగా 1,775 ప్రభుత్వ భవనాలు గుర్తించామని, వీటిలో 201 మెగావాట్ల సామర్థ్యం ఉందని చెప్పారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కొనుగోలు ఖర్చు యూనిట్‌కు సగటున రూ.4.90గా ఉందని, ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ వాడకం పెరగడంతో కొన్ని నెలల్లో యూనిట్ ధర రూ.4.56 వరకు తగ్గిందని వివరించారు. జిల్లా కలెక్టర్లు తమ తమ ప్రాంతాల్లో అసెంబ్లీ నియోజకవర్గం వారీగా రూఫ్‌టాప్ సోలార్ సమీక్షించాలని, SC/ST వర్గాలకు చెందిన వినియోగదారులకు సకాలంలో సోలార్ ప్యానెల్స్ అందేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ భవనాల సోలరైజేషన్ కోసం జిల్లా కలెక్టర్లు సర్వేలు చేపట్టి NREDCAP కి వివరాలు అందించాలని సూచించారు. PM కుసుమ్ పథకం అమలులో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే DISCOMs, NREDCAP అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలని, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను త్వరితంగా పరిష్కరించాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శక్తి రంగంలో కాస్ట్ ఆప్టిమైజేషన్ మరియు పరిసరానుకూల విద్యుత్ ఉత్పత్తి పెంచడం పది సూత్రాల్లో ముఖ్యమైన భాగమని చెప్పారు.
[5:14 pm, 7/5/2026] JD Surya Chandra Rao Pubcell: స్వర్ణాంధ్ర@2047 – పది సూత్రాలు అమల్లో బాగంగా నైపుణ్యం మరియు ఉపాధి అంశంపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ కార్యదర్శి శ్రీ కోనా శశిధర్ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరిస్తూ….
#“నైపుణ్యం” వేదిక ద్వారా సమగ్ర సర్వే పురోగతిపై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించబడింది. రాష్ట్రవ్యాప్తంగా 80,32,901 లక్ష్యానికి గాను 72,28,580 సర్వేలు పూర్తికాగా, ఇంకా 8,04,321 సర్వేలు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించబడింది. 26 విభాగాల సమీకరణ ద్వారా పౌరుల నైపుణ్యాలకు సంబంధించిన సమాచారం సేకరించి, రియల్‌టైమ్ సిటిజన్ సెంట్రిక్ డేటా రిపాజిటరీ రూపొందించబడినప్పటికీ, సమగ్ర నైపుణ్య సంబంధిత డేటా ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులో లేదని గుర్తించడం జరిగింది. పెండింగ్ సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని గ్రామ నైపుణ్య అధికారులకు దిశానిర్దేశాలు జారీ చేయడంతో పాటు, జిల్లా కలెక్టర్లు జిల్లా స్కిల్ & ఎంప్లాయ్‌మెంట్ అధికారులతో సమన్వయం చేసి నైపుణ్య సమాచార సమీకరణను వేగవంతం చేయాలని సూచించారు.
#అదేవిధంగా, PM SETU కార్యక్రమం కింద జిల్లా వారీగా సపోర్ట్ మొబిలైజేషన్ లక్ష్యాలపై సమీక్ష జరిగింది. పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రముఖ పరిశ్రమలను ఆంకర్ ఇండస్ట్రీ పార్ట్నర్లుగా ముందుకు రావాలని ఆహ్వానిస్తూ RFP ప్రక్రియలో పాల్గొనేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 హబ్‌లు, 65 స్పోక్‌లతో రూ.4,040 కోట్ల ప్రణాళిక రూపొందించబడగా, ఇందులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరియు పరిశ్రమల భాగస్వామ్యంతో నిధుల సమీకరణ చేపట్టనున్నారు.
#జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ ప్లాన్స్ (DSDPs) రూపకల్పనను రాష్ట్ర ప్రభుత్వం కీలక మరియు నిర్ణాయక కార్యక్రమం. పరిశ్రమల అవసరాలు, రాబోయే పెట్టుబడులు, స్థానిక ఉపాధి అవకాశాలకు అనుగుణంగా ముందస్తు నైపుణ్యాభివృద్ధి లక్ష్యంతో ఈ ప్రణాళికలు రూపొందించబడుతున్నాయి. జిల్లాస్థాయిలో సింగిల్-విండో అమలు విధానం ద్వారా ఫలితాధారిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడమే ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2026 మే 24న జిల్లా స్థాయి ఓరియెంటేషన్ వర్కుషాప్ నిర్వహించగా, అన్ని జిల్లాల్లో సంబంధిత విభాగాల సమన్వయంతో 28 DSDPలు సిద్ధం చేయబడినట్లు వెల్లడించారు. జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారులు (DESOs) ఈ ప్రణాళికల రూపకల్పన మరియు అమలులో ప్రధాన భూమిక పోషిస్తున్నారని తెలిపారు.
#“నైపుణ్యం” కార్యక్రమం పురోగతి మరియు స్కిల్ స్క్రీనింగ్ టెస్టుల అమలుపై సమగ్ర సమీక్ష నిర్వహించబడింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 7.3 లక్షల మందికి శిక్షణ అందించగా, మరో 71 వేల మంది వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్నారు. 36 రంగాలకు చెందిన 708 జాబ్ రోల్స్ లో శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (NCVET) ప్రమాణాలకు అనుగుణంగా SBTET ద్వారా 115 కోర్సులు అమలు చేయబడగా, 867 కోర్సులకు AI ఆధారిత అసెస్‌మెంట్ మాడ్యూల్స్ రూపొందించబడినట్లు వెల్లడించారు.
#ఉద్యోగ కల్పనలో భాగంగా 6.85 లక్షలకు పైగా పరిశ్రమలు నైపుణ్యం వేదికలో భాగస్వామ్యం కావడంతో పాటు, ప్రస్తుతం 70 వేలకుపైగా ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. AI ఆధారిత ఇంటర్వ్యూ విధానాన్ని 28 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి, 81,874 మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించగా, 25కుపైగా రంగాల్లో వివిధ ఉద్యోగ పాత్రలకు సంబంధించిన సర్టిఫికేషన్ మాడ్యూల్స్ విజయవంతంగా పరీక్షించబడినట్లు వెల్లడించారు.
#NSQF–NOS ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన స్కిల్ స్క్రీనింగ్ టెస్ట్ అప్లికేషన్‌ను విద్యార్థులు, నిరుద్యోగులు మరియు అసంఘటిత రంగ కార్మికులకు విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇందుకోసం ప్రారంభ దశలో 20 లక్షల మంది కోసం సొల్యూషన్ ప్రొవైడర్ ఎంపికకు RFP జారీ చేయబడిందని, 2026 మే 20 నాటికి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులు, ఉద్యోగార్థులు, RPL మరియు నిర్మాణ కార్మికులను కలుపుకొని మొత్తం 50 లక్షల ఇంటర్వ్యూల లక్ష్యాన్ని ప్రతిపాదించారు. జిల్లా కలెక్టర్లు “నైపుణ్యం” పోర్టల్‌పై విస్తృత ప్రచారం నిర్వహించి జిల్లా వారీగా నమోదులను పెంచాలని సూచించారు.
#భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల (BOCW) నైపుణ్యాభివృద్ధి, అప్‌స్కిల్లింగ్ కార్యక్రమాలపైనా సమీక్ష జరిగింది. స్కిల్ సెన్సస్ డేటా సమీకరణను 2026 మే 15 నాటికి పూర్తి చేసి నిర్మాణ కార్మికుల మ్యాపింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామ నైపుణ్య అధికారుల ద్వారా AI ఆధారిత స్కిల్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించబడుతున్నాయని, “నైపుణ్యం” వేదికలో ఇప్పటికే 18 లక్షల మంది కార్మికుల డేటా సమీకరణ జరుగుతోందని వెల్లడించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC), ట్రైనింగ్ భాగస్వాములు మరియు పరిశ్రమల సహకారంతో 87 వేల మందికి శిక్షణ అందించే ప్రణాళిక రూపొందించబడింది.
#ఇండస్ట్రీల సహకారంతో ట్రైనర్స్ శిక్షణ (TOTs), మౌలిక వసతులు మరియు పాఠ్యాంశాల రూపకల్పనపై చర్చించేందుకు 2026 మే 21న వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లు నిర్మాణ కార్మికులను నైపుణ్య శిక్షణ, అసెస్‌మెంట్ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడంతో పాటు, వారి పురోగతిని పర్యవేక్షించి సర్టిఫికేషన్ పూర్తి చేయాలని సూచించారు. అలాగే జిల్లాలోని ప్రతి నిర్మాణ కార్మికుడు BOCW కార్మికుడిగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలి.
* * *











































