Chandrababu: ఢిల్లీలో చంద్రబాబు రేంజ్ చూశారా..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత తొలిసారి టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. నరేంద్ర మోదీ ఇంట్లో జరిగిన ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు హస్తినలో పర్యటించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టు చేరుకునే వరకూ అందరి చూపు.. చంద్రబాబుపైనే..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత తొలిసారి టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) ఢిల్లీకి వెళ్లారు. నరేంద్ర మోదీ ఇంట్లో జరిగిన ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు హస్తినలో పర్యటించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టు చేరుకునే వరకూ అందరి చూపు.. చంద్రబాబుపైనే. ఢిల్లీ వేదికగా బాబు ఏం చేయబోతున్నారు..? సమావేశంలో ఏం చర్చిస్తారు..? చంద్రబాబు ఏం మాట్లాడొచ్చు..? మంత్రి పదవులు ఎన్ని అడగొచ్చు..? ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని విషయాలు తెలుగు ప్రజలు ఊహించుకుంటున్నారు.
ఎక్కడ చూసినా బాబే..!
ఇక ఢిల్లీలో అలా అడుగుపెట్టారో లేదో టీడీపీ నేతలు, జాతీయ మీడియా మొత్తం చంద్రబాబు చుట్టూ చేరిపోయింది. ఏపీలో భారీ విజయం, ఎన్డీఏ సమావేశం, పరిస్థితిపై మాట్లాడాలని కోరారు. అయితే.. ఒకట్రెండు మాటలతో ముగించేసి సమావేశానికి వెళ్లడానికి ప్రయత్నించారు. ఇక ఢిల్లీలోని తెలుగు ప్రజలు, చంద్రబాబు వీరాభిమానులు.. నేతల రాకతో ఒక్కటే సందడి నెలకొంది. ఇక భారీ సెక్యూరిటీ.. కాన్వాయ్ మధ్య మోదీ నివాసానికి వెళ్లి సమావేశంలో పాల్గొన్నారు. మీటింగ్ ముగిశాక ఢిల్లీలోని మాజీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి తిరిగి చేరుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు మీడియా, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ వీడియోలపై తెలుగుదేశం శ్రేణులు.. ఇదీ చంద్రబాబు రేంజ్ అంటే అని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో చక్రం తిప్పేది చంద్రబాబేనని వీరాభిమానులు, పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఇదిగో ఈ వీడియో చూడండి.. పరిస్థితి ఏంటనేది మీకే అర్థమవుతుంది.