రాజధాని రైతుల ప్లాట్లలో ఏడాదిలో కనీస మౌళిక వసతుల కల్పన పూర్తి చేస్తాం*8
13 జోన్లలో ప్లాట్ల అభివృద్దికి 23,645 కోట్లతో మౌళిక వసతుల పనులు
కరకట్ట ప్రయాణానికి స్వస్తి…రెండు నెలల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తిగా అందుబాటులోకి వస్తుంది
ప్రాజెక్ట్ లకు అవసరం మేరకు ల్యాండ్ పూలింగ్ చేపడతాం
రైతులు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ముందుకు రావాలి
……………అమరావతిలో పర్యటన తర్వాత మీడియాతో మంత్రి నారాయణ………
అమరావతి…
తేది..09-12-25.
రాజధాని రైతులకు కేటాయించిన ప్లాట్లలో మౌళిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ చెప్పారు..ఏడాదిలోగా మౌళిక వసతుల కల్పన పూర్తవుతుందని తెలిపారు..రాజధానిలో జరుగుతున్న రోడ్ల నిర్మాణాలు,రైతుల ప్లాట్ల అభివృద్ది పనులను అధికారులు,ఇంజినీర్లతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు.సీడ్ యాక్సిస్ రోడ్డు పెండింగ్ నిర్మాణ పనులు,గుంటూరు ఛానల్ పై మంగళగిరి రోడ్లును సీడ్ యాక్సిస్ రోడ్డుతో కలిపేలా నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులను మంత్రి పరిశీలించారు…ఆ తర్వాత రాజధానిలోని వివిధ జోన్లలో జరుగుతున్నపనులను పరిశీలించిన తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.
రైతుల ప్లాట్లలో ఏడాదిలో మౌళిక వసతుల కల్పన
రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఇప్పటికే ప్లాట్ల కేటాయింపు తుది దశకు చేరుకుంది..మొత్తం 29 గ్రామాల రైతులకు ఎల్పీఎస్ లే అవుట్ లను 13 జోన్లుగా విభజించి అభివృద్ది పనులు చేస్తున్నామన్నారు…ఆయా జోన్లలో ఇటీవల వర్షాలకు పెరిగిన జంగిల్ ను క్లియర్ చేయించడంతో పాటు ఆయా ప్లాట్లలో మౌళిక వసతుల కల్పన వేగంగా జరుగుతుందన్నారు.ఏడాదిలోగా డ్రైనేజిలు,రోడ్లు,ఇతర మౌళిక సదుపాయాల కల్పన పూర్తి అవుతుంది..ఆ తర్వాత మరో ఏడాదిన్నరలోగా రోడ్ల నిర్మాణాలు కూడా పూర్తవుతాయి…ఒక ఏడాది తర్వాత ఆయా ప్లాట్లు వినియోగించుకునేలా పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి చెప్పారు…ఒక్క జోన్ మినహా మిగతా జోన్లలో రోడ్ నెట్ వర్క్,తుపాను నీటి కాలువలు,మురుగునీటి నెట్ వర్క్,డ్రింకింగ్ వాటర్,ఎస్టీపీలు,వంతెనల నిర్మాణం కోసం మొత్తం 23,4645.56 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు..రైతులకు బ్యాంక్ లోన్ ల జారీపై బ్యాంకర్లతో సీఎం మాట్లాడుతున్నారని మంత్రి చెప్పారు.
కరకట్టతో పనిలేదు….త్వరలో సీడ్ యాక్సిస్ రోడ్డుతోనే రాజధానిలోకి ఎంట్రీ..
ప్రస్తుతం విజయవాడ నుంచి అమరావతి రాజధానిలోకి వెళ్లాలంటే ప్రకాశం బ్యారేజి దిగువన కొండవీటి వాగు పంపింగ్ స్టేషన్ నుంచి కరకట్ట మీదుగా సీడ్ యాక్సిస్ రోడ్డులోకి వెళ్లాల్సి వస్తుంది..ప్రస్తుతం సీడ్ యాక్సిస్ రోడ్డు పెండింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి..ఈ నెలాఖరునాటికి సీడ్ యాక్సిస్ రోడ్డును మరికొంతమేర అందుబాటులోకి తీసుకువచ్చి కరకట్ట ప్రయాణం తగ్గిస్తాం…ఇక ప్రకాశం బ్యారేజి నుంచి ఉండవల్లి సెంటర్ కు మధ్యలో సీడ్ యాక్సిస్ రోడ్డును కనెక్ట్ చేసేలా గుంటూరు ఛానల్ పై స్టీల్ బ్రిడ్జి నిర్మాణం వేగంగా జరుగుతుంది…వచ్చే ఫిబ్రవరి 15 నాటికి ఈ బ్రిడ్రి నిర్మాణం పూర్తయితే అసలు కరకట్టతో సంబంధం లేకుండానే రాజధానిలోకి నేరుగా వెళ్లిపోవచ్చని మంత్రి నారాయణ చెప్పారు…అటు విజయవాడతో పాటు ఇటు తాడేపల్లి,మంగళగిరి నుంచి వచ్చే వారికి రాజధానిలోకి వెళ్లడం సులభం అవుతుందన్నారు మంత్రి.
ప్రాజెక్టులకు అవసరం మేరకు భూసమీకరణ చేపడతాం
రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్డు,రైల్వే స్టేషన్,రైల్వే ట్రాక్,స్పోర్ట్ సిటీ కోసం భూసమీకరణ చేపడుతున్నాం…ఇంకా వేరే ప్రాజెక్ట్ లు చేపట్టే సమయంలో సంబంధిత ప్రాజెక్ట్ కు అవసరమైన భూసమీకరణ చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేసారు…
ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు రైతులు ముందుకు రావాలి
రాజధానికి భూములిచ్చిన 29,233 మంది రైతులకు 69,421 ప్లాట్లు కేటాయించాం…వీటిలో ఇప్పటివరకు 27,105 మంది రైతులకు కేటాయించిన 61,753 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయింది…ఇంకా కేవలం 2128 మంది రైతులకు చెందిన 7668 ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది…అయితే వివిధ కారణాలతో రైతులు రిజిస్ట్రేషన్ ను పెండింగ్ పెడుతున్నట్లు మంత్రి తెలిపారు…పెండింగ్ రిజిస్ట్రేషన్ లకు సంబంధించి రైతులకు ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నామన్నారు…వీటిలో 372 మంది రైతులు స్పందించడం లేదని….450 మంది రైతులకు సంబంధించిన 1891 ప్లాట్లు వివాదాల్లో ఉన్నాయన్నారు…ఇక స్థానికంగా లేకపోవడం,ఎన్ ఆర్ ఐ ల కు చెందినవి 436 ప్లాట్లు,చనిపోయిన వారికి సంబంధించి అవసరమైన పత్రాలు పత్రాలు సమర్పించకపోవడంతో 635 ప్లాట్లు రిజిస్ట్రేషన్ పెండింగ్ లో ఉన్నట్లు మంత్రి నారాయణ చెప్పారు..లంక భూములు ఇచ్చిన రైతుల్లో 147 మందికి 272 ప్లాట్లు రిజిస్ట్రేషన్ పెండింగ్ లో ఉన్నట్లు మంత్రి నారాయణ తెలిపారు..రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు.మిగిలిపోయిన లంక భూములు, అసైన్డ్ భూములకు సంబంధించిన సమస్యలపై వచ్చే కేబినెట్ లో చర్చించి పరిష్కరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
ఈ పర్యటనలో మంత్రి నారాయణ వెంట అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి లక్ష్మీ పార్ధసారధి,సీఆర్డీఏ ఇంజినీర్ ఇన్ చీఫ్ గోపాల కృష్ణా రెడ్డి,ఏడీసీ చీఫ్ ఇంజినీర్ ధనుంజయ్,ఇతర ఇంజినీర్లు,కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


















































