*యువత గుండెజబ్బుల పై అప్రమత్తంగా ఉండాలి*
*సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి*
డోన్ పట్టణం :- మన భారతదేశంలో రోజురోజుకు చిన్న వయసులోనే గుండెపోటు వస్తున్న కేసులు పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. గుండెపోటు యువ మరియు మధ్య వయస్కులలో
రావడానికి కారణలు జీవితంలో అధిక ఒత్తిడి ,చెడు ఆహారపు అలవాట్లు, చాలా పొద్దుపోయే వరకు కంప్యూటర్లు, ఎల్క్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం, సిగరెట్లు, పొగాకు, మద్యం అలవాట్లు ,వాతావరణ కాలుష్యం కల్తీ అహార పదార్ధలు కారణమైతున్నాయని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి పేర్కొన్నారు. గుండెకు నిరంతరాయంగా రక్తం సరఫరా అవుతూ ఉండాలి. సరఫరా ఏ మాత్రం నిలిచినా శరీరంలోని మొత్తం వ్యవస్థ స్తంభించిపోతుంది. గుండెకు రక్త సరఫరా నిలిచిపోవడానికి ప్రధాన కారణం కొవ్వులే. రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల గోడల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో రక్తం ప్రవహించే మార్గం కుచించుకుపోతుంది. దీనివల్ల గుండెకు రక్తసరఫరా నిలిచిపోతుంది. ఫలితంగా గుండె కండరాలకు ఆక్సిజన్, పోషకాలు అందవు. దీంతో కండరాలు చచ్చుబడి గుండె పోటు ఏర్పడుతుందని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు
ఆరోగ్యంగా జీవించాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. దాంతో పాటు ప్రతిఒక్కరూ మంచి జీవన విధానాన్ని పాటిస్తూ ఉండాలి. మనకి శరీరంలో ఎన్నో ఆర్గాన్స్ ఉంటాయి. వాటిలో చాలా ముఖ్యమైనది గుండె. దీనిని జాగ్రత్తగా చూసుకోవాలి ”జంక్ ఫుడ్స్, కూల్ డ్రిక్స్ కు దూరంగా ఉండాలి. శరీరంలోని కొలెస్ట్రాల్ (లిపిడ్ప్రొఫైలు) బిపి, షుగరు పై గుండె జబ్బులు ఆధారపడి ఉంటుంది. కాబట్టి తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలి.ఎక్కువ జిమ్ చేసెవాల్లు సరైన వైద్యనిపుణులను సంప్రదించి మాస్టర్ హెల్త్ ,కార్డియాక్ చెకప్ చేయించుకుని వైద్యనిపుణుల సలహా తీసుకోవాలన్నారు.
ముఖ్యంగా కల్తీ ఆహార పదార్థలను నివారించడంలో
సామాజికంగా ప్రతి ఒక్కరు భాద్యతగా భావించినప్పుడే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.
వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేపట్టాలి. బయటికి వెళ్ళేటప్పుడు సూక్ష్మమైన ధూళిని వడకట్టే మంచి మాస్కులు వాడుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యం. దినచర్యలో యోగా వ్యాయామాలు ధ్యానం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు