05.03.2024
అమరావతి
ఒకవైపు వరద జలాలను ఒడిసి పట్టి, ఫ్లోరైడ్ ప్రభావిత, మెట్ట ప్రాంతాలకు త్రాగు, సాగునీరు అందించి సస్యశ్యామలం చేసే సంకల్పంతో వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ ను నవంబర్ 2021లో, రెండో టన్నెల్ ను జనవరి 2024లో పూర్తి చేసి నేడు (06.03.2024) జంట టన్నెల్ల ప్రారంభోత్సవం..
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు..
ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని ఫ్లోరైడ్ ప్రభావిత, మెట్ట ప్రాంతాలైన 30 మండలాల్లో 15.25 లక్షల జనాభాకు త్రాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండు టన్నెల్లను పూర్తి చేసి నేడు (06.03.2024) ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లి వద్ద ప్రారంభించనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..
మరోవైపు అన్నదాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే పరిహారం అందిస్తూ రైతన్నలకు అన్నివేళలా అండగా నిలబడుతున్న మన ప్రభుత్వం..
రైతన్నలకు ఇన్ పుట్ సబ్సిడీ..
ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే పరిహారం అందిస్తామన్న మాట మరోసారి నిలబెట్టుకుంటూ..
2023లో వర్షాభావం (కరువు), డిసెంబర్, 2023లో మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో సంభవించిన అధిక వర్షాల వల్ల నష్టపోయిన 11,59,126 మంది వ్యవసాయ, ఉద్యానవన రైతన్నలకు రూ. 1,294.58 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని నేడు (06.03.2024) సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్న గౌ|| ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..
నేడు జమ చేస్తున్న రూ. 1,294.58 కోట్లతో కలిపి ఈ 57 నెలల్లో వర్షాభావం (కరువు), తుఫాను, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన 34.41 లక్షల మంది రైతన్నలకు అందించిన మొత్తం ఇన్పుట్ సబ్సిడీ అక్షరాల రూ.3,262 కోట్లు..
ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతన్నలకు సత్వర ఉపశమనం కల్పిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసేలోగానే నష్ట పరిహారం పంపిణీ..
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు – ప్రాజెక్ట్ విశిష్టతలు..
ప్రాజెక్టు అంచనా వ్యయం – రూ. 10,010.54 కోట్లు
నీటి లభ్యత – శ్రీశైలం రిజర్వాయర్ కు ఎగువన 841 మీటర్ల నీటిమట్టం (సిల్ లెవెల్) నుండి కొల్లం వాగు ద్వారా కృష్ణా జలాల తరలింపు…
సాగు నీరు – 4,47,300 ఎకరాలు
త్రాగు నీరు – 15.25 లక్షల మంది
లబ్ది పొందే జిల్లాలు – ప్రకాశం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లోని 30 మండలాలు..
మొదటి దశ (కెనాల్ డిస్ట్రిబ్యూటరీ): ప్రకాశం జిల్లా పరిధిలో 1,19,000 ఎకరాలకు సాగు నీరు,
4 లక్షల మందికి త్రాగు నీరు..
రెండవ దశ(కెనాల్ డిస్ట్రిబ్యూటరీ): ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో 3,28,300
ఎకరాలకు సాగు నీరు, 11.25 లక్షల మందికి త్రాగు నీరు..
నల్లమల సాగర్ రిజర్వాయర్ సామర్థ్యం – 53.85 టీఎంసీలు
వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడంతో లబ్ది పొందే అనుబంధ పథకాలు.
రూ. 33.82 కోట్లతో నిర్మించనున్న వెలగలపాయ ఎత్తిపోతల పథకం ద్వారా అర్ధవీడు మండలంలోని 9 గ్రామాల్లో 4,500 ఎకరాలకు సాగునీరు…
పాపినేనిపల్లి వద్ద రూ.17.34 కోట్లతో నిర్మించనున్న ఎత్తిపోతల పథకం ద్వారా అర్ధవీడు మండలంలోని 7 గ్రామాల్లో 8,500 ఎకరాలకు సాగునీరు..
రాళ్లపాడు రిజర్వాయర్ క్రింద 16,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు వెలిగొండ ప్రాజెక్టు
తూర్పు ప్రధాన కాలువ ద్వారా 1.6 టీఎంసీల సాగు నీరు..
పశ్చిమ ప్రకాశంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,657 గ్రామాలకు వాటర్ గ్రిడ్ పథకం ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్ నుండి 2.25 టీఎంసీల తాగు నీరు…
ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద 24,358 ఎకరాల విస్తీర్ణంలో ఏపీఐఐసి నిర్మించనున్న మెగా ఇండస్ట్రియల్ హబ్ కు నల్లమల సాగర్ రిజర్వాయర్ నుండి 2.58 టీఎంసీల నీటి సరఫరా..
ప్రకాశం జిల్లా పామూరు, పెదచెర్లోపల్లి మండలాల పరిధిలో 14 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అంద్ మాన్యుఫ్యాక్టరింగ్ జోన్ (NIMZ) కు వెలిగొండ ప్రాజెక్టు తూర్పు ప్రధాన కాలువ ద్వారా 1.27 టీఎంసీల నీటి సరఫరా.
వెలిగొండ జంట టన్నెల్స్ పూర్తయిన నేపథ్యంలో ఆర్ అండ్ ఆర్ ను కూడా త్వరలో పూర్తి చేసి ఇక వచ్చే సీజన్ లో నల్లమల సాగర్ లో నీళ్లు నింపడం జరుగుతుంది.
దివంగత ముఖ్యమంత్రి శ్రీ.వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం 2004లో ప్రారంభించిన ఈ వెలిగొండ ప్రాజెక్టు జంట టన్నెల్స్ పనులను జగనన్న ప్రభుత్వం పూర్తి చేయడం గమనార్హం..