విఐటి – ఏపి విశ్వవిద్యాలయంలో రెండు రోజుల వి-టాప్ (V -TAPP 2024) టెక్ ఫెస్ట్ ప్రారంభం
అమరావతి:
ది 22 ఫిబ్రవరి 2024 న సాంకేతిక విద్యలో అగ్రగామి విద్యా సంస్థ అయిన విఐటి-ఏపి విశ్వవిద్యాలయంలో రెండు రోజుల V-TAPP’2024 (విఐటి – ఏపి టెక్నికల్ ఫెస్ట్)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డా|| బుద్ధ చంద్రశేఖర్ (చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్, AICTE, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, భారత ప్రభుత్వం) మరియు గౌరవ అతిధిగా విఠల్ మద్యాల్కర్ (డైరెక్టర్ IBM ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్) హాజరయ్యారు. వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు విద్యా సంస్థల నుండి విద్యార్థులు ఈ టెక్నికల్ ఫెస్ట్ లో పాల్గొన్నారు.
V-TAPP’2024లో విద్యార్థులు తమ సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి, ఇంటరాక్టివ్ సెషన్‌లలో పాల్గొనడానికి మరియు కొత్త నైపుణ్యాలను సంపాదించడానికి డైనమిక్ ప్లాట్‌ఫారమ్‌గా పనిచేస్తుంది. “జ్ఞానాన్ని వర్తింపజేయండి, జీవితాన్ని మెరుగుపరచండి” అనే నినాదంతో ఈ ఫెస్ట్, విద్యార్థులకు వారి ప్రతిభను మరియు వినూత్న ఆలోచనలను ప్రదర్శించడానికి అసాధారణమైన అవకాశాలను అందించడం ఈ లక్ష్మే ఈ టెక్నికల్ ఫస్ట్ ముఖ్య ఉద్దేశ్యం.
ముఖ్య అతిధి డా|| బుద్ధ చంద్రశేఖర్ (చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్, AICTE, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, భారత ప్రభుత్వం) మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం (NEP) విద్య యొక్క ప్రపంచీకరణను ప్రోత్సహిస్తుందని, భారతదేశాన్ని ఒక ప్రముఖ ప్రపంచ నాలెడ్జ్ హబ్‌గా నిలబెడుతుంది తెలియచేసారు. విఐటి -ఏపి విశ్వవిద్యాలయం తన అంతర్జాతీయ టెక్ ఫెస్ట్, V-TAPP ద్వారా విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా పెంపొందించేలా వీలు కల్పిస్తుందని కొనియాడారు.
గౌరవ అతిధి విఠల్ మద్యాల్కర్ (డైరెక్టర్ IBM ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్) మాట్లాడుతూ, నేటి వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప్రపంచంలో, మారుతున్న సాంకేతికత విజ్ఞానాన్ని సంపాదించటం విద్యార్థులకు అత్యవసరంగా మారింది. సాంకేతికతలో నూతన ఆవిష్కరణలు వేగంగా చెయ్యవచ్చు. విద్యార్థులు ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి, సృజనాత్మకత మరియు ఆవిష్కరణలను పెంపొందించడానికి సాంకేతిక విజ్ఞానం ఎంతో అవసరమని తెలియచేసారు.
విఐటి – ఏపి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| ఎస్.వి కోటా రెడ్డి మాట్లాడుతూ వి – టాప్ (V-TAPP’2024) అనేది సాంకేతికత మరియు సృజనాత్మకతకు సంబంధించిన వేడుక, ఇది విద్యార్థుల నైపుణ్యాభివృద్దికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. టెక్ ఫెస్ట్ వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు సంస్థల నుండి విద్యార్థులు పోటీపడటానికి, వారి సాంకేతిక పరిధులను విస్తరించడానికి ఒక శక్తివంతమైన వేదికగా నిలుస్తుందని తెలియచేసారు. “జ్ఞానాన్ని వర్తింపజేయండి, జీవితాన్ని మెరుగుపరచండి” అనే స్ఫూర్తిదాయక నినాదం తో విద్యార్థులు వారి సాంకేతిక నైపుణ్యం మరియు సృజనాత్మకతను ప్రదర్శించడానికి అసమానమైన అవకాశాలను అందించడానికి ఈ టెక్ ఫెస్ట్ రూపొందించబడింది తెలియచేసారు.
విఐటి – ఏపి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా|| జగదీష్ చంద్ర ముదిగంటి మాట్లాడుతూ, ఫెస్ట్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ఈ టెక్ ఫస్ట్ కేవలం పోటీ మాత్రమే కాదు, విద్యార్థులు నేర్చుకోవడానికి, ఎదగడానికి మరియు నిరంతరం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప్రపంచం నుండి ప్రేరణ పొందేందుకు ఇది ఒక సహకార అందించే వేదిక అని తెలియచేసారు.
V-TAPP’2024 టెక్ ఫెస్ట్ లో యొక్క 2 రోజులు జరిగే టెక్ ఈవెంట్‌ల వివరాలు :
రోబో రేస్, షార్క్ ట్యాంక్, ఫైట్ రోబోట్స్, రోబో సాకర్ , లేజర్ ఒప్స్ , ఫ్రేమ్ ఎక్స్ వెబ్ హ్యాక్, కోడ్ అస్త్ర , వలోర్యాన్ట్, లేసర్ షో, ఫిఫా ఎక్స్ జంప్ ఫోర్స్, ఐపిఎల్ డేటాథన్, వి ఆర్ క్రికెట్ మొదలైనవి
ఈ టెక్ ఫస్ట్ ప్రారంభ క్రార్యక్రమంలో డా|| శిబి చక్రవర్తి సేతురామన్ (కన్వీనర్ వి-టాప్ 2024 టెక్ ఫెస్ట్) డా|| హరికిషన్ కొండవీటి, డా.సుధా ఎల్లిసన్ మాతే (కో-కన్వీనర్లు,వి-టాప్ 2024 టెక్ ఫెస్ట్) డా.ఖదీర్ పాషా (డిప్యూటీ డైరెక్టర్ –స్టూడెంట్ వెల్ఫేర్), విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.