“గతి తప్పిన పవనాలు” – “The Winds That Have Gone Wrong”
ఎర్ర కండువా
ఆయన మెడలో కనిపించడంలేదు
శ్రీశ్రీ, శేషేంద్రశర్మలు
ఆయన గొంతులో వినిపించడంలేదు
చేగువేరా, ఫూలే, గాంధీ ఫోటోలు
ఎక్కడా పోస్టర్లపై వేయించడం లేదు!
చేగువేరా మరో అవతారాన్ని అన్నాడు
కమ్యూనిస్టులు తన సహజమిత్రులన్నాడు!!
సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదన్నాడు!
ఉత్తరాది దురహంకారంపై యుద్ధమన్నాడు
చివరకు బీజేపీ పాచి లడ్డూలే
మహా ప్రీతి అంటున్నాడు!!
అప్పుడు కష్టజీవులుకు, కార్మికులకు..
ప్రతినిధినన్నాడు!
ఇప్పుడు ధర్మాలకు, మతాలకు
ప్రతినిధిని అంటున్నాడు!!
గతి తప్పిన రాజకీయ ఋతుపవనాలు..
మతితప్పిన వ్యవహారాలు!
ప్రాణవాయువై ప్రజాస్వామ్యానికి
ఊపిరి పోస్తానన్నాడు
ఆపానవాయువై
మత విద్వేషపు గబ్బు లేపుతున్నాడు!
Ramu Uppada
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT