The time for Group-1 Mains exams should be extended by another 3 months
Counselors are not interested in extending their tenure to the unemployed
– Paruchuri Ashok Babu
The Andhra Pradesh Public Service Commission has been turned into a political rehabilitation center and the APPSC, which is supposed to take decisions for the upliftment and upliftment of the unemployed, is acting to throw them on the road. APPSC has become a curse for the unemployed. It became chaotic due to impromptu decisions. It is not appropriate to give only 85 days for Group-1 Mains exams. APPSC deals with the lives of the unemployed. How to prepare for mains exam in 85 days. What adviser to the government said that this period is enough? The attention paid to the counselors who have no benefits is not on the unemployed who are studying hard day and night. We demand the government to give at least another 3 months.
Jagan Reddy is pushing the lives of the unemployed into darkness by giving notification after four years. Before coming to power, he promised to release the job calendar every year during the Padayatra, but after coming to power, he reneged on his promise. They destroyed the systems and the state. The unemployed should realize that nothing has happened in Jagan Reddy’s regime except destruction. It should be realized that what happened in the last four years will happen again if the incompetent and the incompetent are given power. It is sure to incur the wrath of the unemployed.
Paruchuri Ashok Babu
Members of the Legislative Council
గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు మరో 3 నెలలు సమయం పొడిగించాలి
సలహాదారులకు పదవికాలం పెంచే శ్రద్ధ నిరుద్యోగులపై లేదు
– పరుచూరి అశోక్ బాబు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి నిరుద్యోగుల అభ్యున్నతికి, ఉన్నతికి నిర్ణయాలు తీసుకొవాల్సిన ఏపీపీఎస్సీ వారిని రోడ్డున పడేసేలా వ్యవహరిస్తుంది. ఏపీపీఎస్సీ నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. ఆనాలోచిత నిర్ణయాల వల్ల అస్తవ్యస్థంగా మారింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 85 రోజులే గడువు ఇవ్వడం సరికాదు. నిరుద్యోగుల జీవితాలతో చేలగాటమాడేలా ఎపీపీఎస్సీ వ్యవహరిస్తుంది. 85 రోజుల్లో మెయిన్స్ పరీక్షకు ఏవిధంగా సిద్ధమవుతారు. ఈ కాలం సరిపోతుందని ప్రభుత్వానికి ఏ సలహాదారుడు చెప్పాడు. ఎటువంటి ప్రయోజనాలు లేని సలహాదారుల మీద ఉన్న శ్రద్ధ రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్న వారి మీద నిరుద్యోగులపై లేదు. కనీసం మరో 3 నెలల సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నాలుగేళ్ల తరువాత నోటిపికేషన్ ఇచ్చి నిరుద్యోగుల జీవితాలను అంధకారంలోకి జగన్ రెడ్డి నెట్టేస్తున్నారు. ఆధికారంలోకి రాకముందు పాదయాత్రలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారు. వ్యవస్థలను, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. విధ్వంసం తప్ప జగన్ రెడ్డి పాలనలో ఒరిగింది ఏమీ లేదని నిరుద్యోగులు గుర్తించాలి. అనర్హులకు, అసమర్థులకు అధికారం ఇస్తే గత నాలుగేళ్లలో ఏమి జరిగిందో మళ్లీ అదే జరుగుతుందని గ్రహించాలి. నిరుద్యోగుల అగ్రహనికి గుర్వడం ఖాయం.
-పరుచూరి అశోక్ బాబు
శాసన మండలి సభ్యులు