పార్థసారథి, గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రి:
* గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వ విధ్వంసక పాలన, రాష్ట్రానికి జరిగిన నష్టం, పది సూత్రాల ద్వారా ప్రస్తుత ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలు స్పష్టంగా వివరించబడ్డాయని అన్నారు.
* గత ప్రభుత్వం రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పులతో అధోగతి పాలు చేసిందని, 9,400 కోట్ల కేంద్ర రాయితీలను సద్వినియోగం చేసుకోకుండా రాష్ట్రంపై భారం మోపారని విమర్శించారు.
* ప్రస్తుత ప్రభుత్వం 9,300 కోట్ల బకాయిలు చెల్లించి కోల్పోయిన పథకాలను పునరుద్ధరించిందని, గత ఐదేళ్లలో 10.4%కి పడిపోయిన జీడీపీని 2024-25లో 12.5%కి పెంచామని తెలిపారు.
* స్వర్ణాంధ్ర 2047 ద్వారా ఈ లక్ష్యాలు సాధ్యమవుతాయని, బలహీన వర్గాల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
* గీత కార్మికులకు 15% రిజర్వేషన్, నాయి బ్రాహ్మణులకు పలు రకాల సహాయాలు అందిస్తున్నామని వివరించారు.
* గృహ నిర్మాణానికి గత ప్రభుత్వం 1.80 లక్షలలో 30,000 మాత్రమే ఇస్తుంటే, ప్రస్తుత ప్రభుత్వం 50,000 నుండి 70,000 వరకు అందిస్తోందని తెలిపారు.
* చంద్రబాబు గారు గతంలో ప్రజల వద్దకు పాలన తీసుకువెళ్ళగా, ఇప్పుడు ప్రజల చేతుల్లోకి పాలన వచ్చిందని, దీనివల్ల పరిపాలన సులభతరమైందని అన్నారు.
* 6 లక్షల కోట్లతో 4 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని, తల్లికి వందనం పథకం వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలవుతుందని ప్రకటించారు.
* ప్రస్తుత ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమతుల్యంగా సాగుతున్నాయని పేర్కొన్నారు.
* ప్రజల కోసం పోరాడాల్సిన జగన్ ఎమ్మెల్యేలు ఒక వ్యక్తి కోసం దిగజారారని, పదవుల కోసం, హాజరు కోసం మాత్రమే సభకు వస్తున్నారని, ప్రజలు వీరిని నిందిస్తున్నారని విమర్శించారు.