అమరావతి:
నక్కా ఆనంద్ బాబు (టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి) విలేకరుల సమావేశం వివరాలు
దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్, పేదవాడినని బీదపలుకులు పలకడం సిగ్గుచేటు. ఎన్నికల అఫిడవిట్లో 2009 నుంచి 2019 వరకు జగన్ సంపాదన వందలకోట్లకు ఎలా పెరిగింది? తన దోపిడీ, అవినీతి, తనప్రభుత్వ వైఫల్యాలు, దుర్మార్గాలు ఎత్తిచూపుతున్నాడన్న అక్కసుతోనే జగన్, రామోజీరావుని తప్పుడుకేసులతో వేధిస్తున్నాడు.
• బెంగుళూరులో భారీ రాజభవనం, హైదరాబాద్ లో మరో పెద్దఇల్లు, ఇడుపులపాయ, పులివెందుల, తాడేపల్లిలో ప్యాలెస్ లు ఉన్న జగన్ పేదవాడా?
• సాక్షి పత్రిక, సాక్షి ఛానల్, భారతి సిమెంట్స్ తో జగన్ కు సంబంధంలేదా?
• దేశంలోని 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవరివద్ద లేనంత డబ్బు జగన్ వద్దే ఉంది.
• 2019 ఎన్నికలకు ముందు రామోజీరావుని కలిసి, ఆయనకు వంగివంగి దండాలుపెట్టిన జగన్, ఇప్పుడు ఎందుకు పెద్దాయన్ని లక్ష్యంగా చేసుకున్నాడు?
నక్కా ఆనంద్ బాబు-
జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో జరిగేది క్యాస్ట్ వార్ కాదు..క్లాస్ వార్ అని, పేదలు… పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పడం చూస్తే నవ్వొస్తోం దని, దేశంలోనే అత్యంతధనవంతుడైన సీఎం పేదవాడు ఎలా అవుతాడని, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే మీకోసం…!
“ది ప్రింట్ వెబ్ సైట్, ఏ.డీ.ఆర్ (అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్) నివేదికలు భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తేల్చాయి. ఎన్నికల అఫి డవిట్లో తనకు రూ.510కోట్లుఉన్నట్టు జగన్ చెప్పాడు. ఆయనచెప్పిన దానిప్రకారమే ఆయా సంస్థలు దేశంలోనే అత్యంత ధనికుడైన సీఎంగా జగన్ ను పేర్కొన్నాయి. 29రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రికి లేనంత డబ్బు జగన్ వద్దే ఉంది. 28 మంది ముఖ్యమంత్రుల ఆస్తులన్నీ కలిపితే, జగన్మోహన్ రెడ్డికి ఉన్న రూ.510కోట్లతో సమానం.
తక్కువవ్యవధిలో వందలకోట్లు జగన్ ఎలా సంపాదించాడు? 2009 నుంచి 2019 నాటికి జగన్ ఆస్తిపాస్తులు ఏటికేడు అమాంతం ఎలా పెరిగాయి? తన సంపాదన వెనకున్న ఆ కిటుకు ప్రజలకు చెప్పి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలని జగన్ ను కోరుతున్నాం.
2009లో ఎంపీగా పోటిచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకు రూ.77.39కోట్లు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నాడు. మరలా 2011లో జరిగిన ఉపఎన్నికల అఫిడవిట్లో తన కు ఉన్న ఆస్తి రూ.413కోట్లు అనిచెప్పాడు. కేవలం రెండుసంవత్సరాల్లోనే ఏకంగా రూ.368 కోట్లు సంపాదించిన గొప్ప వ్యాపారవేత్త జగన్. ఆయన తనసంపాదన పెరగడానికి అనుసరి స్తున్న సూత్రాల్ని పేదలకు చెబితే, రాష్ట్రంలో క్లాస్ వార్ ఉండదుకదా! 2009-2011 మధ్యన అధికారికంగా రూ.368కోట్లు సంపాదించడం జగన్ వల్లే అయ్యింది. మరలా 2019లో జగన్ తన ఎన్నికల అఫిడవిట్లో తన సంపాదన రూ.510కోట్లుగా చూపాడు. ఈ విధంగా ఏటికేడు కోట్ల ఆస్తులు ఎలాపెరిగాయో, ఆకిటుకు ఏమిటో జగన్ ప్రజలకుచెబితే, వారుకూడా ధనవం తులు అవుతారు. పేదరికనిర్మూలనకోసం జగన్ తనసంపాదన వెనకున్న చిట్కాలను బయ టపెడితే పేదలంతా సంతోషిస్తారు. దేశంలోనే అత్యధిక సంపాదన కలిగిన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పేదపలుకులు పలుకుతూ, తానే కఠికపేదవాడు అన్నట్టు మాట్లాడటం సిగ్గుచేటు.
తండ్రి అధికారంలో ఉన్నప్పుడే లక్షలకోట్లు కొట్టేసిన జగన్, ఇప్పుడు ఏకంగా రాష్ట్రాన్ని మాఫియాలకు అడ్డాగామార్చి, లూఠీచేస్తున్నాడు.తనతండ్రి అధికారంలో ఉన్నప్పుడు జగన్ అడ్డగోలుగా లక్షకోట్లు సంపాదించాడని చెప్పారు. సీబీఐ విచారణజరిపితే, జగన్ అక్రమార్జన రూ.43వేలకోట్లుగా ఈడీతేల్చి, ఆ సొమ్ముని జప్తు చేసింది. ఈవిధంగా వేలకోట్లు కొల్లగొట్టిన జగన్ ..తానుపేదవాడిని అనడం ఎవర్ని మోసగించ డానికి? అప్పుడు లక్షకోట్లు కొల్లగొట్టిన జగన్, ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉం డి రాష్ట్రాన్ని మాఫియాలకు అడ్డాగా మార్చాడు. ఎక్కడచూసినా ల్యాండ్ మాఫియా.. శాండ్ మాఫియా..లిక్కర్ మాఫియా…ఎర్రచందనం మాఫియానే. సిమెంట్ వ్యాపారం, రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి అమ్ముకోవడం.. అనంతపురంలో లేపాక్షి భూములు, విశాఖపట్నంలో వేలాది ఎకరాలు కొట్టేయడం… గ్రానైట్, సిలికా దోపిడీ. ఇలా చెప్పుకుంటూపోతే చాలాపెద్ద జాబితా నే ఉంది. ఈ విధంగా రాష్ట్రాన్ని, ప్రజల్ని తన దోపిడీవనరులుగా మార్చుకొని, 4ఏళ్లల్లో లక్షలకోట్లు కొల్లగొట్టిన జగన్మోహన్ రెడ్డి బీదవాడా? తనకు ఏ ఆస్తులు, ఆదాయం, టీవీఛానళ్లు.. పత్రి కా సంస్థలు లేవని నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నాడు.
బెంగుళూరులోని రాజభవనం, హైదరాబాద్ లోని లోటస్ పాండ్, పులివెందుల, ఇడుపుల పాయ, తాడేపల్లి ప్యాలెస్ లు జగన్ వి కావా? సాక్షి పత్రిక, ఛానల్.. భారతి సిమెంట్స్ తో జగన్ కు సంబంధంలేదా?
బెంగుళూరులోని ఎలహంకలో ఉన్న 200గదుల భారీ రాజభవనం ఎవరిదో జగన్ చెప్పాలి. హైదరాబాద్ లోని 70గదుల లోటస్ పాండ్ భవనం..పులివెందులలో 40ఎకరాల్లో ఉన్న ప్యాలెస్ … ఇడుపులపాయలోని ప్యాలెస్.. తాడేపల్లిలో 4ఎకరాల్లో కట్టిన ప్యాలెస్ ఎవరివో జగన్ చెప్పాలి. నిత్యం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంచేసేలా తప్పుడుకథనాలు, విషపు రాతలు వండివార్చే సాక్షి మీడియా ..సాక్షి ఛానల్ ఎవరిది? జగన్ ది కాదా? భారతి సిమెం ట్స్ ఎవరిది? ఇవన్నీ పైకి కనబడేవి మాత్రమే. కంటికి కనిపించకుండా ఎవరికీ తెలియ కుండా ఇంకాఎన్నో ఆస్తులు…లక్షలకోట్ల సంపద జగన్ కు ఉంది. జగన్ ఆర్థికఉగ్రవాది అని సాక్షాత్తూ సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. ఇన్నివేలకోట్ల ఆస్తులు.. అతితక్కువసమయంలో సం పాదించడం జగన్ కు మాత్రమే సాధ్యమైంది అని కూడా చెప్పింది.
జగన్ చేస్తున్న అవినీతి, దోపిడీ, అతనిప్రభుత్వ దుర్మార్గాలను ఈనాడు బయటపెడుతుం దన్న అక్కసుతోనే జగన్ రామోజీరావుపై తప్పుడుకేసులు పెట్టి వేధిస్తున్నాడు. రామోజీరావు తప్పులుచేస్తే కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ తో గౌరవిస్తుందా?
జగన్ ప్రజల బిడ్డకాదు..ముమ్మాటికీ క్యాన్సర్ గడ్డే. ఆగడ్డను కట్ చేసి తొలగించకపోతే ప్రజ లు, రాష్ట్రమే సర్వనాశనమైపోతుంది. జగన్ చేస్తున్నదోపిడీని, అతనిప్రభుత్వం సాగిస్తున్న దుర్మార్గాలను బయటపెడుతున్నారనే రామోజీరావుపై తప్పుడుకేసులు పెట్టించారు. మార్గదర్శి సంస్థ రామోజీరావుది కాబట్టే జగన్ కు తప్పులుకనిపిస్తున్నాయి. ఈనాడు సంస్థ ఎంతో గొప్పది..విలువలు కలిగింది. రామోజీరావు పెద్దరికాన్ని కూడా గౌరవించకుండా జగన్ చెప్పుచేతల్లోని సీఐడీ కావాలనే నానాయాగీ చేస్తోంది. భారతరత్న తర్వాత అత్యంత గొప్ప పురస్కారమైన పద్మవిభూషణ్ బిరుదుతో రామోజీరావుని కేంద్రప్రభుత్వం గౌరవించింది. కేంద్రప్రభుత్వం ఏమీతెలియకుండానే పద్మవిభూషణ్ ఇచ్చి రామోజీరావుని సన్మానించిం దా? కేంద్రప్రభుత్వానికి కనిపించని తప్పులు, లొసుగులు జగన్ కు..అతని కీలు బొమ్మలైన వ్యవస్థలకు కనిపిస్తున్నాయా? జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డికూడా రామోజీరావు మార్గదర్శిపై తప్పుడు ఆరోపణలుచేసి, ఏదో తప్పుజరిగిందని నిరూపించడానికి నానా తంటాలు పడ్డా డు? ఇప్పుడు జగన్ కూడా అదేవిధంగా కొండను తవ్వుతూ ఉన్నాడు. కానీ చివరకు ఎలుకతోకను కూడా పట్టుకోలేడు.
ఎన్నికలకు ముందు జగన్, రామోజీరావుని ఎందుకుకలిశాడు? తాను ఏంకోరితే.. ఏం చేయలేదని రామోజీరావుపై , ఆయన వ్యాపారాలపై జగన్ కక్షకట్టాడు?
రామోజీరావుని కలవాల్సిన అవసరం జగన్ కు ఏమిటి? ఎన్నికలకు ముందు జగన్ స్వ యంగా వెళ్లి రామోజీరావుని కలిసి ఏం మాట్లాడాడు? ఆయన పెద్దమనిషికాకపోతే, తప్పు లుచేస్తే ఎందుకు కలవాలి? ఏం అడగటానికి..ఏం కోరడానికి జగన్ , రామోజీరావుని కలిశా డు? జగన్ అడిగిన దానిలో ఏంచేయలేదని రామోజీరావుపై, ఆయన సంస్థలపై జగన్ ఇప్పుడు తప్పుడుకేసులు పెడుతున్నాడు? సీఐడీచేతిలో ఉందని విలువల్నినాశనంచేస్తూ, వ్యవ స్థలను దిగజారుస్తూ ఎందుకు హద్దులుమీరి ప్రవర్తిస్తున్నాడు? ఈనాడు విశ్వసనీయతను తగ్గించడానికే జగన్ ఆసంస్థ యాజమాన్యంపై, వారిచేతిలోని ఇతరవ్యాపారాలపై బురదజల్లు తున్నాడు. ప్రజల్లో ఈనాడుకి, ఈ టీవీకి ఉన్న ఆదరణ.. విశ్వసనీయతను నీరుగార్చడానికే జగన్ ఇలాంటి దిక్కుమాలిన చర్య లకు పాల్పడుతున్నాడు. జగన్ అధికారంలోకి వచ్చిన ప్పటినుంచి అతని దందాలు..మాఫియాను ఈనాడు బయటపెడుతుందనే దాని యాజమా న్యంపై జగన్ అక్కసువెళ్లగక్కుతున్నాడు. జగన్ ఇలాంటి కుయుక్తులు ఎన్నిపన్నినా… ఎన్ని కుట్రలుచేసినా రామోజీరావుని, చంద్రబాబుని, తెలుగుదేశాన్ని ఏమీచేయలేడు. ప్రజ లు జగన్ కుట్రలు, కుతంత్రాలు గమనిస్తూనే ఉన్నారు. అతను చెప్పేవినమ్మి, మరోసారి తమజీవితాలు నాశనంచేసుకోవడానికి జనం సిద్ధంగా లేరు.” అని ఆనంద్ బాబు తేల్చిచెప్పారు.
Amaravati:
Nakka Anand Babu (TDP Polit Bureau Member, Former Minister) Press Conference Details
It is a shame that Jagan, who is the richest Chief Minister in the country, complains that he is poor. How did Jagan’s income increase to hundreds of crores from 2009 to 2019 in the election affidavit? He is harassing Jagan and Ramoji Rao with false cases while pointing out his robbery, corruption, failures and misdeeds of his government.
• Jagan who has a huge palace in Bangalore, another big house in Hyderabad, palaces in Idupulapaya, Pulivendula, Tadepalli is poor?
• Is Jagan not related to Sakshi Patrika, Sakshi Channel, Bharti Cements?
• Jagan has more money than any of the chief ministers of the 29 states of the country.
• Why is Jagan, who bowed to Ramoji Rao before the 2019 elections, now targeting Peddayan?
Nakka Anand Babu-
Jaganmohan Reddy recently said that what is going on in the state is not a caste war, but a class war, it is laughable to see that there is a war going on between the poor and the beggars. How can the richest CM in the country become poor, TDP politburo member and former minister Nakka Anand Babu questioned.
He spoke to reporters at the party’s national office in Mangalagiri on Thursday. Those details are for you in brief in his words…!
“The print website, ADR (Association for Democratic Reforms) reports that Jagan Mohan Reddy is the richest Chief Minister in India. Jagan said that he has Rs. 510 crores in election affidavit. According to what he said, the organizations named Jagan as the richest CM in the country. Jagan has more money than any chief minister in 29 states. If all the assets of 28 Chief Ministers are combined, it is equal to Rs.510 crores of Jaganmohan Reddy.
How did Jagan earn hundreds of crores in a short period of time? From 2009 to 2019, how did Jagan’s assets increase? We are asking Jagan to tell people about the kit behind his earnings and make the state poverty-free.
In 2009, when he contested as an MP, Jaganmohan Reddy stated in his election affidavit that he had Rs.77.39 crores. Again in the by-election affidavit held in 2011, he said that his assets are Rs.413 crores. Jagan is a great businessman who earned Rs.368 crores in just two years. If he tells the poor the principles he follows to increase his income, won’t there be a class war in the state! Between 2009-2011, the official earning of Rs.368 crores was due to Jagan. Again in 2019, Jagan showed his income as Rs.510 crore in his election affidavit. In this way, if Jagan tells the people how the assets of Atikedu Crores have increased and what is Akita, they will also become rich. All the poor will be happy if Jagan reveals the tips behind his earnings for poverty eradication. It is a shame that Jagan, who is the highest earning Chief Minister in the country, calls the poor and says that he is a poor man.
Jagan, who made lakhs of crores when his father was in power, is now turning the state into an obstacle for mafias and looting.
He said that when his father was in power, Jagan earned lakhs of crores. When the CBI investigated, the ED found Jagan’s embezzlement to be Rs. 43 thousand crores and confiscated the money. Jagan, who has looted thousands of crores in this way. Jagan, who looted lakhs of crores then, is now the chief minister and has turned the state into an obstacle for mafias. Wherever you look, land mafia.. sand mafia.. liquor mafia… red sandalwood mafia. Cement business, recycling and selling ration rice.. Lepakshi lands in Anantapur, cutting thousands of acres in Visakhapatnam… Extortion of granite and silica. That being said, there is a long list. Is Jaganmohan Reddy, who made the state and the people his exploits and looted lakhs of crores in 4 years, a poor man? He is brazenly lying that he has no assets, income, TV channels, media or organizations.
Are Jagan’s palaces in Bangalore, Lotus Pond, Pulivendula, Idupula Paya, Tadepalli Palaces in Hyderabad? Is Jagan not related to Sakshi Magazine, Channel.. Bharti Cements?
Jagan should tell who owns the huge 200-room palace in Elahanka, Bangalore. Jagan should tell who the 70-room Lotus Pond building in Hyderabad is. Sakshi media which is constantly cooking up false stories and poisonous articles to make a mockery of democracy ..Who owns Sakshi channel? Isn’t it Jagan? Who owns Bharti Cements? All these are just appearances. Jagan has a wealth of lakhs of crores of assets which are invisible to the eye and unknown to anyone. The Supreme Court has declared that Jagan is an economic terrorist. She also said that it was only possible for Jagan to earn these billions of assets in a very short time.
Jagan is harassing Ramoji Rao by filing false cases with the same sister who exposes Jagan’s corruption, extortion and his government’s misdeeds. If Ramoji Rao makes mistakes, will central government honor him with Padma Vibhushan?
Jagan is not a child of the people..everyone gets cancer. If the soil is not cut and removed, the people and the state will be destroyed. False cases were filed against Ramoji Rao for exposing Jagan’s exploitation and the evils of his government. As the guiding organization belongs to Ramoji Rao, Jagan is seeing mistakes. Today the organization is very rich..with values. Ramoji Rao is trying to become CID under Jagan’s shoes without respecting his seniority. Ramoji Rao was honored by the Central Government with the Padma Vibhushan, the highest award after the Bharat Ratna. Did the central government honor Ramoji Rao by giving Padma Vibhushan without knowing anything? Are the mistakes and loopholes that are not visible to the central government visible to Jagan..His puppet systems? Did Jagan’s father Rajasekhar Reddy also make false accusations against Ramoji Rao’s guide and tried to prove that something was wrong? Now Jagan is similarly digging the hill. But finally he can’t even catch the rat’s tail.
Why did Jagan meet Ramoji Rao before the election? What did he ask for?
Why does Jagan need to meet Ramoji Rao? What did Jagan himself talk with Ramoji Rao before the election? If he is not a gentleman, why meet him if he is wrong? Did you meet Jagan and Ramoji Rao to ask for what? Jagan is now filing false cases against Ramoji Rao and his organizations for not doing what Jagan asked? Why is he behaving out of bounds by destroying the values and degrading the economy as it is in the hands of CID? Today, to reduce credibility, Jagan is spreading mud on the ownership of the company and other businesses in their hands. Jagan is doing such perverse actions to undermine the credibility of Eanadu and this TV among the people. Ever since Jagan came to power, Jagan has been working hard on his idea that he will expose the mafia today. No matter how many tricks Jagan does, no matter how many conspiracies he does, he cannot do anything to Ramoji Rao, Chandrababu and the Telugu country. People are watching Jagan’s conspiracies and machinations. People are not ready to have their lives destroyed again, he says.” Anand Babu concluded.