Pawan Kalyan: జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్..
జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కల్యాణ్ ఎన్నికయ్యారు. ఈ రోజు ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్‌ను ప్రతిపాదించారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా బలపరిచారు.
Pawan Kalyan
అమరావతి: జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ కల్యాణ్ ఎన్నికయ్యారు. ఈ రోజు ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్‌ను ప్రతిపాదించారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా బలపరిచారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 164 సీట్లు సాధించిన విషయం తెలిసిందే. కూటమిలో భాగమైన జనసేన 21కి 21 సీట్లు గెలుచుకుంది. అయితే ఈ నెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు మరికొంతమంది కూటమి ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.