ఆగస్టు 30న పొట్టి శ్రీరాములు కాలేజీలో జాతీయ హ్యాకథాన్
పొట్టి శ్రీరాములు చలువాది మల్లిఖార్జునరావు ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఏడాది ఆగస్టు 30న జాతీయ స్థాయి హ్యాకథాన్‌ను నిర్వహిస్తున్నట్లు కళాశాల నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆగస్టు 30న పొట్టి శ్రీరాములు కాలేజీలో జాతీయ హ్యాకథాన్
వన్‌టౌన్, జూలై 3: పొట్టి శ్రీరాములు చలువాది మల్లిఖార్జునరావు ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఏడాది ఆగస్టు 30న జాతీయ స్థాయి హ్యాకథాన్‌ను నిర్వహిస్తున్నట్లు కళాశాల నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను విద్యాశాఖ, ఐటీ, మానవవనరులశాఖ మంత్రి లోకేశ్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల కమిటీ ప్రాక్టికల్ లెర్నింగ్‌ను ప్రోత్సహించడాన్ని మంత్రి అభినందించారు. ఇంజనీరింగ్, డిప్లొమో, ఆర్ట్స్, సైన్స్, ఆర్కిటెక్చర్, మేనేజ్‌మెంట్, మెడిసిన్, ఫార్మసీ విద్యార్థులను హ్యాకథాన్‌కు ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముందుగా పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. కళాశాల ప్రెసిడెంట్ చలువాది మల్లిఖార్జునరావు, ఉపాధ్యక్షుడు పొట్టి సురేంద్రకుమార్, కార్యదర్శి, సీఏ చిట్టా అమర్ సుధీర్, జాయింట్ సెక్రటరీ గ్రంథి పవన్‌కుమార్, కోశాధికారి కాజా రాఘవయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ జే.లక్ష్మీనారాయణ, వైస్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.పతంజలి శాస్త్రి, డేటా సైన్స్ హెడ్ డాక్టర్ ఎస్‌కే అక్బర్‌లు హ్యాకథాన్ నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.